ఒక్క క్షణం వృధా కానివ్వం !

హైదరాబాద్ : రైతులకు యూరియా సరఫరా చేయడంలో ఒక్క నిమిషం కూడా వృధా చేయడం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. పలు రాష్ట్రాల్లోని పోర్టుల నుంచి యూరియాను పెద్దఎత్తున తీసుకవస్తున్నామన్నారు. ఇందుకోసం అన్ని రోడ్డు, రైల్వే మార్గాలను ఉపయోగించుకుంటున్నామన్నారు. కేవలం వారం రోజుల్లోనే 20,387 మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రంలోని రైతులకు సరఫరా చేశామని వివరించారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన భరోసా ఇచ్చారు. రబీకి […] The post ఒక్క క్షణం వృధా కానివ్వం ! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : రైతులకు యూరియా సరఫరా చేయడంలో ఒక్క నిమిషం కూడా వృధా చేయడం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. పలు రాష్ట్రాల్లోని పోర్టుల నుంచి యూరియాను పెద్దఎత్తున తీసుకవస్తున్నామన్నారు. ఇందుకోసం అన్ని రోడ్డు, రైల్వే మార్గాలను ఉపయోగించుకుంటున్నామన్నారు. కేవలం వారం రోజుల్లోనే 20,387 మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రంలోని రైతులకు సరఫరా చేశామని వివరించారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన భరోసా ఇచ్చారు. రబీకి కూడా యూరియా నిల్వలు సిద్దం చేస్తున్నామన్నారు. వియత్నం నుంచి విశాఖ గంగవరం పోర్టుకు చేరుకున్న యూరియా నౌకను గురువారం మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారధిలు సందర్శించారు.

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ, విశాఖ నుంచి 6,800 మెట్రిక్ టన్నులు యూరియా సరఫరా అవుతోందన్నారు. అలాగే ఐపిఎల్యూరియా 15 వేల మెట్రిక్ టన్నులు సరఫరాతో పాటు శుక్రవారం నుంచి రోజుకు 5,200 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేస్తున్నామన్నారు. – యూరియా సత్వర రవాణాకు పోర్టు నుండి సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చిన గంగవరం పోర్టు సిఇఒ, ఉమ్మడి ఎపి మాజీ డిజిపి నండూరి సాంబశివరావుకు ఈ సందర్భంగా మంత్రి ధన్యవాదాలు తెలిపారు. తదనంతరం – గంగవరం పోర్టులో యూరియా సత్వర రవాణాకు పోర్టు అధికారులు, తెలంగాణ నుండి వచ్చిన ప్రత్యేక అధికారులతో ఆయన సమావేశమయ్యారు.

 తెలంగాణకు సరఫరా చేసేందుకు సిద్దమవుతున్న యూరియా గోడౌన్, వ్యాగన్‌ల పరిశీలన- శ్రావణి గోడౌన్స్‌లో ఎన్‌ఎఫ్‌ఎల్ యూరియా ప్లాంట్, క్రిబ్ కో ప్లాంట్, రైల్వే వ్యాగన్ లోకి లోడ్ అవుతున్న చోట్లకు వెళ్లి తెలంగాణకు యూరియా సరఫరా చేసేందుకు సహకరించాలని కార్మికులు, రవాణాదారులకు విజ్ఞప్తి చేశారు. అవసరమైతే మూడు షిప్టులలో పనిచేయాలని కోరారు. ఇందుకు కార్మికులు అంగీకరించారు. విదేశాల నుండి కేంద్రం ఎరువులు తెప్పిస్తుందన్నారు.  అక్కడ లోడింగ్ అయి ఇక్కడికి రావడం, ఇక్కడ అన్ లోడింగ్ చేయడానికి పూర్తిగా వాతావరణం సహకరించాలన్నారు. ఈ సందర్భంగా ఒక్క చినుకు రాలినా ఓడల నుండి యూరియా తీయడం కుదరదన్నారు. అందుకే- యూరియా సరఫరాలో కొన్ని సందర్భాల్లో ఆలస్యమవుతోందన్నారు. ఈ ప్రతికూల సమస్యలను అధిగమించి యూరియా కొరత లేకుండా చేశామన్నారు. యూరియా సరఫరాకు సహకరిస్తున్న పోర్టు, రైల్వే, ఎపి ప్రభుత్వానికి ఈ సందర్భంగా మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

Not single moment wasted in supplying urea in Telangana

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఒక్క క్షణం వృధా కానివ్వం ! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: