డెంగ్యూ పేరుతో హడల్

  రోగులను భయపెడుతున్న ప్రైవేటు ఆస్పత్రులు, కఠిన చర్యలు తప్పవన్న డీఎంహెచ్‌వో సంగారెడ్డి : ఊరంతా జ్వరాలు ఎక్కడ చూసినా ప్రజల ఇబ్బందులు ఏ ఆస్పత్రి చూసినా రోగుల రద్దీ… ! ఈ తరుణంలో డీఎంహెచ్‌వో మోజీరాం రాథోడ్ బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీ చేశారు. సంగారెడ్డిలోని వివిధ ఆస్పత్రులలో ఆకస్మికంగా ఆయన జరిపిన పర్యటన ఒక్కసారిగా కలకలం సృష్టించింది. కొద్దిరోజులుగా సంగారెడ్డిలోని ప్రైవేట్ ఆస్పత్రులు రోగుల నుంచి ఇష్టానుసారంగా వేలాది రూపాయలను వసూలు […] The post డెంగ్యూ పేరుతో హడల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రోగులను భయపెడుతున్న ప్రైవేటు ఆస్పత్రులు, కఠిన చర్యలు తప్పవన్న డీఎంహెచ్‌వో

సంగారెడ్డి : ఊరంతా జ్వరాలు ఎక్కడ చూసినా ప్రజల ఇబ్బందులు ఏ ఆస్పత్రి చూసినా రోగుల రద్దీ… ! ఈ తరుణంలో డీఎంహెచ్‌వో మోజీరాం రాథోడ్ బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీ చేశారు. సంగారెడ్డిలోని వివిధ ఆస్పత్రులలో ఆకస్మికంగా ఆయన జరిపిన పర్యటన ఒక్కసారిగా కలకలం సృష్టించింది. కొద్దిరోజులుగా సంగారెడ్డిలోని ప్రైవేట్ ఆస్పత్రులు రోగుల నుంచి ఇష్టానుసారంగా వేలాది రూపాయలను వసూలు చేస్తున్నాయి. జ్వరాలతో వచ్చిన వారి నుంచి ముక్కుపిండి దండుకుంటున్నాయి. ఫలితంగా సాధారణ జ్వరానికి కూడా వేలాది రూపాయ లు చెల్లించక తప్పడం లేదు.

ఫలితంగా రోగులు చిన్న జ్వరానికి కూడా అల్లాడిపోతున్నారు. వారి కుటుంబసభ్యులు ఆస్పత్రుల బిల్లులతో బెంబేలెత్తుతున్నారు. ఆస్పత్రులకు వెళ్లాలంటేనే… భయపడుతున్నారు. డెంగ్యూ భయంతో బాధితులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా టెస్టుల పేరుతో, చికిత్సల పేరుతో వేలాది రూపాయలను వసూలు చేస్తున్న తీరు విస్మయం కలిగిస్తోంది. ఈ సమయంలో డీఎంహెచ్‌వో పట్టణంలోని గోకుల్ వెంకటేశ్వర్, సిటీ హాస్పటల్, మంజీరా హాస్పిటల్, చరిత హాస్పిటల్ లను తనిఖీ చేశారు. ఆయా ఆస్పత్రులలో ఏర్పాటుచేసిన ల్యాబులను కూడా పరిశీలించారు. అక్కడి సిబ్బంది చేస్తున్న టెస్టుల వివరాల అడిగి తెలుసుకున్నారు. రోగులు ఏ కారణంతో ఆస్పత్రికి వచ్చారో.. ఏ రకమైన టెస్టులను డాక్టర్లు సిఫారస్ చేస్తున్నారో… ఆసలు సిఫారసు చేసిన టెస్టులు ఆయా ఆస్పత్రులలో ఉన్నాయా.. ? అని ఆరా తీశారు.

సంగారెడ్డిలో డెంగ్యూ వ్యాధి నిర్దారణకు సంబంధించిన పరీక్షలు సక్రమంగా జరగడం లేదని, ఈ సందర్బంగా డీఎంహెచ్‌వో నిర్దారణ చేశారు. ఈ రకమైన టెస్టులతో వ్యాధిని నిర్దారించడం మంచి పద్దతి కాదని అందువల్ల సరైన విధంగా టెస్టులు చేయాలని ఆస్పత్రి వర్గాలకు సూచించారు. ఎలిస్సా పరీక్ష ద్వారానే డెంగ్యూ-వ్యాధిని గుర్తిస్తారని, మామూలు ఎన్‌ఎస్‌ఐ పరీక్షలతో వ్యాధి నిర్దారణ సాధ్యం కాదని స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు తప్పనిసరిగా అన్ని జ్వరాల కేసులను తమకు తెలియజేయాలని సూచించారు. లేనట్లయితే కఠిన చర్యలు తప్పవన్నారు.

ప్లేట్ లెడ్స్ సంఖ్య 30వేలకు పడిపోయినా… భయపడాల్సిన అవసరం లేదని… ప్రజలకు సూచించారు. ఈ పేరుతో ప్రజలను భయపెట్టాలని కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు చూస్తున్నాయని పేర్కొన్నారు. ఈ విధంగా భయపెట్టడం సరికాదన్నారు. కళ్లు,చిగుళ్లు, ముక్కు నుంచి రక్త స్రావం ఉంటేనే… ఆస్పత్రుల్లో చేరాలని పేర్కొన్నారు. ప్రత్యేక దోమ వల్ల డెంగ్యూ, చికున్ గున్యా వ్యాదులు వస్తాయని పేర్కొన్నారు. శుక్రవారం నాడు.. ఒక్కరోజు డ్రైడేగా పాటించి దోమ లార్వాలను నిర్మూలించాలని కోరారు. ఈ తనిఖీల్లో జిల్లా మలేరియా అధికారి ప్రసాద్, కుమార్, అసిస్టెంట్ మలేరియా అధికారి శ్రీరాం సుధాకర్, సుగుణాకర్ పాల్గొన్నారు.

Private Hospitals Terrorize Patients with Dengue

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post డెంగ్యూ పేరుతో హడల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: