స్పై యాక్షన్ థ్రిల్లర్

  గోపీచంద్ హీరోగా మెహ్రీన్, జరీన్‌ఖాన్ హీరోయిన్లుగా ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తిరు దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం ‘చాణక్య’. స్పై యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లకు అద్భుతమైన స్పందన వస్తోంది. హైదరాబాద్ ప్రసాద్‌ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో గోపీచంద్ మాట్లాడుతూ “రెండేళ్ల క్రితం తిరు ఈ కథ చెప్పాడు. నాకు బాగా నచ్చింది. కొన్ని మార్పులు […] The post స్పై యాక్షన్ థ్రిల్లర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

గోపీచంద్ హీరోగా మెహ్రీన్, జరీన్‌ఖాన్ హీరోయిన్లుగా ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తిరు దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం ‘చాణక్య’. స్పై యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లకు అద్భుతమైన స్పందన వస్తోంది. హైదరాబాద్ ప్రసాద్‌ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో గోపీచంద్ మాట్లాడుతూ “రెండేళ్ల క్రితం తిరు ఈ కథ చెప్పాడు. నాకు బాగా నచ్చింది. కొన్ని మార్పులు చెప్పాను. అవన్నీ సరిచేసి అద్భుతంగా కథను సిద్ధం చేశాడు. అనిల్ సుంకర ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఆయన ఇప్పుడు ‘చాణక్య’ లాంటి స్పై థ్రిల్లర్ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని చాలా రిచ్‌గా రూపొందించారు.

మెహ్రీన్ లవ్ ట్రాక్ సీన్స్ యూత్‌కి బాగా కనెక్ట్ అవుతాయి. జరీన్ ఖాన్ సెకండాఫ్‌లో వస్తుంది. ఆమె చాలా ముఖ్యమైన పాత్ర చేసింది”అని చెప్పారు. చిత్ర నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ “స్పై బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుంది. నాకు బాగా నచ్చిన కథ ఇది. అలాగే హీరో గోపీచంద్‌కి కూడా ఈ కథ బాగా నచ్చింది. అబ్బూరి రవి మంచి డైలాగ్స్ రాశారు.

ఒక వండర్‌ఫుల్ మూవీని మాకు ఇచ్చిన గోపీచంద్, తిరుకి నా థాంక్స్‌”అని తెలిపారు. దర్శకుడు తిరు మాట్లాడుతూ “తెలుగులో ఇది నా మొదటి సినిమా. ఇండియన్ రా ఏజెంట్‌గా గోపీచంద్ ఈ సినిమాలో కనిపిస్తారు. ఇది నా మనసుకి బాగా నచ్చిన స్క్రిప్ట్. అనిల్ సుంకర బడ్జెట్ విషయంలో రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. తప్పకుండా ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ అవుతుందని నమ్మకంతో ఉన్నాం”అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాటల రచయిత అబ్బూరి రవి పాల్గొన్నారు.

Spy Action Thriller Chanakya Movie

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post స్పై యాక్షన్ థ్రిల్లర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: