రెండు, మూడు రోజుల్లో రైతుబంధు మిగతా సొమ్ము ఖాతాల్లోకి

  రైతుల విషయంలో రాజకీయాలొద్దు రెండు, మూడు రోజుల్లో రైతుబంధు నిధులు అన్ని జిల్లాల్లో సరిపడా యూరియా నిల్వలు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హైదరాబాద్ : రైతుబంధు పెట్టుబడి సాయం రాని రైతులకు రెండు, మూడు రోజుల్లో నిధులు వస్తాయని వాటిని వారి బ్యాంకు ఖాతాల్లో వేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. రైతు విషయంలో రాజకీయాలు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతుబంధు, రైతు బీమాలు కొనసాగుతాయని ఎటువంటి […] The post రెండు, మూడు రోజుల్లో రైతుబంధు మిగతా సొమ్ము ఖాతాల్లోకి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రైతుల విషయంలో రాజకీయాలొద్దు
రెండు, మూడు రోజుల్లో రైతుబంధు నిధులు
అన్ని జిల్లాల్లో సరిపడా యూరియా నిల్వలు
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్ : రైతుబంధు పెట్టుబడి సాయం రాని రైతులకు రెండు, మూడు రోజుల్లో నిధులు వస్తాయని వాటిని వారి బ్యాంకు ఖాతాల్లో వేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. రైతు విషయంలో రాజకీయాలు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతుబంధు, రైతు బీమాలు కొనసాగుతాయని ఎటువంటి అనుమానం అవసరం లేదన్నారు. పెద్దపల్లి కలెక్టరేట్‌లో యూరియా సరఫరా, నిల్వలు, అవసరాలపై, రబీ ప్రణాళికపై మంత్రి కలెక్టర్, ఇతర అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపక్షాలు వీలయితే సాయం చేయాలని, అంతేగానీ అన్నం పెట్టే అన్నదాతలను క్షోభకు గురిచేయొద్దని కోరారు.- ప్రతిపక్షాలు రైతుల ఆత్మవిశ్వాసం పెంచే పనిచేయాలని, ఆత్మస్థైర్యం దెబ్బతీసే పనులు మానుకోవాలని సూచించారు.

రాష్ట్రంలో 7,738 కేంద్రాల నుండి ఎరువులు సరఫరా చేస్తున్నామన్నారు. 6749 ప్రైవేటు డీలర్లు – 938 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు – 51 అగ్రోస్ డీలర్ల ద్వారా ఎరువుల సరఫరా చేస్తున్నామని,- ఏ ఇబ్బంది ఉన్నా ఫోన్ కాల్ చేస్తే స్పందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఏడెనిమిది చోట్ల ఏర్పడ్డ కొరతను తప్పుడు ప్రచారంతో రైతులలో ఆందోళన రేపే ప్రయత్నం చేశారని, – పంపిణీ కేంద్రాల వద్ద ఆలస్యానికి కారణాలను తెలుసుకోకుండా దుష్ప్రచారం మొదలుపెట్టారన్నారు. – రైతులు వేలిముద్రలు పెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఎరువు పంపిణీ ఆలస్యమౌతోందన్నారు. – కష్టం చేసే రైతుల వేళ్ల గీతలు చెరిగి ఉంటాయని, దీంతో ఒక్కోసారి అన్ని వేళ్లూ స్కానింగ్ చేసే అవకాశం ఉంటుందన్నారు. సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ సమావేశంలో ఎంఎల్‌ఎలు దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

వ్యవసాయ శాఖకు రూ.27 వేల కోట్లు
ఒక్క వ్యవసాయ శాఖకే రూ.27 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయింపులు చేశారని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. సాగునీటి రాకతో రాష్ట్రమంతటా సాగు పెరిగిందన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ లో కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల అధికారులతో సమీక్షించారు. అధికారులు అంచనాలు పంపేముందు క్షేత్రస్థాయిలో సాగు వివరాలు తీసుకుని నివేదిక పంపాలని కోరారు. ప్రస్తుతం అంతటా అవసరానికి సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయన్నారు.- యూరియా అందుబాటులో ఉన్న విషయం రైతు సమన్వయ సమితి, సహకార సంఘాలు , వ్యవసాయ అధికారుల ద్వారా రైతులకు సమాచారం అందించాలన్నారు. సమన్వయం చేయాలని కరీంనగర్ జ్లి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు ఆదేశాలు జారీ చేశారు.- ఈ సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ ఇతర అధికారులు ఉన్నారు.

Rythu Bandhu funds for Farmers

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రెండు, మూడు రోజుల్లో రైతుబంధు మిగతా సొమ్ము ఖాతాల్లోకి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: