ఇంగ్లండ్‌కు చావోరేవో

సమరోత్సాహంతో ఆస్ట్రేలియా, నేటి నుంచి యాషెస్ చివరి టెస్టు లండన్: ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులను కనువిందు చేస్తున్న యాషెస్ సమరం చివరి అంకానికి చేరుకుంది. చిరకాల ప్రత్యర్థులు ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదో చివరి టెస్టు మ్యాచ్ గురువారం నుంచి ఓవల్ మైదానంలో జరుగనుంది. ఇప్పటికే సిరీస్‌లో 21 ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. మరోవైపు ఆతిథ్య ఇంగ్లండ్‌కు ఈ మ్యాచ్ చావోరేవోగా మారింది. సిరీస్‌ను సమం చేయాలంటే ఇంగ్లండ్ ఈ […] The post ఇంగ్లండ్‌కు చావోరేవో appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
సమరోత్సాహంతో ఆస్ట్రేలియా, నేటి నుంచి యాషెస్ చివరి టెస్టు

లండన్: ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులను కనువిందు చేస్తున్న యాషెస్ సమరం చివరి అంకానికి చేరుకుంది. చిరకాల ప్రత్యర్థులు ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదో చివరి టెస్టు మ్యాచ్ గురువారం నుంచి ఓవల్ మైదానంలో జరుగనుంది. ఇప్పటికే సిరీస్‌లో 21 ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. మరోవైపు ఆతిథ్య ఇంగ్లండ్‌కు ఈ మ్యాచ్ చావోరేవోగా మారింది. సిరీస్‌ను సమం చేయాలంటే ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిందే. మ్యాచ్ డ్రా చేసినా సిరీస్ ఆస్ట్రేలియా వశమవుతోంది. దీంతో ఈ మ్యాచ్‌ను ప్రపంచ వన్డే చాంపియన్ ఇంగ్లండ్‌కు సవాలుగా తయారైంది. స్టీవ్ స్మిత్ బ్యాట్‌తో, కమిన్స్, హాజిల్‌వుడ్‌లు బంతితో చెలరేగి పోతుండడంతో ఇంగ్లండ్‌కు పరాజయాలు తప్పడం లేదు.

ఈ సిరీస్‌లో స్మిత్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడు. ఆస్ట్రేలియాను ఒంటి చేత్తో విజయాలు సాధించి పెడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా ఇంగ్లండ్‌కు స్మిత్ రూపంలో పెద్ద ప్రమాదమే పొంచి ఉంది. గాయంతో ఒక టెస్టుకు స్మిత్ దూరం కాగా అందులో ఇంగ్లండ్ విజయం సాధించింది. కాగా, స్మిత్ ఆడిన మూడు టెస్టుల్లో ఆస్ట్రేలియా రెండింటిలో విజయం సాధించింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. అసాధారణ రీతిలో రాణిస్తున్న స్మిత్‌ను కట్టడి చేయడం ఇంగ్లండ్ బౌలర్లకు శక్తికి మించిన పనిగా తయారైంది. ఇప్పటికే రెండు సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ, మరో రెండు అర్ధ సెంచరీలతో స్మిత్ సిరీస్‌పై తనదైన ముద్ర వేశాడు. బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకుని ఏడాది పాటు నిషేధానికి గురైన స్మిత్ రెండో ఇన్నింగ్స్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. తొలుత ఐపిఎల్‌లో, ఆ తర్వాత ప్రపంచకప్‌లో తాజాగా యాషెస్ సిరీస్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఇక, కీలకమైన చివరి మ్యాచ్‌లో కూడా సత్తా చాటాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. ఇక, స్మిత్‌ను ఎలా కట్టడి చేయాలో తెలియక ఇంగ్లండ్ బౌలర్లు సతమతమవుతున్నారు. ఈ మ్యాచ్‌లో స్మిత్‌ను త్వరగా పంపిస్తే ఆస్ట్రేలియాను కట్టడి చేయడం ఇంగ్లండ్‌కు కష్టం కాకపోవచ్చు.

వార్నర్ ఈసారైనా?

ప్రపంచకప్‌లో పరుగుల సునామీ సృష్టించిన ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు డేవిడ్ వార్నర్‌కు యాషెస్ సిరీస్ పీడకలగా మారింది. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు 8 ఇన్నింగ్స్‌లు ఆడిన వార్నర్ కేవలం ఒకే ఒక అర్ధ సెంచరీ సాధించాడు. ఇంగ్లండ్ స్పీడ్‌స్టర్ స్టువర్ట్ బ్రాడ్‌ను ఎదుర్కొవడంలో వార్నర్ ఘోరంగా విఫలమవుతున్నాడు. బ్రాడ్ ప్రతి మ్యాచ్‌లోనూ వార్నర్‌ను లక్షంగా చేసుకుంటున్నాడు. దీంతో ఒత్తిడికి గురవుతున్న వార్నర్ ఆరంభంలోనే వికెట్‌ను పారేసుకుంటున్నాడు. ఇక, ఇంగ్లండ్‌తో జరిగే చివరి టెస్టు వార్నర్‌కు చావోరేవోగా తయారైంది. వరుస వైఫల్యాలతో జట్టుకు భారంగా తయారు కావడంతో అతన్ని తప్పించాలనే డిమాండ్ ఊపందుకుంది. కానీ, ఒక్క ఇన్నింగ్స్‌తో మళ్లీ గాడిలో పడే సత్తా వార్నర్‌కు ఉంది. దీంతో అతనిపై జట్టు మరోసారి నమ్మకం ఉంచింది. కాగా, వార్నర్ కూడా చివరి మ్యాచ్‌లో మెరుపులు మెరిపించాలనే పట్టుదలతో ఉన్నాడు. తనదైన రోజు ఎంతటి బౌలర్‌కైనా చుక్కలు చూపించే సత్తా వార్నర్‌కు ఉంది. దీంతో అతన్ని తక్కువ అంచనా వేస్తే ఇంగ్లండ్ బౌలర్లు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

జోరుమీదున్న బౌలర్లు..

మరోవైపు బౌలింగ్‌లో కూడా ఆస్ట్రేలియా జోరు మీదుంది. హాజిల్‌వుడ్, కమిన్స్, లియాన్ తదితరులతో ఆస్ట్రేలియా బౌలింగ్ చాలా బలంగా మారింది. కమిన్స్ నిలకడైన బౌలింగ్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. హాజిల్‌వుడ్ కూడా తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. ఇక, లియాన్ తనపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటున్నాడు. తాజాగా మిఛెల్ మార్ష్ చేరడంతో ఆస్ట్రేలియా బౌలింగ్ మరింత బలంగా తయారైంది. స్టార్క్ రూపంలో ప్రధాన అస్త్రం ఉండనే ఉంది. బ్యాటింగ్‌లో కాస్త బలహీనంగా కనిపిస్తున్నా బౌలింగ్‌లో మాత్రం కంగారూలకు ఎదురు లేదనే చెప్పాలి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బౌలర్లకు జట్టులో కొదవలేదు. ఒకరు విఫలమైతే మరోకరూ రాణిస్తూ జట్టుకు అండగా ఉంటున్నారు. ఈ మ్యాచ్‌లో కూడా బౌలర్లపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది.

గెలిస్తేనే..

ఇక, ఆతిథ్య ఇంగ్లండ్‌కు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఇప్పటికే సిరీస్‌లో వెనుకబడి పోవడంతో ఆఖరి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన ఒత్తిడి ఇంగ్లండ్‌పై నెలకొంది. ఇందులో గెలిస్తే సిరీస్‌ను 22తో సమం చేసే అవకాశం ఉంటుంది. ఒక వేళ మ్యాచ్ డ్రాగా ముగిసినా ఇంగ్లండ్ యాషెస్‌ను కోల్పోక తప్పదు. దీంతో ఎలాగైనా గెలవాల్సిన ఒత్తిడి ఇంగ్లండ్‌పై నెలకొంది. స్మిత్ భీకర ఫామ్‌లో ఉండడంతో ఇంగ్లండ్‌కు అతి పెద్ద సమస్యగా మారింది. ఈ మ్యాచ్‌లో అతన్ని సాధ్యమైనంత త్వరగా పెవిలియన్ పంపించడమే జట్టు లక్షంగా పెట్టుకుంది. ఇక, కెప్టెన్ రూట్ ఫామ్ కోసం తంటాలు పడుతున్నాడు. పేలవమైన ఫామ్‌తో సతమతమవుతున్న రూట్‌కు ఆఖరి మ్యాచ్ పరీక్షగా మారింది. ఇందులో విఫలమైతే కెప్టెన్సీ ప్రమాదంలో పడినా ఆశ్చర్యం లేదు. ఇక మ్యాచ్‌లో కూడా జట్టు స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్‌పై భారీ ఆశలు పెట్టుకుంది.

సిరీస్‌లో ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటున్న ఘనత స్టోక్స్‌కే దక్కుతోంది. ఈ మ్యాచ్‌లో కూడా జట్టుకు కీలకంగా మారాడు. ఆల్‌రౌండర్లు శామ్ కరన్, వోక్స్‌లు మళ్లీ జట్టులో చేరడం ఇంగ్లండ్ పెద్ద ఊరటనిచ్చే అంశమే. వరుస వైఫల్యాలు చవిచూసిన స్టార్ ఆటగాడు జాసన్ రాయ్ చివరి టెస్టు నుంచి తప్పించారు. ఫాస్ట్ బౌలర్ ఓవర్‌టన్‌ను కూడా ఉద్వాసన పలికారు. వోక్స్ రాకతో బౌలింగ్ కాస్త బలంగా తయారైంది. కాగా, జట్టును ముందుండి నడిపించే బాధ్యత మాత్రం కెప్టెన్ రూట్‌పైనే ఉంది. అతనితో పాటు స్టోక్స్, కరన్, బట్లర్‌లు జట్టుకు కీలకంగా మారారు. వీరంతా సమష్టిగా రాణిస్తే ఆస్ట్రేలియాను ఓడించడం ఇంగ్లండ్‌కు అసాధ్యమేమి కాదు.

Australia Vs England 5th test

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఇంగ్లండ్‌కు చావోరేవో appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: