కొత్త చట్టం కొరడా మెరుపులు

  కొత్త చట్టం ప్రకారం దొరికిపోయిన ఓ టూవీలర్ సొంతదార్లు బెంగళూరులో ఒకే దెబ్బకు రూ. 17,000/ కట్టవలసి వచ్చింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కింద రూ. పది వేలు, డ్రైవింగ్ లైసెన్స్ లేనందుకు అయిదు వేలు, ఇద్దరు హెల్మెట్లు పెట్టుకోనందువల్ల రెండు వేలు. ఇదీ అక్కడి పోలీసులు ఆయన చేతిలో పెట్టిన బిల్లు. ఇలాగే మరో చోట భారీ వడ్డింపుకు కోపోద్రిక్తుడై ఓ రెండు చక్రాల బండి యజమాని ఏకంగా ట్రాఫిక్ సిబ్బంది ముందే తన […] The post కొత్త చట్టం కొరడా మెరుపులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కొత్త చట్టం ప్రకారం దొరికిపోయిన ఓ టూవీలర్ సొంతదార్లు బెంగళూరులో ఒకే దెబ్బకు రూ. 17,000/ కట్టవలసి వచ్చింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కింద రూ. పది వేలు, డ్రైవింగ్ లైసెన్స్ లేనందుకు అయిదు వేలు, ఇద్దరు హెల్మెట్లు పెట్టుకోనందువల్ల రెండు వేలు. ఇదీ అక్కడి పోలీసులు ఆయన చేతిలో పెట్టిన బిల్లు. ఇలాగే మరో చోట భారీ వడ్డింపుకు కోపోద్రిక్తుడై ఓ రెండు చక్రాల బండి యజమాని ఏకంగా ట్రాఫిక్ సిబ్బంది ముందే తన బైకును తగలబెట్టేశాడట.

రాష్ట్రాలకు ఇప్పటి వరకు మద్యం అమ్మకాలు, భూముల రిజిస్ట్రేషన్లు ప్రధాన ఆదాయ వనరులుగా ఉంటూ వస్తున్నాయి. ఇక నుంచి వాహనాలపై వసూలు చేసే అపరాధ రుసుము కూడా అక్షయ పాత్రగా మారే అవకాశం ఉంది. కేంద్రం ఇటీవల సవరించిన మోటారు వాహనాల చట్టం ప్రకారం పెంచిన పెనాల్టీలు వాహనదారులను నక్షత్రకుడిలా వెంట పడేలా ఉన్నాయి. సవరించిన రేట్ల ప్రకారం ఒక్కో పెనాల్టీ అయిదు నుంచి పదింతలు పెరిగింది. కారు సీట్టు బెల్టు పెట్టుకోకపోతే వసూలు చేసే రూ. 100/ స్థానంలో పెనాల్టీ రూ. 1000/ అయింది.

మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే ఇంత వరకు రూ. 1000/ పెనాల్టీ ఉండగా ఇప్పుడది రూ. 5000/గా పెంచబడింది. మోతాదుకు మించి మందు కొట్టి వాహనం నడుపుతూ పట్టుబడితే రూ. 2000/ కాదు ఏకంగా రూ. 10,000/ సమర్పించుకోవాలి. తెలిసో తెలియకో అంబులెన్సుకుగాని, అగ్నిమాపక వాహనానికిగాని దారి ఈయనట్లు దొరికిపోతే రూ. 10,000/ వదులుకోవాలి. హెల్మెట్ లేకుండా టూ వీలర్ నడిపితే వంద కాదు వేయి రూపాయలు కట్టి తీరాలి.

కొత్త చట్టం ప్రకారం దొరికిపోయిన ఓ టూవీలర్ సొంతదార్లు బెంగళూరులో ఒకే దెబ్బకు రూ. 17,000/ కట్టవలసి వచ్చింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కింద రూ. పది వేలు, డ్రైవింగ్ లైసెన్స్ లేనందుకు అయిదు వేలు, ఇద్దరు హెల్మెట్లు పెట్టుకోనందువల్ల రెండు వేలు. ఇదీ అక్కడి పోలీసులు ఆయన చేతిలో పెట్టిన బిల్లు. ఇలాగే మరో చోట భారీ వడ్డింపుకు కోపోద్రిక్తుడై ఓ రెండు చక్రాల బండి యజమాని ఏకంగా ట్రాఫిక్ సిబ్బంది ముందే తన బైకును తగలబెట్టేశాడట.

ఇలా దేశంలో వాహనదారుల ఒంట్లో వణుకు పుట్టిస్తున్న ఈ కొత్త చట్టం ఈ నెల ఒకటి నుండి అమలులోకి వచ్చింది. చట్టంలోని సెక్షన్ 200 ప్రకారం రాష్ట్రాలు సదరు రుసుముల్లో హెచ్చుతగ్గులు చేసుకొనే అవకాశం ఉంది. ఆ తర్వాత గెజెట్ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రాలు దీనిని అమలు చేయాలి. అయితే సవరించిన రేట్లు తప్పుకు జరిమానా స్థాయిలో కాకుండా పౌరుల ఆదాయాన్ని గండి కొట్టేలా ఉన్నాయనీ విమర్శలు వస్తున్నాయి. రాబోయే ఆర్థిక మాంద్యాన్ని తట్టుకొనేందుకు పన్నులు పెంచకుండా ఇలా దొంగ దెబ్బ తీసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు వస్తున్నాయి. అయితే దేశంలో జరుగుతున్న ట్రాఫిక్ తప్పిదాలను, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఈ పెంపు బాగా ఉపయోగపడుతుందని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ప్రభుత్వ చర్యను సమర్థించుకుంటున్నారు.

దేశంలో ఏడాదికి 5 లక్షల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని, వాటి వల్ల సుమారు లక్షన్నర మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 3 లక్షల దాకా గాయాల పాలవుతున్నారని దానికి ఇదే విరుగుడు అని ఆయన వాదన. కేంద్ర మోటారు వాహనాల చట్టం 1989 నుండి చిన్నచిన్న సవరణలతో కొనసాగుతోంది. అయితే వాహనాల సంఖ్య నాటికి నేటికి చెప్పరానంతగా పెరిగిపోయింది. కారో, బైకో లేని ఇళ్లు దేశంలో కనబడదనుకోవచ్చు. సూర్యుడు ఉదయించక ముందే ట్రాఫిక్ సిగ్నల్స్ డ్యూటీకి ఎక్కుతున్నాయి. మామూలు పట్టణ రహదారులు కూడా రెండు, నాలుగు చక్రాల వాహనాలతో నిండి పోతున్నాయి.

అనుమతికి మించిన వేగం, సిగ్నల్ జంపింగ్ సాధారణమై పోయింది. రోడ్డు ప్రమాద బాధితుల్లో అధికులు 20 నుండి 35 ఏళ్ల వయసు వాళ్లే. డ్రైవింగ్ లైసెన్సు పొందే వయసు రాని మైనర్లు వాహనాలను నడపడం మన దగ్గర సర్వసాధారణమే. దాన్ని కట్టడి చేయడానికి ఈ చట్టం కోరల్ని మరింత పదును పెట్టింది. లైసెన్సు లేని పిల్లలు కారు నడిపి పట్టుబడితే సదరు కారు రిజిస్ట్రేషన్ ఏడాది పాటు రద్దయిపోతుంది. ఏడాది తర్వాత కూడా కొత్తగా రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవలసిందే. పట్టుబడిన మైనరుకు 25 ఏళ్ల వయసు దాకా డ్రైవింగ్ లైసెన్సు ఇవ్వబడదు. వీటికి తోడుగా కారు యజమానికి రూ. 25,000/ జరిమానాతో పాటు 3 ఏళ్లు జైలు శిక్ష ఖాయం.

ఈ చట్టం చూడడానికి కేంద్రంలోని ఒక మంత్రిత్వ శాఖ ద్వారా అమలులోకి వచ్చినట్లు కనబడినా దీని వల్ల చాలా అనుబంధ మార్పులకు దేశం లోనవుతుంది. వాహన బీమా లేకుండా దాన్ని రోడ్డుపైకి తెస్తే బీమా ప్రీమియం కన్నా జరిమానా ఎక్కువ కాబట్టి బీమా వ్యాపారం పెరుగుతుంది. హెల్మెట్లు అమ్మకాలు పెరుగుతాయి. రవాణ శాఖకు లైసెన్సుల దరఖాస్తులు క్యూ కడతాయి. తాగి బండి నడిపితే రూ. 10,000 వదులుకోవలసి రావడంతో బార్లలో గిరాకీ తగ్గవచ్చు. చీటికి మాటికి రోడ్డుపైకి వాహనాలు రావడం మాని బండి, రోడ్డు రెండింటి జీవిత కాలం పెరగవచ్చు. ఇలా మొత్తంగా దేశ రవాణ, వాహన ప్రయాణ వ్యవస్థనే భారీ ప్రక్షాళనకు గురయ్యే అవకాశం ఈ చట్టం ద్వారా ఉంది.

అయితే భారీ వడ్డింపులపైనే అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. సగటు భారతీయుడికి ఇవి ఆశనిపాతంగానే భావించాలి. చేతిలో ఉన్న వాహనం పెట్రోలు తాగడంతోపాటు జరిమానాలను కూడా మూట కడితే దానిని తట్టుకొనే ఆర్థిక స్థితి ఎంత మంది కుందనేది భారీ పెనాల్టీ కన్న పెద్ద ప్రశ్న. 31 ఏళ్ల తర్వాత జరిగిన ఈ చట్ట సవరణలో 63 క్లాజులు కొత్తగా చేర్చబడ్డాయి. 2016లో కేంద్రానికి ఈ ఆలోచన తట్టింది. రాష్ట్రాల నుండి అభిప్రాయ సేకరణ చేపట్టింది. దేశంలో బిజెపి పాలిత రాష్ట్రాలు ఎక్కువగా ఉన్నందున 18 రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. జులై 23న లోక్‌సభలో జులై 31లో రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టబడి సభల మద్దతు పొందింది.

ఆగస్టు 9న రాష్ట్రపతి ఆమోద ముద్రతో రోడ్డు పైకి వచ్చింది. సెప్టెంబర్ 1 నుండి కొన్ని రాష్ట్రాలలో దీని అమలు మొదలైంది. ప్రవేశపెట్టిన తొలి రోజునే ఒడిషాలో ఒక ఆటో డ్రైవర్ రూ. 47,500/ జరిమానా చెల్లించలేక ఆటోను వదిలి వెళ్లిపోయాడు. ఆటోను అదుపులోకి తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు యజమానిపై కోర్టులో కేసు వేసి మొత్తం సొమ్మును రాబడతామని చట్టాన్ని స్పష్టం చేశారు. కొత్త చట్టంపై సరియైన అవగాహన లేని వారు దోషులు, నేరస్థులు అయిపోతున్నారు. పత్రికల్లో వార్తల రూపంలో తప్ప ప్రభుత్వం స్వయంగా ఈ పెంపు పట్ల పౌరులకు అవగాహన కలిగించే పని చేపట్టినట్లు లేదు.

