మాజీ ఎంపీ శివప్రసాద్‌ కు తీవ్ర అస్వస్థత

చిత్తూరు : చిత్తూరు మాజీ ఎంపి, నటుడు, టిడిపి అగ్రనేత నారమల్లి శివప్రసాద్‌ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీంతో చెన్నయ్ లోని ఓ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. శివప్రసాద్ తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్నారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. సినీ నటుడైన శివప్రసాద్ ఎంపిగాద ఉన్న సమయంలో ఎపికి ప్రత్యేక హోదా కోరుతూ వివిధ వేషాలతో పార్లమెంట్ లో నిరసన తెలిపారు. శివ ప్రసాాద్ అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న టిడిపి చీఫ్ చంద్రబాబు […] The post మాజీ ఎంపీ శివప్రసాద్‌ కు తీవ్ర అస్వస్థత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

చిత్తూరు : చిత్తూరు మాజీ ఎంపి, నటుడు, టిడిపి అగ్రనేత నారమల్లి శివప్రసాద్‌ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీంతో చెన్నయ్ లోని ఓ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. శివప్రసాద్ తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్నారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. సినీ నటుడైన శివప్రసాద్ ఎంపిగాద ఉన్న సమయంలో ఎపికి ప్రత్యేక హోదా కోరుతూ వివిధ వేషాలతో పార్లమెంట్ లో నిరసన తెలిపారు. శివ ప్రసాాద్ అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న టిడిపి చీఫ్ చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. శివప్రసాద్ కు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన ఆస్పత్రి వైద్యులను కోరారు. చిత్తూరు నుంచి శివప్రసాద్ 2009, 2014లో రెండు సార్లు ఎంపిగా విజయం సాధించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన వైసిపి అభ్యర్థి రెడ్డప్ప చేతిలో ఓడిపోయారు.

Chittoor Ex MP Sivaprasad Is Seriously Ill

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మాజీ ఎంపీ శివప్రసాద్‌ కు తీవ్ర అస్వస్థత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: