మొక్కలను మేసిన మేకలు అరెస్టు

  హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం హరిత హారంలో నాటిన మొక్కలను మేసిన మేకలను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఎన్‌జిఒ సంస్థ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్, గవర్నమెంటు ఆస్పత్రి, ఎంఆర్‌ఒ ఆఫీసులో 980 మొక్కలు నాటారు. నాటిన మొక్కలను మేకలు మేయడమే కాకుండా ధ్వంసం చేస్తున్నాయి. దీంతో అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మొక్కలను మేస్తున్న మేకలను పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అప్పటికే 250 చెట్లను ధ్వంసం […] The post మొక్కలను మేసిన మేకలు అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం హరిత హారంలో నాటిన మొక్కలను మేసిన మేకలను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఎన్‌జిఒ సంస్థ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్, గవర్నమెంటు ఆస్పత్రి, ఎంఆర్‌ఒ ఆఫీసులో 980 మొక్కలు నాటారు. నాటిన మొక్కలను మేకలు మేయడమే కాకుండా ధ్వంసం చేస్తున్నాయి. దీంతో అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మొక్కలను మేస్తున్న మేకలను పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అప్పటికే 250 చెట్లను ధ్వంసం చేశాయి. మేకల యజమాని దోరకొండ రాజయ్యను పోలీసులు పిలిపించి 1000 రూపాయల జరిమానా విధించారు. మేకలను ప్రభుత్వాఫీసులు ఉన్న స్థలంలో మేపవద్దని హెచ్చరించారు. గ్రామ శివారులోని అడవిలో మేకలను మేపాలని సూచించారు. హరితహారం పథకం ద్వారా అడవుల శాతాన్ని పెంచాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

 

Goats are Arrested for Eating planted Tree

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మొక్కలను మేసిన మేకలు అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.