అద్భుత కట్టడాల రూపశిల్పి

  గంధపు చెక్కవలే సేవలో అరిగిపో, కాని ఇనుములా తుప్పు పట్టవద్దు. అనే మాటలను తుచ తప్పకుండా పాటించిన గొప్ప వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య. మేం మాటలతో కాలయాపన చేశాం, మీరు నిరంతర క్రియాశూరులై నవ భారత నిర్మాణానికి కృషి చేసిన మహనీయులంటూ 1961 సెప్టెంబర్ 15న బెంగుళూరులో జరిగిన విశ్వేశ్వరయ్య శతాబ్ది వేడుకల్లో అప్పటి ప్రధాని నెహ్రూ చేత ప్రశంసలు పొందిన అపర భగీరథుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ప్రజల సంపాదనాశక్తిని, కార్యదక్షతను నైపుణ్యాన్ని రకరకాలైన చేతి […] The post అద్భుత కట్టడాల రూపశిల్పి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

గంధపు చెక్కవలే సేవలో అరిగిపో, కాని ఇనుములా తుప్పు పట్టవద్దు. అనే మాటలను తుచ తప్పకుండా పాటించిన గొప్ప వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య. మేం మాటలతో కాలయాపన చేశాం, మీరు నిరంతర క్రియాశూరులై నవ భారత నిర్మాణానికి కృషి చేసిన మహనీయులంటూ 1961 సెప్టెంబర్ 15న బెంగుళూరులో జరిగిన విశ్వేశ్వరయ్య శతాబ్ది వేడుకల్లో అప్పటి ప్రధాని నెహ్రూ చేత ప్రశంసలు పొందిన అపర భగీరథుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య.

ప్రజల సంపాదనాశక్తిని, కార్యదక్షతను నైపుణ్యాన్ని రకరకాలైన చేతి పనుల ద్వారా పెంపొందించాలి. చేతనైన వారందరూ కష్టించి పని చేసే వీలు కల్పించాలి. యాంత్రిక శక్తిని ఉపయోగించుకుని దేశ పారిశ్రామిక ప్రగతికి ముందంజ వేయాలి. భారతీయుల నరనరాల్లో జీర్ణించుకు పోయిన ్ట“అంతా పైవాడు చూసుకుంటాడు, మన ఖర్మ ఇంతేలే” అన్న నిర్లక్ష్య భావాలు రూపుమాపి నిరంతర కృషి ద్వారా సంపదను సాధించే దీక్షను, కర్తవ్య పాలనను ప్రజలలో రేకెత్తించుట ప్రభుత్వం కర్తవ్యం. గొప్ప సివిల్ ఇంజినీర్‌గా, పాలనాదక్షుడిగా పేరొందిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య నవ భారత నిర్మాణానికి ఎనలేని కృషి చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో 30 ఏళ్లపాటు సేవలు అందించిన ఆయన దేశ ప్రగతి సాధన కృషిలో భాగస్వామ్యం పంచుకున్నారు.

శ్రీనివాస శాస్త్రి, వెంకట లక్ష్మమ్మ అనే దంపతులకు 1861 సెప్టెంబర్ 15న విశ్వేశ్వరయ్య జన్మించాడు. తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో గల మోక్షగుండం అనే గ్రామం నుంచి కర్నాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లా చిక్‌బల్లాపూర్ సమీపంలోని ముద్దనహళ్లికి వెళ్లి స్థిరపడ్డారు. ప్రాథమిక విద్య చిక్‌బల్లాపూర్‌లో సాగింది. తన 15వ ఏటనే తండ్రిని కోల్పోయిన విశ్వేశ్వరయ్య మేనమామ రామయ్య ప్రోత్సాహంతో బెంగళూరు సెంట్రల్ కాలేజీలో 1880లో ఎం.ఎలో ప్రథమ స్థానంలో పాసయ్యారు. గణితంలో ప్రతిభ కలిగిన విశ్వేశ్వరయ్యను మైసూరు రాజ్య దివాను రంగయ్య గుర్తించి ప్రభుత్వానికి సిఫారస్సు చేసి స్కాలర్‌షిప్ ఇప్పించారు. ఆ ఉపకార వేతనంతో ఆయన పుణే వెళ్లి ఇంజినీరింగ్ పూర్తి చేశాడు.

దీంతో బొంబాయి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా పబ్లిక్ వర్క్ శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా నియమించింది. మరుసటి ఏడాది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా నియమితులయ్యారు. ఆంగ్ల పాలకులు విశ్వేశ్వరయ్య కార్యదీక్షను గుర్తించి ప్రపంచ జలాశయాల్లో ఒక్కటైన సుక్నూర్ బరాజ్ నిర్మాణానికి ఇంజినీర్‌గా నియమించారు.దీంతో సింధూనది నీరు సుక్నూర్‌కు చేరేలా చేశాడు. ఆ నది నీరు వడగట్టడానికి ఒక వినూత్న విధానం రూపొందించారు. దాహరి దగ్గర నంబనది మీద సైఫన్ పద్ధతిన కట్ట నిర్మించారు. అక్కడ విశ్వేశ్వరయ్య మేధాశక్తితో ఆటో మేటిక్ గేట్లు నిర్మించి అందరినీ ఆశ్చర్యపరచారు.

1909లో మైసూర్ ప్రభుత్వం ఆయనను చీఫ్ ఇంజినీర్ గా నియమించింది. కృష్ణరాజసాగర్ డ్యాం డిజైన్ ఆయన ఆధ్వర్యంలోనే నిర్మాణం జరిగింది. దేశంలోనే తొలిసారిగా నీటి వృథాని అరికట్టేందుకు నూతన చర్యలను చేపట్టారు. వర్షపు నీటిని ప్రాజెక్టుల ద్వారా నిలుపుదల చేశారు. ప్రవహించే నీటిని ఆనకట్టలు, ఉక్కు తలుపుల ద్వారా అరికట్టడానికి రూపకల్పన చేసి తన ఆధ్వర్యంలోనే నిర్మాణాలు చేపట్టారు. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ డ్రైనేజీ పద్ధతులకు రూప కల్పన చేసింది కూడా ఆయనే. ప్రముఖ ఇంజినీర్లు అయిన కె.ఎల్.రావు, జాఫర్ అలీలు కూడా ఆయన సహాయ సహకారాలు తీసుకున్న వారే. విశ్వేశ్వరయ్యకు 1948 లో మైసూర్ ప్రభుత్వం డాక్టరేట్ ఎల్.ఎల్.డి ఇచ్చి సత్కరించింది. అలాగే బాంబే, కోల్‌కతా, బెనారస్, అలహాబాద్ తదితర యూనివర్శిటీలు డాక్టరేట్ పురస్కారాలను అందజేశాయి. భారత ప్రభుత్వం 1955లో భారతరత్న అవార్డును ప్రదానం చేసి ఘనంగా సన్మానించింది. ఆయన ఇండియన్ ఇరిగేషన్ కమిషన్ సభ్యులుగా, కర్నాటకలో చీఫ్ ఇంజినీరుగా అనేక బాధ్యతలను నిర్వహించి సివిల్ ఇంజనీరింగ్‌లో అప్పట్లోనే నూతన వరవడులను సృష్టించి ప్రపంచ స్థాయిలో రికార్డులు సాధించారు.

1901లో భారత ప్రభుత్వ ప్రతినిధిగా విశ్వేశ్వరయ్య జపాన్ వెళ్ళి అక్కడ కుటీర పరిశ్రమల తీరుతెన్నులను అవలోకించారు. ఆ పద్ధతిలో కుటీర పరిశ్రమల అభివృద్ధికి బృహత్ పథకాన్ని రూపుదిద్ది ప్రభుత్వానికి అందించారు. జపాన్ పర్యటనానంతరం, విశ్వేశ్వరయ్య పుణే నగర నీటి సరఫరా పథకాన్ని రూపొందించారు. ఆ నిర్మాణ కాలంలోనే ఆటోమేటిక్ స్లూస్‌గేట్ రూపొందించారు. ఈ స్లూస్‌గేట్ నిర్మాణం ప్రపంచ ఇంజనీర్ల మన్నన లందుకున్నది. ఈ కొత్త పరిశోధనను తన పేరు మీద పేటెంట్ చేసుకోవలసిందిగ మిత్రులు సూచించారు. తన కార్యనిర్వహణలో భాగంగా సాగినది కావున పేటెంట్ తీసుకోవటం సముచితం కాదని సున్నితంగా తిరస్కరించి తన గొప్ప మనసును చాటాడు.

తన స్వంత రాష్ట్రమైన మైసూరు సంస్థానాన్ని ఆదర్శ సంస్థానంగా తీర్చిదిద్దినవారు ఆయన. చీఫ్ ఇంజినీర్ గా, ఆ తర్వాత దివాన్ గా పని చేసిన ఆరేళ్ళలో అరవయ్యేళ్ళ అభివృద్ధిని సాధించారు. హెబ్బాళ్ వ్యవసాయ కళాశాల, మైసూరు విశ్వవిద్యాలయం, చాంబర్ ఆఫ్ కామర్స్, సోప్ ఫ్యాక్టరీ, కన్నడ సాహిత్య పరిషత్ మున్నగు వాటిని నెలకొల్పారు. విశ్వేశ్వరయ్య ప్రజ్ఞాప్రతిఫలంగా నిర్మింపబడినదే కృష్ణరాజసాగర్, లక్షలాది ఎకరాల మెట్ట భూములు సస్యశ్యామలంగా మారాయి. బృందావన్ ఉద్యానవనం వారి ప్రకృతి ప్రేమకు నిదర్శనం. భారత దేశ సంస్థానాలలో మొదటి ఉక్కు కర్మాగారం నెలకొల్పినది కూడా మైసూరు ప్రాంతంలోనే .

100 సంవత్సరాల వయస్సులో కళ్ళద్దాలు లేకుండా చదివేవారు. దేశ విదేశాలలోని అనేక విశ్వవిద్యాలయాలు వారిని సత్కరించాయి. విశ్వేశ్వరయ్య నూరు సంవత్సరాలు పైగా జీవించి ఇంజనీరింగ్ రంగానికే పితామహుడయ్యారు. 1911లో ఆయన కంపేనియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ గా నియమితులయ్యారు. 1915లో మైసూరు దివానుగా ఉండగా ఆయన ప్రజలకు చేసిన ఎన్నో సేవలకు గాను బ్రిటిషు ప్రభుత్వం నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ అనే బిరుదును ఇచ్చింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1955 లో భారత దేశపు అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రదానం చేశారు.

భారతదేశంలోని ఎనిమిది విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి 1923లో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌కు ఆయన అధ్యక్షుడుగా వ్యవహరించాడు. విశ్వేశ్వరయ్యకు అనేక రంగాలలో విశేషమైన గుర్తింపు లభించింది. అందులో ప్రధానమైనవి విద్యారంగం, ఇంజినీరింగ్. కర్నాటకలోని అత్యధిక ఇంజినీరింగ్ కళాశాలలు అనుబంధమై ఉన్న బెల్గాంలోని విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ యూనివర్శిటీ ఆయన పేరు మీద నెలకొల్పబడింది. ఇంకా బెంగళూరులోని యూనివర్శిటీ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, సర్‌ఎమ్. విశ్వేశ్వరయ్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పుణేలోని నాగపూర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆయన పేరు మీదుగా పిలవబడుతున్నాయి. పుణేలో ఆయన నిలువెత్తు విగ్రహాన్ని చూడవచ్చు. ఇంజినీర్‌గా విశేషంగా దేశానికి సేవ చేసిన విశ్వేశ్వరయ్య 1962 ఏప్రిల్ 12వ తేదీన తన 101 సంవత్సరాల వయసులో కాలం చేశారు.

Article about Sir Mokshagundam Visvesvaraya Biography

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అద్భుత కట్టడాల రూపశిల్పి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.