మహా గణపతికి జర్మన్ క్రేన్…

హైదరాబాద్: శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతిని నిమజ్జనం చేసేందుకు జర్మన్ టెక్నాలజీ.. తడానో కంపెనీకి చెందిన ఆధునిక క్రేన్‌ను వినియోగించారు. తెలుగు రాష్ట్రాల్లోనే రిమోట్ కంట్రోల్ టెక్నాలజీ క్రేన్ ఇదొక్కటే కావడం గమనార్హం. ఈ క్రేన్ 400 టన్నులు బరువును 60 మీటర్ల పైకి ఎత్తుతుంది.14 మీటర్ల పొడవు, 4 మీటర్ల వెడల్పు ఉండే క్రేన్‌కు ఒక్కో టైరు టన్ను బరువుగల 12 టైర్లు ఉన్నాయి. క్రేన్ సామర్థం 72 టన్నులు కాగా 50 టన్నుల బరువు ఉన్న […] The post మహా గణపతికి జర్మన్ క్రేన్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతిని నిమజ్జనం చేసేందుకు జర్మన్ టెక్నాలజీ.. తడానో కంపెనీకి చెందిన ఆధునిక క్రేన్‌ను వినియోగించారు. తెలుగు రాష్ట్రాల్లోనే రిమోట్ కంట్రోల్ టెక్నాలజీ క్రేన్ ఇదొక్కటే కావడం గమనార్హం. ఈ క్రేన్ 400 టన్నులు బరువును 60 మీటర్ల పైకి ఎత్తుతుంది.14 మీటర్ల పొడవు, 4 మీటర్ల వెడల్పు ఉండే క్రేన్‌కు ఒక్కో టైరు టన్ను బరువుగల 12 టైర్లు ఉన్నాయి.

క్రేన్ సామర్థం 72 టన్నులు కాగా 50 టన్నుల బరువు ఉన్న ఖైరతాబాద్ మహాగణపతిని క్రేన్‌సాయంతో నిమజ్జన మహాత్ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఖైరతాబాద్ మహగణపతిని నిమజ్జనం చేసే భాగ్యం రెండో సారికలిగి నందుకు సంతోషంగా ఉందని క్రేన్ ఆపరేటర్ పంజాబ్‌కు చెందిన దేవేందర్ సింగ్ అన్నారు. తనకు క్రేన్ ఆపరేటింగ్‌లో 11 సంవత్సరాలు అనుభవం ఉందని, ఆధునిక టెక్నాలజీ హైడ్రాలిక్ క్రేన్‌ను రెండు సంవత్సరాలుగా ఆపరేట్ చేస్తున్నట్లు చెప్పారు.

German Crane Using For Khairatabad Ganesh 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మహా గణపతికి జర్మన్ క్రేన్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.