ప్లాస్టిక్‌పై మోడీ యుద్ధం

  ప్లాస్టిక్‌కు దూరంగా ఉండండి మళ్లీ 16వ శతాబ్దంలోకి తీసుకెళ్లాని చూస్తున్నారు ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ ధ్వజం మథురలో జాతీయ పశు వ్యాధి నివారణ కార్యక్రమం ప్రారంభం మథుర : ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ప్రతిపక్షాపై విరుచుకు పడ్డారు. గోవు, ఓం పదాలు వింటేనే కొంత మంది అసహనం ప్రదర్శిస్తున్నారని.. దేశాన్ని తిరిగి 16వ శతాబ్దంలోకి తీసుకెళ్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారన్నారు. అలాంటి అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నవారే నిజానికి దేశాన్ని నాశనం చేస్తున్నారన్నారు. ఆఫ్రికాలోని రువాండాలో ప్రభుత్వమే ప్రతి […] The post ప్లాస్టిక్‌పై మోడీ యుద్ధం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్లాస్టిక్‌కు దూరంగా ఉండండి

మళ్లీ 16వ శతాబ్దంలోకి తీసుకెళ్లాని చూస్తున్నారు
ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ ధ్వజం
మథురలో జాతీయ పశు వ్యాధి నివారణ కార్యక్రమం ప్రారంభం

మథుర : ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ప్రతిపక్షాపై విరుచుకు పడ్డారు. గోవు, ఓం పదాలు వింటేనే కొంత మంది అసహనం ప్రదర్శిస్తున్నారని.. దేశాన్ని తిరిగి 16వ శతాబ్దంలోకి తీసుకెళ్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారన్నారు. అలాంటి అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నవారే నిజానికి దేశాన్ని నాశనం చేస్తున్నారన్నారు. ఆఫ్రికాలోని రువాండాలో ప్రభుత్వమే ప్రతి ఇంటికీ ఒక గోవును ఇస్తుందని, దానికి పుట్టిన తొలి లేగదూడను తిరిగి తీసుకుని ఆవు లేని వారికి ఇస్తుందని ప్రధాని అంటూ, అక్కడ ప్రతి ఇంటికో గోవు ఉండడం తాను స్వయంగా చూశానని అన్నారు.

స్వామి వివేకానంద చికాగో చరిత్రాత్మక ప్రసంగం సెప్టెంబర్ 11నే చేశారని చెబుతూ ఈ రోజు విశిష్టతను గుర్తు చేశారు. సెప్టెంబర్ 11నే అమెరికాలోని వాణిజ్య కేంద్రంపై ఉగ్రదాడి జరిగిందన్నారు. ఉగ్రవాదం ఇప్పుడు ఏ ఒక్క దేశానికో పరిమితం కాలేదని, అంతర్జాతీయ సమస్యగా పరిణమించిందని అంటూ, దాయాది దేశంలోనే అది పురుడు పోసుకుందని పరోక్షంగా పాకిస్తాన్‌ను దుయ్యబట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఒక రోజు పర్యటించిన ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జాతీయ పశువ్యాధి నివారణ పథకాన్ని(ఎన్‌ఎడిసిపి) ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన పలువురు రైతులు, వ్యవసాయ కూలీలతో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గో సంరక్షణ కేంద్రాల్లోని గోవులను దగ్గరనుంచి పరిశీలించారు. భారత ఆర్థిక వ్యవస్థలో పశుపోషణ, పర్యావరణ ఉత్పత్తులు కీలక పాత్ర పోషిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అందుకే స్వచ్ఛ భారత్, జల్ జీవన్ లాంటి పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. అయితే అభివృద్ధికి, పర్యావరణానికి మధ్య సమతుల్యత పాటించాలన్నారు. దేశవ్యాప్తంగా 687 జిల్లాల్లో కృషి విజ్ఞాన కేంద్రాలను ప్రారంభించామని చెప్పారు.

చెత్తనుంచి ప్లాస్టిక్ వేరు చేసిన మోడీ
ఈ సందర్భంగా ప్రధాని మోడీ స్వచ్ఛతా హి సేవా(స్వచ్ఛతే సేవ) కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్కడ చెత్తనుంచి ప్లాస్టిక్‌ను వేరు చేసే మహిళలతో కలిసి నేలపై కూర్చుని ప్లాస్టిక్‌ను వేరు చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకానికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ను మహాత్మాగాంధీ జయంతి అయిన అక్టోబర్ 2నుంచి ప్రతి ఒక్కరూ త్యజించాలని పిలుపునిచ్చారు.

Modi war on plastic

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్లాస్టిక్‌పై మోడీ యుద్ధం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: