ఐటిఐఆర్‌కు పైసా ఇవ్వలె

అయినా రాష్ట్రంలో ఐటి అభివృద్ధి ఘనంగా సాగుతోంది .. హైదరాబాద్ నలుదిక్కులా కంపెనీలు విస్తరిస్తున్నాయి..త్వరలో కరీంనగర్‌లో ఐటి టవర్ : మంత్రి కెటిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్: ఐటిఐఆర్ పాలసీ కింద యూపిఏ-2 ప్రభుత్వం, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన ఎన్‌డిఎ ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదని మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. శాసనసభలో శనివారం ప్రశ్నోత్తరాల స ందర్భంగా ఐటి పరిశ్రమ బలోపేతానికి ప్రభు త్వం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి స భ్యులు […] The post ఐటిఐఆర్‌కు పైసా ఇవ్వలె appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అయినా రాష్ట్రంలో ఐటి అభివృద్ధి ఘనంగా సాగుతోంది .. హైదరాబాద్ నలుదిక్కులా కంపెనీలు విస్తరిస్తున్నాయి..త్వరలో కరీంనగర్‌లో ఐటి టవర్ : మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: ఐటిఐఆర్ పాలసీ కింద యూపిఏ-2 ప్రభుత్వం, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన ఎన్‌డిఎ ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదని మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. శాసనసభలో శనివారం ప్రశ్నోత్తరాల స ందర్భంగా ఐటి పరిశ్రమ బలోపేతానికి ప్రభు త్వం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి స భ్యులు శ్రీధర్‌బాబు, వివేకానంద, గ్యాదరీ కిషోర్‌లు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని పదిసార్లు కలిసి అడిగామని, లేఖలు రాశామన్నారు. నాటి కేం ద్ర సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఐటిఐఆర్ వారి పాలసీ కాదని చెప్పారని గుర్తు చేశారు. దాన్ని ముందుకు తీసుకెళ్లాం చెప్పారని తెలిపారు. నాడు రాష్ట్రం నుంచి కేంద్రమంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయ తెలంగాణ ప్ర భుత్వం సమాచారం ఇవ్వనందుకే ఐటిఐఆర్ ఇవ్వలేదని మాట్లాడారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన లేఖలను ఆ మరుసటి రోజే దత్తాత్రేయకు చూపించి వివరించినట్లు కెటిఆర్ పేర్కొన్నారు. బెంగళూరుకు, హైదరాబాద్‌కు ఐటిఐఆర్ మంజూరు చేశారని, ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు.

రాష్ట్రంలో ఐటిఐఆర్ ప్రాజెక్టుకు గాలికొదిలేశారని మాట్లాడుతున్న కాంగ్రెస్.. బెంగళూరులో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పటికీ ఎందుకు నిధులు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. అయినా కేంద్రం నుంచి నిధులు రాకపోయినా రాష్ట్రంలో ఐటి అభివృద్ధి ఆగలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పాలసీలతో తెలంగాణలో 17 శాతం వృద్ధిని ఐటి రంగంలో సాధించామని తెలిపారు. ఉత్తర, దక్షిణ హైదరాబాద్‌లో కూడా ఐటిని ప్రోత్సహిస్తున్నామని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ నలువైపులా ఐటి కంపెనీలను విస్తరిస్తామన్నారు. కరీనంగర్‌లో రాబోయే నెలలో ఐటి టవర్‌ను ప్రారంభించబోతున్నామని చెప్పారు. ఖమ్మం, నిజామాబాద్‌లోనూ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వరంగల్‌లో టి హబ్, ఐటి టవర్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ ఐటి టవర్‌కు టెండర్ పూర్తయిందన్నారు. 50 ఎకరాల స్థల సేకరణ జరిగిందన్నారు. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా బిపిఒ సంస్థలు ప్రారంభమయ్యాయని మంత్రి తెలిపారు.
ఐదేళ్లలో రెట్టింపు ఐటి ఎగుమతులు
గడిచిన ఐదేళ్లలో ఐటి ఎగుమతులు రెట్టింపు చేశామని కెటిఆర్ తెలిపారు. అవసరమైతే ఓల్డ్ సిటిలో ఒక స్టార్టప్‌ను ప్రారంభించేందుకు సిద్దంగా ఉన్నమన్నారు. రాష్ట్రం నుంచి రాయితీలు, కరెంట్ సబ్సిడీ, రిబేట్లు ఇస్తున్నందునే స్థానికులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయన్నారు. టాస్క్ ద్వారా అవసరమైన వారికి ఉపాధి శిక్షణా కూడా ఇస్తున్నట్లు వివరించారు. గేమింగ్ టవర్ (ఇమేజ్)ను రాబోయే రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారు. ఇన్నోవేషన్ పాలసీ, డ్రోన్ పాలసీ, సైబర్ సెక్యూరిటీ విధానాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. 201415 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో ఐటి ఎగుమతుల విలువ రూ. 52 వేల కోట్లు కాగా, 201819 ఆర్థిక సంవత్సరం నాటికి వంద శాతానికి పైగా పెరిగి లక్షా 10 వేల కోట్ల రూపాయాలకు చేరుకోవడం తెలంగాణ సాధించిన అద్భుత విజయానికి నిదర్శనమన్నారు.

 No funds received from Centre for Hyderabad ITIR

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఐటిఐఆర్‌కు పైసా ఇవ్వలె appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: