గ్రీన్ ఛాలెంజ్ @ 3 కోట్లు

  ఉధృతంగా సాగుతున్న మొక్కలు నాటే కార్యక్రమం ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన హైదరాబాద్ : పచ్చ ప్రగతిలో తెలంగాణ దూసుకపోతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం ఉధృతంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కింద నాటుతున్న మొక్కలు సుమారు 3 కోట్లకు చేరాయి. టిఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యు డు జోగినపల్లి సంతోష్‌కుమార్ ఇచ్చిన ఈ పిలుపుకు దేశ వ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోంది. హరిత జగతి కోసం […] The post గ్రీన్ ఛాలెంజ్ @ 3 కోట్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఉధృతంగా సాగుతున్న మొక్కలు నాటే కార్యక్రమం

ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన

హైదరాబాద్ : పచ్చ ప్రగతిలో తెలంగాణ దూసుకపోతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం ఉధృతంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కింద నాటుతున్న మొక్కలు సుమారు 3 కోట్లకు చేరాయి. టిఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యు డు జోగినపల్లి సంతోష్‌కుమార్ ఇచ్చిన ఈ పిలుపుకు దేశ వ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోంది. హరిత జగతి కోసం పిలుపునిచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమ రూపు దాల్చింది. ఇతింతై వటుడింతైనట్లుగా ఈ కార్యక్ర మం ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. ప్రతి మనిషి తన జీవిత కాలానికి కావాల్సిన ప్రాణవాయువు పొందాలంటే కనీసం మూడు మొక్కలు నాటాలన్న శాస్త్రీయ సందే శం అందరిని ఆలోచింప చేస్తోంది. ఆబాల గోపాలంను సైతం మొక్కలు నాటేలా ప్రేరేపిస్తోంది.

వాడవాడలా విస్తరిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3 కోట్లకు చేరింది. వన హారతికి మేము సైతం అంటూ ప్రతి ఒక్కరూ ఉత్సాహం గా స్పందిస్తున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖు లు, కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధు లు, పలు రాజకీయ పార్టీల నేతలు, స్వచ్చంధ సంఘాలు ఒకరికొకరు సవాలు విసురుకుంటూ మొక్కలు నాటుతున్నారు. తాము నాటిన మొక్కలతో సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.

ఈ దృశ్యాలు పెద్దఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే పచ్చదనయోధులు పద్మశ్రీ జాదవ్ పయెంగ్, పద్మశ్రీ వనజీవి రామ య్య, కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవడేకర్, హర్షవర్ధన్, భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జెపి.నడ్డా, సినీ తార లు చిరంజీవి, నాగార్జునతో పాటు రాజకీయ ప్రముఖు లు కెటిఆర్, కవిత, ప్రముఖ క్రీడాకారులు సచిన్, వివిఎస్.లక్ష్మణ్, పుల్లెల గోపీచంద్, కిదాంబి శ్రీకాంత్, పివి.సింధు, సానియా మీర్జా, సైనా నెహ్వాల్, ద్యుతిచం ద్, సిక్కిరెడ్డి తదితరులు మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు మరింత ఊపు తీసుకొచ్చారు.

ఎంపి సంతోష్‌కుమార్ సవాలుకి ఎంతోమంది రాజకీ య నేతలు స్పందించి మొక్కలు నాటి ఇతరులకి ఛాలెం జ్ ఇచ్చారని ఇగ్నైటింగ్ మైండ్స్ ఫౌండర్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త ఎం.కరుణాకర్‌రెడ్డి తెలిపారు. అందరి కృషితో త్వరలో 10 కోట్ల మొక్కలకి చేరువవుతామన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో మొదలైన ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి ఒఎస్‌డి ప్రియాంక వర్గీస్ మొదటి మొక్క నాటారు.

ఒక కోటి మొక్కను పురపాలక శాఖ మంత్రి కెటిఆర్, రెండవ కోటి మొక్కను సంతోష్ కుమార్ నాటారు. తాజాగా భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్‌రావు మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి, బిజెపి శాసనసభ్యు డు రాజాసింగ్, ఎంఎల్‌సి రాంచందర్‌రావు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌కు సవాలు విసిరారు. పర్యావరణ పరిరక్షణ, హరిత విశ్వం, మానవ భవితకోసం తలపెట్టి న ఈ మహా క్రతువులో అందరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.

గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సైదిరెడ్డి
సిఎం కెసిఆర్ లక్షమైన తెలంగాణకు హరితహారంతో పాటు ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ ఛాలెంజ్‌ను స్వీకరించిన హుజుర్‌నగర్ టిఆర్‌ఎస్ నేత శానంపూడి సైదిరెడ్డి బుధవారం పెద్దఎత్తున మొక్కలు నాటారు. ఇలాంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

Telangana is emerging in Green

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గ్రీన్ ఛాలెంజ్ @ 3 కోట్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: