యూరేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదు : కెటిఆర్

హైదరాబాద్ : నల్లమల అటవీ ప్రాంతంలో యూరేనియం తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని తెలంగాణ మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్పష్టం చేశారు. శాసనమండలి సమావేశాల్లో భాగంగా నిర్వహించిన ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ అంశంపై సమాధానం ఇచ్చారు. నల్లగొండ జిల్లా పరిధిలోని లంబాపూర్, పెద్దగట్టు , చిత్రియాల్ లలో 1992-2012 మధ్య కాలంలో ఎఎండి యూరేనియం అన్వేషణ కోసం సర్వే చేపట్టిందని ఆయన తెలిపారు. సుమారు 18 వేల 550 మెట్రిక్ టన్నుల […] The post యూరేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదు : కెటిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : నల్లమల అటవీ ప్రాంతంలో యూరేనియం తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని తెలంగాణ మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్పష్టం చేశారు. శాసనమండలి సమావేశాల్లో భాగంగా నిర్వహించిన ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ అంశంపై సమాధానం ఇచ్చారు. నల్లగొండ జిల్లా పరిధిలోని లంబాపూర్, పెద్దగట్టు , చిత్రియాల్ లలో 1992-2012 మధ్య కాలంలో ఎఎండి యూరేనియం అన్వేషణ కోసం సర్వే చేపట్టిందని ఆయన తెలిపారు. సుమారు 18 వేల 550 మెట్రిక్ టన్నుల యూరేనియం నిక్షేపాలు ఉన్నట్టు ఎఎండి సర్వేలో తేలిందని ఆయన చెప్పారు. డిఎఇ, ఎఎండి తరపున నాగార్జునసాగర్ డబ్ల్యూఎల్ లోని చింత్రియాల్ ప్రాంతంలో అదనపు 50 చదరపు కిలోమీటర్ల పైబడి సర్వే చేశారని, బోర్లను తవ్వడం కోసం ప్రధాన అటవీ ముఖ్య పర్యవేక్షకునికి 2012లో నాటి ఉమ్మడి ఎపి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. నల్లమలలో యూరేనియం నిల్వలు ఉన్నప్పటికీ, వాటిని తవ్వి తీసేందుకు అనుమతి ఇవ్వబడదన్న ఒప్పందంతో 2016లో రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఆదేశాలు ఇచ్చారని ఆయన వెల్లడించారు. నల్లమలలో యూరేనియం తవ్వకాలకు ఎటువంటి అనుమతి ఇవ్వదన్న విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్టు కెటిఆర్ సభ్యులకు సమాధానం ఇచ్చారు.

Uranium Mining Not Allowed : KTR

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post యూరేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదు : కెటిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.