కేరళలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త హత్య

  తిరువనంతపురం: కేరళ రాష్ట్రం కోజివెలిముక్కు ప్రాంతంలో కరుంగపల్లిలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తను కత్తితో పొడిచి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కులశేఖర పురమ్‌లో సుజీత్ (33) అనే వ్యక్తి ఆర్‌ఎస్‌ఎస్‌లో మంచి కార్యకర్తగా పని చేశాడు. సుజీత్ ఇంటి పక్కనే ఉన్న వ్యక్తితో స్నేహంగా ఉండేవాడు. తన స్నేహితుడు పక్కింటి వ్యక్తితో గొడవపడుతుండగా సుజీత్ స్నేహితుడు వాదనకు దిగాడు. మళ్లీ తెల్లవారుజామున సుజీత్ ఫ్రెండ్‌తో పక్కింటి వ్యక్తి గొడవకు దిగడంతో సుజీత్ కూడా వాళ్లతో పంచాయతీకి […] The post కేరళలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త హత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

తిరువనంతపురం: కేరళ రాష్ట్రం కోజివెలిముక్కు ప్రాంతంలో కరుంగపల్లిలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తను కత్తితో పొడిచి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కులశేఖర పురమ్‌లో సుజీత్ (33) అనే వ్యక్తి ఆర్‌ఎస్‌ఎస్‌లో మంచి కార్యకర్తగా పని చేశాడు. సుజీత్ ఇంటి పక్కనే ఉన్న వ్యక్తితో స్నేహంగా ఉండేవాడు. తన స్నేహితుడు పక్కింటి వ్యక్తితో గొడవపడుతుండగా సుజీత్ స్నేహితుడు వాదనకు దిగాడు. మళ్లీ తెల్లవారుజామున సుజీత్ ఫ్రెండ్‌తో పక్కింటి వ్యక్తి గొడవకు దిగడంతో సుజీత్ కూడా వాళ్లతో పంచాయతీకి దిగాడు. సుజీత్‌ను ఆ వ్యక్తి కత్తితో పొడిచాడు. వెంటనే సుజీత్‌ను ఆస్పత్రికి తరలించినప్పటికి చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం 341, 302, 294(బి), 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో నిందితుడు ఎస్‌డిపిఐ పార్టీకి చెందిన కార్యకర్త అని ఆర్‌ఎస్‌ఎస్ సోషల్ మీడియాలో వైరల్ చేసింది. ఆ నిందితుడికి ఎస్‌డిపిఐకి సంబంధంలేదని పోలీసుల దర్యాప్తులో తేలింది.

 

RSS Worker Killed Fight with Neighbour in Kerala

 

RSS Worker Killed Fight with Neighbour in Kerala

The post కేరళలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త హత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.