ఫోన్‌లో మాట్లాడుతూ పాములపై కూర్చుంది

  గోరఖ్‌పూర్: భర్తతోపాటు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ పరధ్యానంలో మంచం మీద ఆడుకుంటున్న రెండు నాగుపాముల మీద కూర్చున్న ఒక మహిళ పాముకాటు గురై మరణించింది. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ సమీపంలోని రియాన్వ్ గ్రామంలో బుధవారం జరిగింది. థాయ్‌ల్యాండ్‌లో పనిచేసే జై సింగ్ యాదవ్ భార్య గీత బుధవారం తన భర్తతో ఫోన్‌లో మాట్లాడుతోంది. అంతలో రెండు పాములు ఇంట్లోకి ప్రవేశించి మంచం మీదున్న రంగుల దుప్పటిపైకి చేరాయి. పాములను గుర్తించని గీత మాటల్లో పడి […] The post ఫోన్‌లో మాట్లాడుతూ పాములపై కూర్చుంది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

గోరఖ్‌పూర్: భర్తతోపాటు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ పరధ్యానంలో మంచం మీద ఆడుకుంటున్న రెండు నాగుపాముల మీద కూర్చున్న ఒక మహిళ పాముకాటు గురై మరణించింది. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ సమీపంలోని రియాన్వ్ గ్రామంలో బుధవారం జరిగింది. థాయ్‌ల్యాండ్‌లో పనిచేసే జై సింగ్ యాదవ్ భార్య గీత బుధవారం తన భర్తతో ఫోన్‌లో మాట్లాడుతోంది. అంతలో రెండు పాములు ఇంట్లోకి ప్రవేశించి మంచం మీదున్న రంగుల దుప్పటిపైకి చేరాయి. పాములను గుర్తించని గీత మాటల్లో పడి వాటి మీద కూర్చుంది. అవి కాటు వేయడంతో స్పృహ కోల్పోయింది. ఆమెను చూసిన బంధువులు వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఇంటికి తిరిగి వచ్చిన బంధువులకు గదిలో మంచంపై పాములు ఆడుకుంటూ కనిపించడంతో కర్రలతో కొట్టి వాటిని చంపివేశారు.

 

Woman Sits on Snakes Gets Bitten and Dies, Gita walked into the room while talking on phone and without seeing the snakes, she sat down on the bed. The snakes bit her and within minutes, she fell unconscious

The post ఫోన్‌లో మాట్లాడుతూ పాములపై కూర్చుంది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.