పిఒకె విషయంలో ఆర్మీ సిద్ధంగా ఉంది : బిపిన్ రావత్

ఢిల్లీ : పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌(పిఒకె)ను స్వాధీనం చేసుకునేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంటే, దానికి భారత ఆర్మీ సిద్ధంగానే ఉందని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ తేల్చిచెప్పారు. పిఒకెను కేంద్రం స్వాధీనం చేసుకుంటుందని ఇటీవల కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పందించారు. దేశంలోని వ్యవస్థలన్నీ ప్రభుత్వ ఆదేశాల మేరకే నడుచుకుంటాయని బిపిన్ రావత్ తెలిపారు. పిఒకె విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకుంటే , ఆర్మీ సర్వవేళల్లో సిద్ధంగా ఉంటుందని […] The post పిఒకె విషయంలో ఆర్మీ సిద్ధంగా ఉంది : బిపిన్ రావత్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఢిల్లీ : పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌(పిఒకె)ను స్వాధీనం చేసుకునేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంటే, దానికి భారత ఆర్మీ సిద్ధంగానే ఉందని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ తేల్చిచెప్పారు. పిఒకెను కేంద్రం స్వాధీనం చేసుకుంటుందని ఇటీవల కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పందించారు. దేశంలోని వ్యవస్థలన్నీ ప్రభుత్వ ఆదేశాల మేరకే నడుచుకుంటాయని బిపిన్ రావత్ తెలిపారు. పిఒకె విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకుంటే , ఆర్మీ సర్వవేళల్లో సిద్ధంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పిఒకె విషయంలో కేంద్రం మాత్రమే నిర్ణయం తీసుకోవాలని ఆయన చెప్పారు. జమ్మూకశ్మీర్ లో శాంతి నెలకొల్పేందుకు ఆర్మీకి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. పిఒకెను భారత్ లో కలపాలన్న తీర్మానాన్ని 1994లో పార్లమెంట్ ఆమోదించిందని, నాటి ప్రధాని పివి నాయకత్వంలో ఈ తీర్మానం చేశారని బిపిన్ రావత్ పేర్కొన్నారు.

Army Is Always Ready For Action In POK: Bipin Rawat

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పిఒకె విషయంలో ఆర్మీ సిద్ధంగా ఉంది : బిపిన్ రావత్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.