పగటి కలలూ మంచివే!

  కలలు కనండి కానీ నిజం చేసుకునే కలలు కనండి అన్నారు కలాం. మరి పగటి కలల సంగతేమిటీ? ఊరికే ఊహల్లో ఎన్నెన్నో ఘన కార్యాలు సాధించటం,ఎన్నో డిగ్రీలో, అంతులేని డబ్బు, ఏవేవో ఊహల్లో తేలిపోతారు. అలాంటి వాళ్లను పగటి కలలు కనవద్దు అంటారు. కానీ ఇప్పుడో కొత్త రిపోర్ట్ మీ ఆరోగ్యం కోసం పగటి కలలు తక్షణంగా కనమంటోంది ఊహాలోకంలో హాయిగా విహరించండి అంటున్నారు మానసిక వైద్యులు. ఇలాంటి ఊహల్లో కూడా మానసికంగా ఎంతో శక్తినీ […] The post పగటి కలలూ మంచివే! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కలలు కనండి కానీ నిజం చేసుకునే కలలు కనండి అన్నారు కలాం. మరి పగటి కలల సంగతేమిటీ? ఊరికే ఊహల్లో ఎన్నెన్నో ఘన కార్యాలు సాధించటం,ఎన్నో డిగ్రీలో, అంతులేని డబ్బు, ఏవేవో ఊహల్లో తేలిపోతారు. అలాంటి వాళ్లను పగటి కలలు కనవద్దు అంటారు. కానీ ఇప్పుడో కొత్త రిపోర్ట్ మీ ఆరోగ్యం కోసం పగటి కలలు తక్షణంగా కనమంటోంది ఊహాలోకంలో హాయిగా విహరించండి అంటున్నారు మానసిక వైద్యులు.

ఇలాంటి ఊహల్లో కూడా మానసికంగా ఎంతో శక్తినీ ఆరోగ్యాన్ని ఇస్తాయంటున్నారు. సాధారణంగా వ్యక్తులు తాము సాధించాలనుకున్న ఆశలు, ఆశయాల గురించి అస్తమానం ఆలోచించటం వాటి గురించే మనసంతా నింపుకోవడం, అలా మేల్కొని ఉండగానే వాటిని కలగా కనటం పగటికలగా విశ్లేషిస్తున్నారు.

ఆరోగ్యానికి మంచివే: పగటి నిద్ర ఆ నిద్రలో వచ్చే పగటికలలు ఆరోగ్యమే అంటున్నారు క్లినికల్ సైకాలజిస్టులు ముఖ్యంగా సృజనాత్మక శక్తి ఉన్నవాళ్లకే ఇలాంటి కలలొస్తాయి రచయితలు ఊహల్లోనే అద్భుతమైన రచనలు సృష్టిస్తారు. మంచి పాత్రలకు రూపకల్పన చేస్తారు. వాళ్లకు సంబంధించిన ఒక ఊహాలోకం వల్ల వాళ్లకి మంచి జరుగుతుంది. మానసిక ఆరోగ్యం, ఆనందంతో పాటు చక్కని రచనలకు పునాది ఏర్పడుతుంది. అలాగే యువతరంలో కూడా ఇప్పటికిప్పుడు వెంటనే జరగని అంశాల గురించి పగటికలలు కంటే, అంటే ఊహల్లో ఉంటే అది వాళ్లకి స్ఫూర్తి ఇచ్చేదిగానే ఉంటుంది.

మనుషుల్లో ఏదైన కష్టం,దుఃఖం ఏర్పడితే, పగ పంతాలతో మనసు గాయపడుతుంటే వెంటనే ఆవిషయం నుంచి మనసు మళ్లించేందుకు గానూ నచ్చిన ఊహల్లో కాస్సేపు గడిపితే శాంతిగా ఉంటుంది. సంతోషం వచ్చి చేరుకుంటుంది. పగటి కలలు వాస్తవ జీవితం కాదు. నడుస్తున్న రోజులో ఒక కొత్త కల కనటం, ఒక గొప్ప విషయం, జీవితంలోకి వస్తే బావుంటుందని ఆలోచించాలి. కలల్లో కూడా కష్టాలు కన్నీళ్ల జాడలు ఎందుకు? మంచిదే మనసు బాధతో ఉన్నప్పుడు ఆనందాన్నిచ్చే ఒక ప్రేమ గురించో, కెరీర్ గురించో ఆర్థిక లాభం ఇచ్చే వ్యాపారం గురించో ఆలోచిస్తే, అలా జరిగితే బావుందన్న కలలోకి వెళ్లిపోతే ఆత్మానందమే కదా!

మంచి కలలు కనాలి: హాయిగా నిద్రపోతే కమ్మని కలలు వస్తే అందరికీ ఇష్టమే. మనం ఆలోచించే విధానం, తినే భోజనం కూడా, కొన్ని పీడ కలలకు కారణం అవుతాయంటున్నారు నిపుణులు. మంచి ఆలోచనా మొదలు పెట్టవలసింది మనమే కదా! ఈ కలలు మనిషిని కెరీర్‌ను ఓ స్థాయికి తీసుకెళ్లేవిగా ఉండచ్చు. అందుకోసం మనమే ప్రయత్నాలు చేస్తే బావుంటుందో ఊహల్లో తేలిపోవచ్చు. ఉద్యోగ బాధ్యతలో, కుటుంబ బాధ్యతలో మనసును ఒత్తిడితో నింపితే దాన్ని మరిపించేలా చక్కని కమ్మని ఊహల్లోకి జారిపోవచ్చు.

ఈ సంవత్సరం నేనో పరీక్షకు హాజరైతే, అందులో వందశాతం సక్సెస్ అయితే ఉద్యోగం వచ్చే మార్పుల గురించి మంచి కలలు కంటే నష్టమే ముంది. రెండు రోజులు వరసగా కలతో గడిపాక, మూడోరోజు దాని కోసం వెంటనే ప్రయత్నం చేయమని మనసు ప్రోత్సహిస్తుంది. వట్టి ఊహలతో కాలం గడపడం దండగే నని హెచ్చరిస్తుంది. నిజంగా కెరీర్‌లో మెట్లెక్కాలనే కోరిక బలంగా ఉంటే అది ఆలోచరణలోకి రావటం ఎంతసేపు.

ఎన్నో రకాల కలలు: నిపుణులు కలల్ని విశ్లేషించారు కలల్లో జంతువులు వస్తున్నాయంటే వాళ్లు జంతు ప్రేమికులు అయి ఉంటారంటారు. ఎక్కడో దూరంగా ఉండే వారిని కలిసినట్లుగా ఊహిస్తే అది ఎన్నో రోజులుగా ఎక్కడికో తలుచు కుంటున్న చోటుకి కలల ద్వారా వెళుతున్నారనుకోవచ్చు. ఇక పీడకలలు భయపెడతాయి. ఇక రాత్రివేళ చాలా సేపు ఏదో ప్రపంచంలో విహరించినట్లు అనిపిస్తుంది కానీ మెలకువ వస్తే అవన్నీ గుర్తుండవు. అలాంటి వాటిని ఇంటూయిటీవ్ డ్రీమ్స్ అంటారు ఒకే కల పదే పదే వస్తుంది దాన్ని రిక్యూరింగ్ డ్రీమ్స్ అంటారు. ఇలాంటివి రాత్రివేళ నిద్రలో కనే కలలు. వీటికి పూర్తిగా భిన్నం పగటికలలు. పగటివేళ కలల్లో ఊహలల్లుకుంటూ చంద్రమండలం దాటి పోవచ్చు. రాజకుమారుడు, రాక్షసుడు కథ కలలో ఊహించవచ్చు. ఏదైనా అవన్నీ మనసుని సంతోషపెట్టేది, ఒత్తిడిని తగ్గించేవే. అయితే గంటల తరబడి పనులన్నీ మానేసి ఊరికే ఊహలల్లుతూ కూర్చుంటే మాత్రం అది కచ్చితంగా సమస్యే. వెంటనే వెళ్లి సైకాలజిస్టుని కలవండి అంటారు నిపుణులు.

Special story on Daydreams

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పగటి కలలూ మంచివే! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: