సర్కారు విద్యకు ఊతం

  ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోవాలి, పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు చర్యలు, డ్రాపౌట్స్‌ను తగ్గించి, హాజరును మెరుగుపరిచేలా ప్రణాళికలు, లోటుపాట్లను సవరించుకుని నాణ్యమైన విద్యనందించేందుకు కృషి : మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి కృషిచేస్తామని, పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగు పరుస్తామని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడుల్లో మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణ కష్టంగా మారిందని, స్థానికంగా ఉండే సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు, స్థానిక […] The post సర్కారు విద్యకు ఊతం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోవాలి, పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు చర్యలు, డ్రాపౌట్స్‌ను తగ్గించి, హాజరును మెరుగుపరిచేలా ప్రణాళికలు, లోటుపాట్లను సవరించుకుని నాణ్యమైన విద్యనందించేందుకు కృషి : మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి కృషిచేస్తామని, పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగు పరుస్తామని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడుల్లో మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణ కష్టంగా మారిందని, స్థానికంగా ఉండే సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు, స్థానిక నేతల సహకారంతో త్వరలోనే ఈ సమస్య పరిష్కారిస్తామని తెలిపారు. బుధవారం బషీర్‌బాగ్‌లోని ఎస్‌ఎస్‌ఎ కార్యాలయంలో విద్యాశాఖాధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్ధన్‌రెడ్డి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయకుమార్, ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎ.అశోక్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యాశాఖలోని వివిధ విభాగాలకు చెందిన అధికారులు ఆయా విభాగాలు నిర్వహిస్తున్న విధులు, అందిస్తున్న సేవలపై విద్యాశాఖ మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.అందులో భాగంగా ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వం గురుకుల విద్యాలయాలను ప్రారంభించి ఒక్కో విద్యార్థిపై సుమారు రూ.లక్షకు పైగా ఖర్చు చేస్తుందని తెలిపారు. ఇలాంటి చర్యలతో మన విద్యార్థులు దేశంలోని ఎవరితోనైనా పోటీపడగలుగుతారని అన్నారు. మన రాష్ట్ర విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్న లక్షంతోనే పనిచేస్తానని మంత్రి స్పష్టం చేశారు.

ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచేందుకు విద్యాశాఖ తీసుకుంటున్న చర్యల వల్ల సర్కారు బడుల్లో గతంతో పోల్చితే మంచి ఫలితాలు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. గ్రామీణ విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోవాలి
ఎంఎల్‌ఎ, ఎంఎల్‌సి,ఎంపిలు ఇతర ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు ఒక ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. సర్కారు బడి దత్తత తీసుకుని తీసుకుని ఆదర్శంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా జీవితంలో ఎంతో సంతృప్తి పొందుతారని అన్నారు. ఈ విషయంపై ప్రజాప్రతినిధులతో చర్చిస్తామని అన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్‌ఆర్) కింద నిధులను పాఠశాలల కోసం ఖర్చుచేసేలా వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తామన్నారు. ప్రముఖ కంపెనీలు, సంస్థలను సంప్రదించి వాటి సహకారం తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యల పరిష్కారానికి సర్పంచ్‌లు, స్థానిక ప్రజాప్రతినిధులు దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు.

బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలి
ప్రభుత్వం చేపడుతున్న గ్రామాలలో 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం పాల్గొని స్వఛ్చ విద్యాలయాలపై దృష్టి సారిస్తామని మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. విద్యార్థులు పాఠశాలలో పరిశుభ్రంగా ఉండడంతోపాటు తమ ఇంటి వద్ద కూడా పరిశుభ్రంగా ఉండేలా అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. విద్యార్థులు హాజరు పెంపొందించి నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రణాళికాబద్దంగా కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

వివిధ కారణాల వల్ల ఆడపిల్లలు మధ్యలోనే చదువు మానేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో డ్రాపౌట్స్‌ను ఎక్కువగా ఉంటున్నాయని, వాటిపై దృష్టి సారించాలని అన్నారు. డ్రాపౌట్స్‌ను తగ్గించేందకు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. సమాజానికి ఎంతో కొంత చేయాలన్న దృక్పథం ప్రతిఒక్కరిలో ఉండాలని పేర్కొన్నారు. తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే వారు బొకేలకు బదులు పుస్తకాలు తీసుకురావాలని తాను ఇచ్చిన పిలుపుకు మంచి స్పందన వచ్చిందని అన్నారు. సుమారు 35 వేల పుస్తకాలు వచ్చాయని, దీనిని నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.

లోటుపాట్లను సవరించుకుంటాం
ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వాటిని సవరించుకుని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న సిఎం కెసిఆర్ లక్ష్యానికి అనుగుణంగా కృషి చేద్దామని మంత్రి సబితా ఇంద్రారెడి పిలుపునిచ్చారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారాల్సిన అవసరం ఉందని ్డ అభిప్రాయపడ్డారు. ఈ తరం పిల్లలు మన కన్నా స్పీడ్‌గా ఉన్నారని, వారే పరీక్షలు పెడుతున్నారని చెప్పారు. అందుకు అనుగుణంగా మనం కూడా అప్‌గ్రేడ్ కావాల్సిన అవసరం చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్కిల్స్ ఉన్న విద్యార్థులు ఉన్నారని, వారిని ప్రోత్సహించాలని అన్నారు. మిషన్ భదీరథ ద్వారా పాఠశాలలకు తాగునీరు అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. విద్యాశాఖలో సమస్యలు పరిష్కరించుకుని రాష్ట్రంలో ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

త్వరలో సమీక్ష
విద్యాశాఖలోని విభాగాల వారీగా త్వరలోనే సమీక్ష సమావేశాలను నిర్వహిస్తామని మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. విద్యాశాఖలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తామని తెలిపారు. అన్ని విభాగాల అధికారులతోపాటు చర్చించి నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఇ మ్యాగజైన్ ప్రారంభం
పాఠశాల విద్యాశాఖ రూపొందించిన ఇ మ్యాగజైన్‌ను మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. పాఠశాలల్లోని విజయగాథలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఇ మ్యాగజైన్ అందుబాటులోకి తీసుకువస్తున్నామని మంత్రి తెలిపారు. మంచి విద్యావేత్తలు, విషయ నిపుణుల ఆలోచనలు, అనుభవాలను పంచుకోవడానికి దోహదపడుతుందన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు,తల్లిదండ్రులకు ఇ-మ్యాగజైన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు.

విద్యాశాఖ ఇవ్వడం సంతోషంగా ఉంది
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తనకు విద్యాశాఖ మంత్రిగా అవకాశం ఇవ్వడం పట్ల మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. సమీక్షా సమావేశం అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తన భర్త ఇంద్రారెడ్డి హోం మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా పనిచేశారని, తాను ఉమ్మడి రాష్ట్రంలో హోం మంత్రిగా పనిచేయగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సొంత రాష్ట్రంలో తన భర్త నిర్వహించిన విద్యాశాఖకు మంత్రిని కావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తన భర్త ఇంద్రారెడ్డి విద్యాశాఖలో ఉన్న సమస్యలు, సవాళ్ల గురించి తనతో పంచుకునేవారని, ఇప్పుడు ఆ శాఖను చూస్తుంటే ఆ విషయాలు అర్థమవుతున్నామని గుర్తు చేసుకున్నారు. సవాళ్లను అధిగమించి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు.

Effort to provide quality Education

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సర్కారు విద్యకు ఊతం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: