క్రికెట్‌కు ధోనీ గుడ్‌బై?

ముంబయి: టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ టి-20, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించే యోచనలో ఉన్నట్టు సమాచారం. సౌతాఫ్రికా జరిగే టూర్‌కు ధోనీకి చోటు లభించకపోవడంతో అందరూ ధోనీ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నారని భావిస్తున్నారు. విండీస్ టూర్ నుంచి ధోనీ వైదొలగడమే కాకుండా రెండు నెలల పాటు ఆర్మీలో పని చేశారు. టీమిండియాను అన్ని ఫార్మెట్లలో తొలి స్థానంలో ఉంచిన ఘనత ధోనికి దక్కుతుంది. భారత్‌కు వన్డే వరల్డ్ కప్, టి-20 వరల్డ్ […] The post క్రికెట్‌కు ధోనీ గుడ్‌బై? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబయి: టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ టి-20, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించే యోచనలో ఉన్నట్టు సమాచారం. సౌతాఫ్రికా జరిగే టూర్‌కు ధోనీకి చోటు లభించకపోవడంతో అందరూ ధోనీ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నారని భావిస్తున్నారు. విండీస్ టూర్ నుంచి ధోనీ వైదొలగడమే కాకుండా రెండు నెలల పాటు ఆర్మీలో పని చేశారు. టీమిండియాను అన్ని ఫార్మెట్లలో తొలి స్థానంలో ఉంచిన ఘనత ధోనికి దక్కుతుంది. భారత్‌కు వన్డే వరల్డ్ కప్, టి-20 వరల్డ్ కప్ అందించాడు. జార్ఖండ్ ను తాను చాలా ఇష్టపడుతానని, కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎన్నో కష్టాలు పడ్డామని ధోనీ ఉద్వేగంతో చెప్పాడు. క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన అనంతరం ధోనీ రాజకీయ రంగ ప్రవేశం ఉంటుందని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ధోనీ బిజెపిలో చేరి రాష్ట్ర రాజకీయాలలో పాలు పంచుకుంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జార్ఖండ్ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ వార్తలు వస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ధోనీ టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.

Mahendra Singh Dhoni Retire from Cricket

The post క్రికెట్‌కు ధోనీ గుడ్‌బై? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: