సౌదీ ఆరామ్‌కోపై డ్రోన్ దాడి

దుబాయి: రిలయన్స్ పెట్రో కెమికల్స్‌లో 20 శాతం పెట్టుబడులు పెట్టనున్న సౌదీ అరేబియా చమురు కంపెనీ ఆరామ్‌కోపై గుర్తు తెలియని దుండగులు శనివారం డ్రోన్ దాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రకటించారు. దాడితో కంపెనీ పరిసరాల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కాగా ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థా వెంటనే బాధ్యత ప్రకటించుకోలేదు. అయితే తామే ఈ దాడికి పాల్పడినట్లు హౌతీ తిరుగుబాటు వర్గం ఆ తర్వాత ప్రకటించుకుంది. […] The post సౌదీ ఆరామ్‌కోపై డ్రోన్ దాడి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

దుబాయి: రిలయన్స్ పెట్రో కెమికల్స్‌లో 20 శాతం పెట్టుబడులు పెట్టనున్న సౌదీ అరేబియా చమురు కంపెనీ ఆరామ్‌కోపై గుర్తు తెలియని దుండగులు శనివారం డ్రోన్ దాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రకటించారు. దాడితో కంపెనీ పరిసరాల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కాగా ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థా వెంటనే బాధ్యత ప్రకటించుకోలేదు. అయితే తామే ఈ దాడికి పాల్పడినట్లు హౌతీ తిరుగుబాటు వర్గం ఆ తర్వాత ప్రకటించుకుంది. గతంలో కూడా యెమన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ఆరామ్‌కో చమురు కేంద్రంపై డ్రోన్ దాడికి పాల్పడ్డారు. కంపెనీకి చెందిన బుఖ్యాక్, ఖురైస్ చమురు శుద్ధి క్షేత్రాల్లో తాజా దాడి జరిగింది. ఈ ప్రమాదంలో ఏమైనా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిందా అనే విషయం తెలియరాలేదు. అయితే ఆన్‌లైన్ వీడియోల్లో భారీ మంటలు చెలరేగిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. తుపాకుల శబ్దం కూడా వినిపిస్తోంది. భారీ ఎత్తున పొగ అలముకుందని స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఈ ప్రమాదంపై ఎపి వార్తాసంస్థ అడిగిన ప్రశ్నలకు ఆరామ్‌కో వెంటనే స్పందించలేదు. బుఖ్యక్ చమురు శుద్ధి కర్మాగారం ప్రపంచంలోనే పెద్దది. రోజుకు ఏడు మిలియన్ బ్యారెళ్ల చమురును ఇది శుద్ధి చేస్తుందని కంపెనీ గతంలో ప్రకటించింది. 2006 ఫిబ్రవరిలో అల్‌ఖైదా ఉగ్రవాదులు ఈ కేంద్రంపై ఆత్మాహుతి దాడికి యత్నించి విఫలమైనారు.కాగా వారాంతమైనందున పరపంచవ్యాప్తంగా చమురు మార్కెట్లు మూతపడ్డంతో ఈ ప్రమాదం ప్రభావం చమురు ధరలపై కనిపించలేదు.

drone attack on Saudi Arabian Oil Company on Aramco

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సౌదీ ఆరామ్‌కోపై డ్రోన్ దాడి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: