గణేష్ నిమజ్జనం…. నగరంలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు

  హైదరాబాద్: నగరంలో గణపతుల శోభాయాత్రలు ప్రారంభమయ్యాయి. గురువారం నిమజ్జనానికి నగరంలోని అన్నీ గణనాథులు హుస్సేన్ సాగర్ వైపు తరలివస్తున్నాయి. దీంతో గణేష్ నిమజ్జనం చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో పోలీసులు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శాంతి భద్రతలకు ఎక్కడా విఘాతం కలుగకుండా ముందస్తూ చర్యలు తీసుకున్నామని, శోభాయాత్ర జరిగే మార్గాల్లో సిసి కెమెరాలను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. వేల మంది పోలీసులతో నగరంలో పటిష్టబందోబస్తు ఏర్పాటు […] The post గణేష్ నిమజ్జనం…. నగరంలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: నగరంలో గణపతుల శోభాయాత్రలు ప్రారంభమయ్యాయి. గురువారం నిమజ్జనానికి నగరంలోని అన్నీ గణనాథులు హుస్సేన్ సాగర్ వైపు తరలివస్తున్నాయి. దీంతో గణేష్ నిమజ్జనం చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో పోలీసులు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శాంతి భద్రతలకు ఎక్కడా విఘాతం కలుగకుండా ముందస్తూ చర్యలు తీసుకున్నామని, శోభాయాత్ర జరిగే మార్గాల్లో సిసి కెమెరాలను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. వేల మంది పోలీసులతో నగరంలో పటిష్టబందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలు చోట్ల వాహనాల మళ్లింపు కూడా చేశారు. గణపతి విగ్రహాలు తప్ప ఇతర వాహనాలకు రోడ్లపైకి అనుమతి లేదని, అత్యవసర పనులు ఉన్నవారు మెట్రో, ఎంఎంటీఎస్‌ సేవలను వినియోగించుకోవాలని పోలీసులు తెలిపారు. కాగా, ప్రయాణికుల కోసం మెట్రో రైలు వేళల్ని కూడా అధికారులు పొడిగించిన విషయం తెలిసిందే.

Ganesh Nimajjanam: Heavy traffic restrictions in Hyd

The post గణేష్ నిమజ్జనం…. నగరంలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: