నిమజ్జనం నేడే

  హైదరాబాద్ మూడు కమిషనరేట్లలో 35వేల మంది పోలీసు సిబ్బందికి విధులు ట్యాంక్‌బండ్ చుట్టూ 100 సిసి కెమెరాలు : డిజిపి మహేందర్‌రెడ్డి ట్యాంక్‌బండ్ చుట్టూ 100 సిసి కెమెరాలు నిమజ్జనం సాఫీగా జరిగేలా చర్యలు అన్ని శాఖలతో సమన్వయం చేసుకున్నాం : డిజిపి మహేందర్‌రెడ్డి హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనం సాఫీగా జరిగేలా పలు రకాల చర్యలు తీసుకున్నామని డిజిపి మహేందర్‌రెడ్డి తెలిపారు. ఇందుకు అన్ని శాఖలతో ఇప్పటికే సమన్వయం చేసుకున్నామన్నారు. బుధవారం […] The post నిమజ్జనం నేడే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్ మూడు కమిషనరేట్లలో 35వేల మంది పోలీసు సిబ్బందికి విధులు
ట్యాంక్‌బండ్ చుట్టూ 100 సిసి కెమెరాలు : డిజిపి మహేందర్‌రెడ్డి

ట్యాంక్‌బండ్ చుట్టూ 100 సిసి కెమెరాలు
నిమజ్జనం సాఫీగా జరిగేలా చర్యలు
అన్ని శాఖలతో సమన్వయం చేసుకున్నాం : డిజిపి మహేందర్‌రెడ్డి

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనం సాఫీగా జరిగేలా పలు రకాల చర్యలు తీసుకున్నామని డిజిపి మహేందర్‌రెడ్డి తెలిపారు. ఇందుకు అన్ని శాఖలతో ఇప్పటికే సమన్వయం చేసుకున్నామన్నారు. బుధవారం సా యంత్రం లక్డీకాపూల్‌లోని డిజిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహేందర్‌రెడ్డి మాట్లాడారు. గురువారం గణేష్ నిమజ్జనం హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సాగుతుందన్నారు. శాంతి భద్రతలకు ఎక్కడా విఘాతం కలుగకుండా ముందస్తూ చర్యలు తీసుకున్నామని తెలిపారు. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని, ఇందుకోసం ట్యాంక్ బండ్ చుట్టుపక్కల 100 సిసిటివీలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగిందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 1లక్షకు పైగా గణేష్ మం డపాలను ఏర్పాటు చేశారన్నారు. నేడు 50 వేల గణేశుల నిమజ్జనం జరుగుతుందన్నారు. గ్రేటర్‌తో పాటు శివారు ప్రాంతాల్లో కలుపుకుని మొత్తం 50ప్రాంతాల్లో నిమజ్జనం ఏర్పాట్లు చేశామని వివరించారు. నిమజ్జనం జరిగే అన్ని ప్రాంతాల్లో సిసిటివిలతో పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌తో పాటు మూడు కమిషనరేట్లు, డిజిపి ఆఫీస్‌లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశామని మహేందర్‌రెడ్డి వివరించారు. నిమజ్జనం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహకారముందన్నారు.

మూడు కమిషనరేట్లలలో కలిపి 35 వేల మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారన్నారు. గణేష్ నిమజ్జనంలో మండపానికి చెందిన వాళ్ళతో కలిసి కొనసాగిస్తున్నామన్నారు. నిమజ్జనం పూర్తి అయ్యాక కూడా పోలీస్‌కి సమాచారం అందజేస్తారన్నారు. నిమజ్జనంలో ప్రజలు సైతం భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ నిమజ్జనం చూసేందుకు వచ్చే భక్తులకు, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు ఏర్పాట్లు చేశామన్నారు. అత్యవసరాల నిమిత్తం ఆయా ఏరియాల్లో ట్రాఫిక్ రూట్స్ సైతం ప్లాన్ చేశామన్నారు.నిమజ్జనంపై ఎలాంటి వద్దంతులు ప్రచారం చేయవద్దన్నారు. అలాంటి పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మహేందర్‌రెడ్డి హెచ్చరించారు.

Actions to make the Vinayaka immersion go smoothly

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నిమజ్జనం నేడే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: