లంబోదర లడ్డు ఆదరహో

హైదరాబాద్: మహానగరంలో ప్రతి ఏటా జరిగే గణేష్ ఉత్సవాల్లో అతిపెద్ద వినాయకుడుగా ఖైరతాబాద్ గణపతి పేర్కొందగా, లడ్డూవేలం పాటలో బాలాపూర్ లడ్డ్డూ ప్రసిద్దికెక్కింది. బాలాపూర్ లడ్డును దక్కించుకునేందుకు భక్తులను పెద్ద ఎత్తున వేలం పాటలో పాల్గొంటూ సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. గ్రేటర్ భక్తులే కాకుండా తెలంగాణ,ఆంద్రప్రదేశ్‌కు చెందిన రియల్టర్లు, బిల్డర్లు, వ్యాపారులు లడ్డూ కోసం ఆరాటపడుతారు. ఈఏడాది వినాయక చవితి ఉత్సవాల గణపతి లడ్డు వేలంలో బాలాపూర్ లడ్డు రికార్డును ఈసారి ఫిల్మ్‌నగర్ లడ్డు బ్రేక్ […] The post లంబోదర లడ్డు ఆదరహో appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: మహానగరంలో ప్రతి ఏటా జరిగే గణేష్ ఉత్సవాల్లో అతిపెద్ద వినాయకుడుగా ఖైరతాబాద్ గణపతి పేర్కొందగా, లడ్డూవేలం పాటలో బాలాపూర్ లడ్డ్డూ ప్రసిద్దికెక్కింది. బాలాపూర్ లడ్డును దక్కించుకునేందుకు భక్తులను పెద్ద ఎత్తున వేలం పాటలో పాల్గొంటూ సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. గ్రేటర్ భక్తులే కాకుండా తెలంగాణ,ఆంద్రప్రదేశ్‌కు చెందిన రియల్టర్లు, బిల్డర్లు, వ్యాపారులు లడ్డూ కోసం ఆరాటపడుతారు. ఈఏడాది వినాయక చవితి ఉత్సవాల గణపతి లడ్డు వేలంలో బాలాపూర్ లడ్డు రికార్డును ఈసారి ఫిల్మ్‌నగర్ లడ్డు బ్రేక్ చేసింది. వినాయక్‌నగర్‌కు చెందిన గణపతి లడ్డూ రూ. 17.75 లక్షలకు పల్లపు గోవర్దన్ దక్కించుకుని గ్రేటర్ లడ్డూ ధరలో మొదటి స్దానంలో నిలిచారు.

తరువాత బాలాపూర్ లడ్డూ రూ. 17.60లక్షల ధర పలికి రెండవ స్దానంలో నిలిచింది. కూకట్‌పల్లి డివిజన్ సర్దార్‌నగర్‌కు చెందిన లడ్డూ రూ. 11.78 లక్షలకు మిత్రమండలి గ్రూపు కృష్ణారెడ్డి సొంతం చేసుకుని తృతీయ స్దానం ఉన్నారు. బోలక్‌పూర్ సిద్ది వినాయక భగత్‌సింగ్ యూత్ లడ్డూ వేలం రూ. 7.56లక్షలకు చేపల వ్యాపారి బైరు విష్ణుప్రసాద్ కైవసం చేసుకున్నారు. కూకట్‌పల్లి వినాయక బృందం నిర్వహించిన వేలం పాటలో లడ్డును రూ. 4.56 లక్షలకు కుత్బులాపూర్‌కు చెందిన జీవేందర్ రెడ్డి దక్కించుకున్నారు. అత్తాపూర్ పోచమ్మ దేవాలయం వద్ద రూ. 3.01లక్షలకు గుమ్మడి భూపాల్‌రెడ్డి వేలం పాటలో సొంతం చేసుకున్నారు. శేరిలింగంపల్లి హుడాట్రేడ్ సెంటర్ సీతారామాంజస్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన గణపతి లడ్డు రూ. 2.75లక్షలకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి మహేష్‌గౌడ్ తీసుకున్నారు.

లడ్డూకు పోటీ పడ్డ రాజకీయ నాయకులు, వ్యాపారులు: నగరంలో వినాయక లడ్డూ దక్కించుకునేందుకు రాజకీయ నాయకులు, రియల్ వ్యాపారులు, బిల్డర్లు పేరు నమోదు చేసుకునేందుకు పోటీ పడ్డారు. రియల్ ఎస్టేట్ ,నిర్మాణ రంగం, ఐటీ రంగాలకు శివారు ప్రాంతాల్లో జోరు ఉండటంతో లడ్డూ సొంతం చేసుకోవడం వారికి క్రేజీగా మారిందని లక్షలు వెచ్చించి లడ్డూ తీసుకునేందుకు తంటాలు పడ్డారు.వీరి దెబ్బకు మధ్యతరగతి ప్రజలు లడ్డూ తీసుకోవడం కష్టంగా మారిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రాంతం ధర దక్కించుకున్నవారు

ఫిల్మ్‌నగర్(వినాయక్‌నగర్) రూ.17.75 లక్షలు పల్లపు గోవర్ధన్
బాలాపూర్ రూ.17.60 లక్షలు కొలను రాంరెడ్డి
సర్దార్‌పటేల్‌నగర్(కెపిహెచ్‌బి) రూ.11.78 లక్షలు మిత్రమండలి గ్రూపు కృష్ణారెడ్డి
బోలక్‌పూర్(భగత్‌సింగ్‌యూత్) రూ.7.56 లక్షలు బైరు విష్ణుప్రసాద్
బాచుపల్లి(మహాగణపతి) రూ. 5 లక్షలు సి.హెచ్.దివారక్
కూకట్‌పల్లి(వినాయకబృందం) రూ.4.56 లక్షలు జీవేందర్‌రెడ్డి
పెద్దఅంబర్‌పేట రూ.3.24 లక్షలు ప్రభాకర్‌రెడ్డి
అత్తాపూర్(పోచమ్మదేవాలయం) రూ.3.01 లక్షలు గుమ్మడి భూపాల్‌రెడ్డి
శేరిలింగంపల్లి(హుడాట్రేడ్) రూ.2.75 లక్షలు మహేష్‌గౌడ్
మూసాపేట(నవయువకయూత్) రూ.2.53 లక్షలు వడ్డ వెంకటేష్‌చారి
హైదర్‌గూడ(జగ్జీవన్‌రాంయూత్) రూ.2.06 లక్షలు గోదల అఖిలేష్
బృందావన్‌కాలనీ(జవహార్‌నగర్) రూ.1.72 లక్షలు మేకల అయ్యప్ప
సబ్జిమండీ(గంగపుత్ర సంఘం ) రూ. 1.62 లక్షలు తత్తరి కృష్ణ
బాలాజీనగర్( అంజయ్యనగర్) రూ.1.42 లక్షలు ఎన్.తేజరావు
గణపతి లడ్డూవేలం పాటలో ఈసారి రికార్డులు తారుమారు ః గత సంవత్సరంలో బాలాపూర్ లడ్డూ రూ. 16.60లక్షల ధర పలికి మొదటి స్దానంలో నిలవగా, 15.01లక్షల ధరతో ఫిల్మ్‌నగర్ లడ్డూ రెండోస్దానం సంపాదించుకుంది. ఈఏడాదిలో ఈరికార్డు అటుఇటుగా మారింది. రూ. 17.75లక్షలతో ఫిల్మ్‌నగర్ వినాయక్‌నగర్ లడ్డూ మొదటిస్దానంలో దూసుకుపోగా, రూ.17.60లక్షలతో బాలాపూర్ రెండోస్దానంలో నిలిచింది.

Filmnagar Laddu Breaks Balapur Laddu Records

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post లంబోదర లడ్డు ఆదరహో appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: