నేటి నుంచి భారత్-దక్షిణాఫ్రికా టీ20 సిరీస్

  హైదరాబాద్: వెస్టిండీస్ పర్యటనని అజేయంగా ముగించిన టీమిండియా ఆదివారం నుంచి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో తలపడబోతోంది. దక్షిణాఫ్రికాతో 3 టీ20, 3 టెస్టు సిరీస్‌లు ఆడనుంది. ఇందులో భాగంగా భారత్ మొదట టీ20 సిరీస్‌లో దక్షిణాఫ్రికాను ఢీకొట్టబోతోంది. ఈరోజు ధర్మశాల స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకి ఇరుజట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ ప్రారంభంకానుంది. అయితే, ఈ మ్యాచ్‌కి వర్షం ముప్పు పొంచి ఉండడంతో పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. ఇక, టీమిండియా జట్టులో సీనియర్ […] The post నేటి నుంచి భారత్-దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: వెస్టిండీస్ పర్యటనని అజేయంగా ముగించిన టీమిండియా ఆదివారం నుంచి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో తలపడబోతోంది. దక్షిణాఫ్రికాతో 3 టీ20, 3 టెస్టు సిరీస్‌లు ఆడనుంది. ఇందులో భాగంగా భారత్ మొదట టీ20 సిరీస్‌లో దక్షిణాఫ్రికాను ఢీకొట్టబోతోంది. ఈరోజు ధర్మశాల స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకి ఇరుజట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ ప్రారంభంకానుంది. అయితే, ఈ మ్యాచ్‌కి వర్షం ముప్పు పొంచి ఉండడంతో పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. ఇక, టీమిండియా జట్టులో సీనియర్ ఆటగాళ్లు బుమ్రా, షమీ, భువనేశ్వర్, ధోనీలకు ఈ సిరీస్లో విశ్రాంతి కల్పించారు. వీరి స్థానంలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చారు. సీనియర్, యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇక, దక్షిణాఫ్రికా కూడా యువ ఆటగాళ్లతో బరిలోకి దిగుతోంది. డుప్లెసిస్‌ను తప్పించి పొట్టి ఫార్మాట్‌లో డికాక్ సారథ్య బాధ్యతలు అప్పగించారు.

IND vs SA T20 Series begins from today at Dharamshala

The post నేటి నుంచి భారత్-దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: