బాలాపూర్ లడ్డూ వేలంపాటు ప్రారంభం

  హైదరాబాద్: 11 రోజులుగా ప్రత్యేక పూజలు అందుకున్న గణపతులు నిమజ్జనానికి సిద్ధం అయ్యాయి. నగరంలోని గణనాథుల శోభాయాత్రలు ఈ రోజు ఉదయం నుంచే ప్రారంభమయ్యాయి. హుస్సేన్ సాగర్ నిమజ్జనం కానున్న గణపతులను చూడడానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఉదయమే కదలిన ఖైరతాబాద్ గణేష్ మధ్యాహ్నంలోపే నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. తాజాగా బాలాపూర్ మహా గణేశుడి శోభాయాత్ర ప్రారంభమైంది. భారీ వాహనంపైకి గణేశుడిని ఎక్కించి బాలాపూర్ లో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం అక్కడ లడ్డూ […] The post బాలాపూర్ లడ్డూ వేలంపాటు ప్రారంభం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: 11 రోజులుగా ప్రత్యేక పూజలు అందుకున్న గణపతులు నిమజ్జనానికి సిద్ధం అయ్యాయి. నగరంలోని గణనాథుల శోభాయాత్రలు ఈ రోజు ఉదయం నుంచే ప్రారంభమయ్యాయి. హుస్సేన్ సాగర్ నిమజ్జనం కానున్న గణపతులను చూడడానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఉదయమే కదలిన ఖైరతాబాద్ గణేష్ మధ్యాహ్నంలోపే నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. తాజాగా బాలాపూర్ మహా గణేశుడి శోభాయాత్ర ప్రారంభమైంది. భారీ వాహనంపైకి గణేశుడిని ఎక్కించి బాలాపూర్ లో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం అక్కడ లడ్డూ వేలంపాటు ప్రారంభించారు. ఈ వేలంపాటలో 19 మంది పోటీపడుతున్నారు. కాగా, గత ఏడాది రూ.16.60లక్షలు పలికిన బాలాపూర్‌ లడ్డూ, ఈ సారి ఎంత ధర పలుకుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వేలంపాట తర్వాత ట్యాంక్ బండ్ వైపు 18 కిలోమీటర్ల మేర బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర కొనసాగనుంది. సాయంత్రం 4.30 గంటల లోపు బాలాపూర్ గణేశుడి నిమజ్జనం జరుగుతుందని రాచకొండ సిపి మహేశ్ భగవత్ తెలిపారు.

Balapur ganesh laddu auction started

The post బాలాపూర్ లడ్డూ వేలంపాటు ప్రారంభం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.