ఆ పాపం కాంగ్రెస్‌దే

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కని పాపం కాంగ్రెస్‌దేనని మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. శనివారం శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చ జరుగుతున్న సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకరావడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కకపోవడం కారణం కాంగ్రెస్‌ది కాదా? ఆ […] The post ఆ పాపం కాంగ్రెస్‌దే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కని పాపం కాంగ్రెస్‌దేనని మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. శనివారం శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చ జరుగుతున్న సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకరావడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కకపోవడం కారణం కాంగ్రెస్‌ది కాదా? ఆ పాపం మీదే అని జీవన్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. విభజన చట్టంలో పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి ప్రాణహిత చేవేళ్ళకు జాతీయ ఎందుకు విస్మరించాలని హరీశ్‌రావు నిలదీశారు. ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలనిఎలాంటి విజ్ఞప్తులు రాలేదని రాజ్యసభలో ఇటీవల కేంద్ర మంత్రి ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు.
ఈ విషయంలో కేంద్రం చెబుతోంది తప్పా? లేదా రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది తప్పా? అని జీవన్‌రెడ్డి అని ప్రశ్నించారు. వెంటనే హరీశ్‌రావు సమాధానమిస్తూ, కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి కెసిఆర్ పలుమార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్రమోడిని కలిసి విజ్ఞప్తి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా హరీశ్‌రావు గుర్తు చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు లేఖలు కూడా రాసిందన్నారు. ఇంతకంటే ఏం సాక్ష్యా లు కావాలని ప్రశ్నించారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు అడ్డంకులు కల్పించేందుకు అడుగడుగునా కాంగ్రెస్ నేతలు కోర్టుల్లో కేసులు వేసిన విషయాన్ని సైతం హరీశ్‌రావు గుర్తు చేశారు. కేసులు వేసినోళ్ళ పేర్లను సభా ముఖం గా తానే వెల్లడించానని హరీష్‌రావు చెప్పారు. ఎవరి తప్పు ఎలా ఉన్నా రాష్ట్ర ప్రజలపై ఆర్ధిక భారం పడకుండా చూడాలని జీవన్‌రెడ్డి సూచించారు.

కాళేశ్వరంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తే ఎవరు తప్పు చెబుతురున్నారో తెలుస్తుంది కాదా అని పేర్కొన్నారు. అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి, జీవన్‌రెడ్డిల మధ్య బడ్జెట్‌పై జరుగుతున్న చర్చ సందర్భంగా స్వల్ప వివాదం చోటుచేసుకుంది. కాగా టిఆర్‌ఎస్ సభ్యులు పురాణం సతీశ్, ఆకుల లలిత, పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు మాట్లాడుతూ, కేంద్రం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందనప్పటికీ ప్రభుత్వం వెనకడుగు వేయకుండా సంక్షేమ పథకాలకు పెద్దఎత్తున నిధులు కేటాయించిందన్నారు. మజ్లిస్ సభ్యుడు జాఫ్రి, బిజెపి సభ్యుడు రామచందర్‌రావులు మాట్లాడుతూ, రాష్ట్రానికి వస్తున్న ఆదాయం, పెరిగిపోయిన అప్పుల్లో చాలా వ్యత్యాసం నెలకొందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేరుస్తుందని ప్రశ్నించారు.

Harish Rao Comments On Wastewater treatment

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆ పాపం కాంగ్రెస్‌దే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.