దళిత వర్సిటీ

మన తెలంగాణ/హైదరాబాద్ : దళిత యూనివర్సిటీ ఏర్పాటుపై రాష్ట్ర ప్ర భుత్వం ఆలోచన చేస్తుందని ఎస్‌సి, మై నార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వ ర్ తెలిపారు. నాణ్యమైన విద్యను అందించడంతో పాటు గురుకులాల నిర్వహణ గొప్పగా ఉన్నందునే వాటిల్లో ప్రవేశానికి డిమాండ్ పెరిగిందని పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా గురుకుల పాఠశాలలకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో మొత్తం 602 గురుకుల పాఠశాలలను ఏర్పాటు […] The post దళిత వర్సిటీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/హైదరాబాద్ : దళిత యూనివర్సిటీ ఏర్పాటుపై రాష్ట్ర ప్ర భుత్వం ఆలోచన చేస్తుందని ఎస్‌సి, మై నార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వ ర్ తెలిపారు. నాణ్యమైన విద్యను అందించడంతో పాటు గురుకులాల నిర్వహణ గొప్పగా ఉన్నందునే వాటిల్లో ప్రవేశానికి డిమాండ్ పెరిగిందని పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా గురుకుల పాఠశాలలకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో మొత్తం 602 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు. 602 గురుకుల పాఠశాలల్లో 2,39,749 మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. 11,7 85 మంది సిబ్బందిని నియమించామన్నారు. గురుకులాలకు రూ. 2,243 కో ట్లు కేటాయించామని పేర్కొన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా గురుకుల పాఠశాలల వ్యవస్థను నెలకొల్పడమే కాకు ండా.. ప్రైవేట్ విద్యాసంస్థలకు ధీటుగా నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు వివరించారు. ఈ గురుకులాల్లో ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులకే కాకుండా, బిసి, మైనార్టీ వి ద్యార్థులకు కూడా ప్రవేశాలు కల్పిస్తున్నామని తెలిపారు.

ఈ విద్యా సంవత్సరంలో ఐదో తరగతిలో ప్రవేశాల కోసం లక్షా 35వేల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రవేశాల కోసం అర్హత పరీక్ష నిర్వహించి.. సీట్లు కేటాయిస్తున్నారు. పది ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం కూడా మెరుగ్గా ఉందన్నారు. పదో తరగతి ఫలితాల్లో ఎస్‌సి గురుకులాలు 96.63 శాతం, ఎస్‌టిల్లో 95.47 శాతం, బిసి గురుకులాల్లో 98.7 శాతం, మైనార్టీ గురుకులాల్లో 91 శాతం ఉన్నట్లు చెప్పారు. ఎంబిబిఎస్‌లో 169 మంది, బిడిఎస్‌లో 29 మంది, ఐఐటిలో 86 మంది, ఎన్‌ఐటిలో 180 మంది ప్రవేశాలు పొందారన్నారు. విద్యార్థులకు ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటూనే.. సన్నబియ్యంతో భోజనం పెడుతున్నామని, వారానికి రెండు రోజులు చికెన్ అందిస్తున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. కరీంనగర్‌లోని రుక్మాపూర్ సైనిక్ స్కూల్ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. 22 స్పోర్ట్ అకాడమీలు, మాల్కాజ్‌గిరిలో ఫైన్ ఆర్ట్ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. భద్రచాలంలోని ముంపు గ్రామాల్లో ఉండటంలో అక్కడ గురుకులం మార్చాల్సి వచ్చిందని, త్వరలోనే స్థలం చూస్తే ఎక్కడా ఏర్పాటు చేయాలో అక్కడ చేస్తామని సభ్యులు పోడెం వీరయ్య అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.

 

TS government Plan For Dalit University

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post దళిత వర్సిటీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.