బిన్ లాడెన్‌లా చంద్రబాబు…ముఖ్యమంత్రి ఉన్నట్టా? లేనట్టా?

  అమరావతి: ఎపి మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని ఉగ్రవాది బిన్ లాడెన్‌లా మార్ఫింగ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బుధవారం చంద్రబాబు… ‘చలో ఆత్మకూరు’కు పిలుపునివ్వడంతో పోలీసులు ఆయనను ఉండవల్లిలోని తన నివాసంలోనే అడ్డుకుని హౌస్ అరెస్టు చేశారు. దీంతో చంద్రబాబు ఇంటిలోనే నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే. అయితే, కొందరు ఆకతాయులు… గేటులోపల చంద్రబాబును ఉగ్రవాది బిన్ లాడెన్‌లా మార్ఫింగ్ చేస్తూ ఓ పోస్టును క్రియేట్ చేసి […] The post బిన్ లాడెన్‌లా చంద్రబాబు… ముఖ్యమంత్రి ఉన్నట్టా? లేనట్టా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అమరావతి: ఎపి మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని ఉగ్రవాది బిన్ లాడెన్‌లా మార్ఫింగ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బుధవారం చంద్రబాబు… ‘చలో ఆత్మకూరు’కు పిలుపునివ్వడంతో పోలీసులు ఆయనను ఉండవల్లిలోని తన నివాసంలోనే అడ్డుకుని హౌస్ అరెస్టు చేశారు. దీంతో చంద్రబాబు ఇంటిలోనే నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే. అయితే, కొందరు ఆకతాయులు… గేటులోపల చంద్రబాబును ఉగ్రవాది బిన్ లాడెన్‌లా మార్ఫింగ్ చేస్తూ ఓ పోస్టును క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీనిని చూసిన చంద్రబాబు కుమారుడు, నారా లోకేష్ ఆ పోస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నట్టా? లేనట్టా?, మీ గుడ్డి సర్కారుకు ఇలాంటి మార్ఫింగ్ పోస్టులు కనపడట్లేదా? అని నారా లోకేశ్ సిఎం జగన్ పై మండిపడ్డారు. ఒక మాజీ ముఖ్యమంత్రిపై ఇలాంటి పోస్టు పెట్టిన వాళ్ళపై చర్యలు తీసుకోడానికి వైసిపి ప్రభుత్వానికి చేతులు రావట్లేదా? లేక చట్టాలు లేవా?, చట్టాలన్నీ టిడిపి కార్యకర్తలు, అభిమానుల మీద కేసులు పెట్టడానికేనా?’ అని విమర్శించారు.

Lokesh fire on Chandrababu photo morphing as bin laden

The post బిన్ లాడెన్‌లా చంద్రబాబు… ముఖ్యమంత్రి ఉన్నట్టా? లేనట్టా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.