విష జ్వరాలు ప్రబలిన మాట వాస్తవమే : ఈటల

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో విష జ్వరాలు ప్రబలిన మాట వాస్తవమేనని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను భయాందోళనలకు గురి చేయవద్దని ఆయన విపక్షాలను కోరారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో విష జ్వరాలు ప్రబలడంతో ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు చేశామని చేశారు. కష్టకాలంలో ప్రభుత్వానికి విపక్షాలు అండగా ఉండాలని ఆయన సూచించారు. 541 కేంద్రాల్లో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని […] The post విష జ్వరాలు ప్రబలిన మాట వాస్తవమే : ఈటల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో విష జ్వరాలు ప్రబలిన మాట వాస్తవమేనని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను భయాందోళనలకు గురి చేయవద్దని ఆయన విపక్షాలను కోరారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో విష జ్వరాలు ప్రబలడంతో ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు చేశామని చేశారు. కష్టకాలంలో ప్రభుత్వానికి విపక్షాలు అండగా ఉండాలని ఆయన సూచించారు. 541 కేంద్రాల్లో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. నీతి అయోగ్ తెలంగాణకు మూడో ర్యాంకును ఇచ్చిందని ఆయన తెలిపారు. ఆస్పత్రుల్లో ఐసియును మొట్టమొదటి సారిగా ఏర్పాటు చేసింది టిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. 9,381 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చిందని ఆయన పేర్కొన్నారు. వ్యకిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా విష జ్వరాలను అదుపులో ఉంచొచ్చని ఆయన చెప్పారు.

Minister Etela Rajender Comments On Toxic Fevers

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post విష జ్వరాలు ప్రబలిన మాట వాస్తవమే : ఈటల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.