మురుగు శుద్ధీకరణలో మనమే బెస్ట్

మన తెలంగాణ/హైదరాబాద్: జిహెచ్‌ఎంసి పరిధిలో మురుగునీటి శుద్ధీకరణ కేంద్రాల సామర్థ్యం పెంచుతున్నామని ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ పేర్కొన్నా రు. జిహెచ్‌ఎంసిలో మురుగునీటి శుద్ధి కేంద్రాల సామ ర్థ్యం పెంపుపై శాసనసభలో ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసి, టిఆర్‌ఎస్ సభ్యులు దానం నాగేందర్ అడిగిన ప్రశ్నలకు మంత్రి కెటిఆర్ సమాధానం ఇచ్చారు. దేశంలోని ఢిల్లీ, ముంబయి నగరాల కంటే హైదరాబాద్‌లో చెత్త సేకరణ, మురుగునీటి శుద్ధీకరణ 40.83 శాతంతో మెరుగ్గా ఉందన్నారు. ఇది సరిపోదని, మరింత […] The post మురుగు శుద్ధీకరణలో మనమే బెస్ట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/హైదరాబాద్: జిహెచ్‌ఎంసి పరిధిలో మురుగునీటి శుద్ధీకరణ కేంద్రాల సామర్థ్యం పెంచుతున్నామని ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ పేర్కొన్నా రు. జిహెచ్‌ఎంసిలో మురుగునీటి శుద్ధి కేంద్రాల సామ ర్థ్యం పెంపుపై శాసనసభలో ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసి, టిఆర్‌ఎస్ సభ్యులు దానం నాగేందర్ అడిగిన ప్రశ్నలకు మంత్రి కెటిఆర్ సమాధానం ఇచ్చారు. దేశంలోని ఢిల్లీ, ముంబయి నగరాల కంటే హైదరాబాద్‌లో చెత్త సేకరణ, మురుగునీటి శుద్ధీకరణ 40.83 శాతంతో మెరుగ్గా ఉందన్నారు. ఇది సరిపోదని, మరింత మెరుగ్గా పని చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలో 21 ప్లాంట్లు మురుగునీటి శుద్ధీకరణ (ఎస్‌టిపి) కోసం పని చేస్తున్నాయని తెలిపారు. 2021 వరకు వీటిని రెట్టింపు చేస్తాం. ప్రస్తుతం 735 ఎల్‌ఎండిలుగా ఎస్‌టిపిల సామర్థం ఉందన్నారు.

హైదరాబాద్ 54 శాతం డ్రైనేజీ నీరు మూసీ నదిలో కలుస్తోందని, దీన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం డిమాండ్‌కు తగిన విధంగా మురుగునీటిని శుద్ధీకరించాలంటే నెట్‌వర్క్‌ను రీమోడల్ చేయాల్సి ఉంటుందన్నారు. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న మురుగు పారుదల వ్యవస్థను ఆరు జోన్లుగా విభజించామన్నారు. కొత్తమురుగు పారుదల నెట్‌వర్క్ ఏర్పాటుకు ప్రభుత్వం హెచ్‌ఎండబ్లుఎస్‌ఎస్‌బి, ఒఆర్‌ఆర్ పరిధి వరకు ఒక సమగ్ర మురుగుపారుదల మాస్టర్‌ప్లాన్‌ను తయారు చేయాలని గతంలోనే ఆదేశించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. సమగ్రమైన మురుగునీటిపారుదల వ్యవస్థ తయారీకి మెస్సర్స్ షా టెక్నికల్ కన్సల్‌టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ముంబైని నియమించినట్లు చెప్పారు. 2021 బేస్ సంవత్సరానికి అధ్యయనం చేసి 2036, 2051 సంవత్సరానికి తయారయ్యే మురుగుకి అనుగుణంగా నీటిపారుదల రిపోర్టును తయారు చేస్తున్నట్లు తెలిపారు.

జ్వరాలన్నీ మురుగుతోనే : అక్బరుద్దీన్
హైదరాబాద్‌లో జ్వరాలన్నీ మురుగునీటితోనే వస్తున్నాయని, సమగ్రమైన మురుగునీటి శుద్ధీకరణ జరగడం లేదని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. కెటిఆర్ సమాధానం చెప్పకముందు ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో మూసీ నీటిని ఎప్పటికప్పుడు శుద్దీకరించాలని, ఎస్‌టిపి ప్లాంట్లకు కోట్ల రూపాయాలు ఖర్చు చేస్తున్నా శుద్ధీకరణ చేస్తుంది ఏమి కనిపించడం లేదన్నారు. అన్నీ ఆసుపత్రులు, కొత్త కట్టడాలకు ఎస్‌టిపిలను ఖచ్చితం చేయాలని కోరారు.

KTR Comments On Wastewater treatment

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మురుగు శుద్ధీకరణలో మనమే బెస్ట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.