ఈ చట్టాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు స్వల్పంగా తగ్గగా పెనాల్టీ కలెక్షన్లు మాత్రం రికార్డు సృష్టిస్తున్నాయి. హరియాణ, ఢిల్లీ, ఒడిషా, తమిళనాడు, కర్నాటక తదితర రాష్ట్రాల్లో దీని అమలు మొదలైంది. అయితే ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ఒడిషా ప్రభుత్వం పునరాలోచనలో పడింది. భారీగా చలాన్లు చెల్లిస్తున్న వాహనదారులు వ్యక్తపరుస్తున్న ఆగ్రహాన్ని చల్లార్చేందుకు 3 నెలల పాటు దీని అమలును వాయిదా వేసింది. ఈలోగా వాహనదారులు తగిన ధ్రువ పత్రాలను దగ్గర పెట్టుకొనేందుకు సమయమిచ్చినట్లయింది. జరిమానాలు చెల్లించలేక వాహనాలు వదిలి వెళ్లే వారి సంఖ్య రోజు రోజుకూ పెరగడంతో ఈ యూటర్న్ తీసుకోక తప్పలేదు. ఈ వ్యతిరేకత కేవలం ఒక రాష్ట్రానికే పరిమితం కాకపోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలతో సహా మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ ఇంకా ఈ చట్టాన్ని అమలులోకి తేలేదు. ప్రధాని ఏలిన రాష్ట్రమైన గుజరాత్ కూడా దీని అమలుకు మీనమేషాలు లెక్కిస్తోంది. పంజాబ్ పాత రేట్లకే మొగ్గు చూపుతోంది.

తెలంగాణ ప్రభుత్వం ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోనట్లుగా పోలీసు అధికారుల మాటల ద్వారా తెలుస్తోంది. కొత్త చలాన్లపై పూర్తిస్థాయి చర్చ జరగాల్సి ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ముందుగా రోడ్దు వాడకందారుల, ట్రాఫిక్ నిబంధనలపై, పెనాల్టీలపై సరియైన అవగాహన కల్పించే పనిలో ఉన్నామని అధికారులు అంటున్నారు. మన దేశంలో రో డ్డు ప్రమాదాలకు మితిమీరిన వేగం, రోడ్ల నిర్వహణా లోపం ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. టూ వీలర్ స్పీడో మీటర్‌లో గంటకు వంద కిలోమీటర్ల వేగం పోయే వెసులు వీలు కనబడుతుంది. 80 కిలోమీటర్ల వేగానికి మోటారు సైకిలు అదుపు తప్పుతుంది. గంటకు 60 కి.మీ మించని వేగానికి వీటిని కట్టడి చేయడం అత్యవసరం.

హైవేలు ఎక్కిన కార్లు కళ్లెం వదలిన గుర్రాలవుతున్నాయి. కార్లకు 80 కి.మీ. వేగం చాలు. అంతకు మించిన వేగం వల్ల సాధించేది ఏమీ లేకున్నా ప్రాణాంతక పరిస్థితి రావడం తథ్యం. ఇక రోడ్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. రోడ్లపై సంబంధిత శాఖలు కాకుండా ఎవరు పడితే వారు స్పీడ్ బ్రేకర్లు నిర్మిస్తుంటారు. అడ్డంగా తవ్వి వదిలిపెడుతుంటారు. స్పీడ్ బ్రేకర్లకు తగిన కొలతలు, వాటిని గ్రహించే గీతలు లాంటి నిబంధనలు గాలిలో ఉంటాయి. రోడ్ల మరమ్మత్తులకు ఏటా కోట్లాది రూపాయలు ఖర్చయినా వాటి కనీసం ఏడాది కూడా మిగలదు. వీటన్నింటినీ విస్మరించి రోడ్డు ప్రమాదాలకు వాహనదారులొక్కరే కారణమన్నట్లుగా దానికి విరుగుడు భారీగా పెనాల్టీల వడ్డింపు తగిన మందు అనడంలో లోపాయికారిగా ప్రభుత్వం దురాశ కూడా కనబడుతోంది.

New Motor Vehicle Act laws hike driving penalties

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కొత్త చట్టం కొరడా మెరుపులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: