ప్రేమజంట ఆత్మహత్య

రంగారెడ్డి: చెట్టుకు ఉరివేసుకొని ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లేడ్ చౌదరిగూడ మండల పరిధిలోని పెద్ద ఎల్కిచర్ల అడవిలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన కథనం ప్రకారం… మండల పరిధిలోని ర్యావిర్యాల గ్రామానికి ముసిరిగళ్ల కృష్ణవేణి (17) , మైసగళ్ల.మల్లేష్ (20) అనే ఇద్దరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే కృష్ణవేణి మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో చాయ్ లో వేసుకోవడానికి బిస్కెట్లు తెచ్చుకుంటున్నాని చిన్నమ్మ అయిన పద్మకు చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయింది. […] The post ప్రేమజంట ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రంగారెడ్డి: చెట్టుకు ఉరివేసుకొని ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లేడ్ చౌదరిగూడ మండల పరిధిలోని పెద్ద ఎల్కిచర్ల అడవిలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన కథనం ప్రకారం… మండల పరిధిలోని ర్యావిర్యాల గ్రామానికి ముసిరిగళ్ల కృష్ణవేణి (17) , మైసగళ్ల.మల్లేష్ (20) అనే ఇద్దరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే కృష్ణవేణి మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో చాయ్ లో వేసుకోవడానికి బిస్కెట్లు తెచ్చుకుంటున్నాని చిన్నమ్మ అయిన పద్మకు చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఉదయం వెళ్లిన కృష్ణవేణి సాయంత్రం వరకు కూడ ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు గ్రామంలో వెతికారు.

ఎక్కడ ఆచూకీ లభించకపోవడంతో బుధవారం ఉదయం చౌదరిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా బుధవారం సాయంత్రం పెద్ద ఎల్కిచర్ల అడవిలో పెద్ద ఎల్కిచర్ల గ్రామానికి చెందిన ఓ గొర్ల కాపారికి ఓ ప్రాంతంలో ఓ బ్యాగు చెప్పులు కనిపించాయి. ఆ కాపారి అలానే ముందుకు వెళ్లి చూడగా… ఓ చెట్టుకు ఇద్దరు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న స్థానిక ఎస్సై కుద్దుస్ మిస్సింగ్ కేసు పెట్టిన వారికి సమాచారం అందిచారు. కుటుంబీకులు వచ్చి చూడగా మిస్సింగ్ అయిన మల్లేష్ , కృష్ణవేణేనని వారు గుర్తించారు. ఈ ప్రేమ జంట ఆత్మహత్యకు చేసుకోవడానికి గల కారణాలు ఇంక తెలియాల్సి ఉంది.

Young lovers commit suicide in Rangareddy district

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్రేమజంట ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: