కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తను చంపిన భార్య

రంగారెడ్డి: షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ఫరూక్ నగర్ మండలం కందివనం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున తన భర్తను ఓ భార్య హత్య చేసింది.  చిట్యాల శారద అనే వివాహిత తన భర్త విష్ణును కత్తితో పొడిచి హత్య చేసింది. విష్ణు హత్యకు కుటుంబ కలహాలే కారణమని గ్రామ ప్రజలు తెలిపారు. గ్రామ ప్రజలు శారదను చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. విష్ణు , శారద దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. విష్ణు […] The post కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తను చంపిన భార్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రంగారెడ్డి: షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ఫరూక్ నగర్ మండలం కందివనం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున తన భర్తను ఓ భార్య హత్య చేసింది.  చిట్యాల శారద అనే వివాహిత తన భర్త విష్ణును కత్తితో పొడిచి హత్య చేసింది. విష్ణు హత్యకు కుటుంబ కలహాలే కారణమని గ్రామ ప్రజలు తెలిపారు. గ్రామ ప్రజలు శారదను చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. విష్ణు , శారద దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. విష్ణు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం కోసం విష్ణు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Wife Killed Her Husband In Face Of Family Quarrels

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తను చంపిన భార్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: