కార్యకర్త తల నరికేస్తానన్న హర్యానా సిఎం

చండీగఢ్: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సహనం కోల్పోయారు. తన తలపై కిరీటం పెట్టేందుకు ప్రయత్నించిన పార్టీ కార్యకర్త చేతులను నరికేస్తానంటూ గొడ్డలి చేతిలో పట్టుకుని శివాలూగారు. ఒక ర్యాలీ సందర్భంగా ఈ జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రణదీప్ సింగ్ సుర్జేవాలా బుధవారం ట్వీట్ చేశారు. కోపం, అహకారం ఆరోగ్యానికి హానికరమని, పార్టీ కార్యకర్త తలను నరికేంత కోపం […] The post కార్యకర్త తల నరికేస్తానన్న హర్యానా సిఎం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

చండీగఢ్: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సహనం కోల్పోయారు. తన తలపై కిరీటం పెట్టేందుకు ప్రయత్నించిన పార్టీ కార్యకర్త చేతులను నరికేస్తానంటూ గొడ్డలి చేతిలో పట్టుకుని శివాలూగారు. ఒక ర్యాలీ సందర్భంగా ఈ జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రణదీప్ సింగ్ సుర్జేవాలా బుధవారం ట్వీట్ చేశారు. కోపం, అహకారం ఆరోగ్యానికి హానికరమని, పార్టీ కార్యకర్త తలను నరికేంత కోపం ఖత్తర్‌కు ఎందుకు వచ్చిందంటూ ఆయన ప్రశ్నించారు. కాగా..ఈ వీడియో గురించి ముఖ్యమంత్రి ఖత్తర్ జవాబిస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి సంస్కృతికి చరమగీతం పాడామని చెప్పుకొచ్చారు. నా తలపై వెండి కిరీటం పెట్టడానికి మా కార్యకర్త ప్రయత్నించినా నాకు కోపం వస్తుంది..దీన్ని నేను సహించను అంటు ఆయన తెలిపారు. తన వ్యాఖ్యలపై పార్టీ కార్యకర్త బాధపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. జన ఆశిర్వాద్ యాత్ర సందర్భంగా ఒక ఓపెన్ టాప్ జీపు పైన నిలుచున్న ఖత్తర్‌కు పార్టీ కార్యకర్త ఒకరు గొడ్డలి ఇచ్చారు. దాన్ని చేతిలో పట్టుకుని ఉండగా మరో గుర్తు తెలియని కార్యకర్త వచ్చి ఆయనకు వెండి కిరీటం తలపై పెట్టబోయాడు. దీంతో ఆగ్రహించిన ఖత్తర్ నీ తలను నరికేస్తాను అంటూ ఆగ్రహంతో మండిపడడం ఈ వీడియో క్లిప్‌లో రికార్డయింది.

 

 

Wielding axe, Khattar tells supporter: Will chop off head
With axe in hand, Manohar Lala Khattar tells supporter: ‘I will chop your head off’
Holding the axe in his hand, which was given to him by someone from the public, the chief minister told the worker, Gardan kaat doonga teri (I will chop your head off).

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కార్యకర్త తల నరికేస్తానన్న హర్యానా సిఎం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.