కాళేశ్వరం ఓ అద్భుతం

కేంద్రం విధానాల వల్ల అన్ని రంగాలు కుదేలు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాలో అన్యాయం ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ వల్లే పేదలకు మేలు మన తెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ఓ అద్భుతమైన ప్రాజెక్టు అని మజ్లిస్ పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసి అన్నా రు. దేశం గర్వించదగ్గ ప్రాజెక్టును టిఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణకు అందించిందని హర్షం వ్యక్తం చేశారు. రాను న్న మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రజలు టిఆర్‌ఎస్‌ను పట్టం కడతారని అభిప్రాయపడ్డారు. శాసనసభ సమావేశాల్లో […] The post కాళేశ్వరం ఓ అద్భుతం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కేంద్రం విధానాల వల్ల
అన్ని రంగాలు కుదేలు
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాలో అన్యాయం
ఆయుష్మాన్ భారత్
కంటే ఆరోగ్యశ్రీ వల్లే పేదలకు మేలు

మన తెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ఓ అద్భుతమైన ప్రాజెక్టు అని మజ్లిస్ పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసి అన్నా రు. దేశం గర్వించదగ్గ ప్రాజెక్టును టిఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణకు అందించిందని హర్షం వ్యక్తం చేశారు. రాను న్న మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రజలు టిఆర్‌ఎస్‌ను పట్టం కడతారని అభిప్రాయపడ్డారు. శాసనసభ సమావేశాల్లో భాగం గా శనివారం బడ్జెట్‌పై సాధారణ చర్చను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా అక్బరుద్దీన్ మాట్లాడుతూ, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానా ల వల్ల అన్నిరంగాలు కుదేలవుతున్నాయని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ప్రభావం కనిపిస్తోందన్నారు. జిఎస్‌టి, నోట్ల రద్దు అన్ని రంగాలపై ప్రభావం చూపిందని చెప్పారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వా టాలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. ఆర్థికాభివృద్ధిలో దేశంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని వ్యాఖ్యానించారు. పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల మేరకు తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం ఎలాంటి నిధులు కేటాయించలేదని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం… కాళేశ్వరం ప్రాజెక్టును మరిచిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు టైంలో పూర్తి చేసిన సిఎం కెసిఆర్‌ను, టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని నీతి ఆయోగ్ చెప్పినా కేంద్రం పైసా ఇవ్వలేదని తెలిపారు. సిఎం కెసిఆర్ కృషితో రికార్డు టైంలో తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఆవిర్భవించిందని అన్నారు. ఆసరా పెన్షన్లు పెంచినందుకు సిఎం కెసిఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సంక్షేమ పథకాల హామీలను సిఎం కెసిఆర్ నెరవేరుస్తున్నారని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ పథకం వల్లే పేద ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదు కానీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.
మైనార్టీలకు కేటాయించిన బడ్జెట్‌ను పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలి
తాము రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ది కోసం విమర్శిస్తాం కానీ విమర్శించడం కోసమే విమర్శించమని స్పష్టం చేశారు. మైనార్టీలకు కేటాయించిన బడ్జెట్‌ను పూర్తి స్థాయిలో ఖర్చు చేయాలని కోరారు. మైనార్టీలకు మొత్తం బడ్జెట్‌లో ఒక శాతం కేటాయిస్తున్నారని, దానిని 2 నుంచి 3 శాతం పెంచాలని పేర్కొన్నారు. ఎస్‌సి,ఎస్‌టిలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్నీ తమకు అమలు చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఆ హామీ అమలు కావడం లేదని చెప్పారు. రాష్ట్రంలో ఉర్దూ భాషను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ కార్యాలయాలలో ఉర్దూను ద్వితీయ భాషగా అమలు చేయాలని కోరారు. ఉర్దూ భాషలో కూడా ప్రభుత్వ బోర్డులు, దస్త్రాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ ఎండిని నియమించాలని కోరారు. పాతబస్తీ 20 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందని, పాతబస్తీకి ప్రత్యేకంగా రూ.10 వేల కోట్లు కేటాయించి అభివృద్ది చేయాలని విజ్ఞప్తి చేశారు. పాతబస్తీలో 2 వేల డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించింది కానీ పేదలకు ఇవ్వలేదని, ఆ ఇళ్లను వెంటనే పేదలకు కేటాయించాలని కోరారు.
హైకోర్టును తరలించొద్దు
హైకోర్టును తరలిస్తారని వస్తున్న ప్రతిపాదనలను విరమించుకోవాలని అక్బరుద్దీన్ కోరారు. పాతబస్తీలో ప్రాముఖ్యత కలిగింది హైకోర్టు ఒక్కటే ఉందని, దానిని ఎట్టి పరిస్థితుల్లో తరలించొద్దని అన్నారు. హైకోర్టు ప్రాంగణం సరిపోకపోతే హైకోర్టు కోసం పక్కనే సిటి కాలేజిని తీసుకోవాలని సూచించారు. నల్లమలలో యురేనియం తాము వ్యతిరేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు క్రమంగా భర్తీ చేయాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతున్నట్లు హామీ ఇచ్చారని, అది సకాలంలో అమలు కాకపోవడం వల్ల పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగులు నష్టపోతున్నారని చెప్పారు. డెంగీ, మలేరియా వంటి రోగాలు ప్రబలుతున్న నేపథ్యంలో దోమల నివారణకు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం పట్ల అవగాహన కల్పించేందుకు మంత్రి కెటిఆర్ తన ఇంటి పరిసరాలను పరిశీలించి శుభ్రం చేయడం అభినందనీయమన్నారు. వ్యాధుల నివారణ ప్రజలలో అవగాహన పెంచాలని చెప్పారు. మైనార్టీల సంక్షేమంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ మైనార్టీ ఎంఎల్‌ఎలతో సమావేశం నిర్వహించాలని కోరారు. అంతకుముందు వరల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన పివి సింధుకు, చంద్రయాన్ 2 ప్రయోగం నిర్వహించిన ఇస్రో శాస్త్రవేత్తలకు ఓవైసీ శుభాకాంక్షలు తెలిపారు

akbaruddin owaisi comments on kaleshwaram

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కాళేశ్వరం ఓ అద్భుతం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.