ముగ్గురు పిల్లల్ని రక్షించి…ప్రాణాలు కోల్పోయిన తండ్రి

భోపాల్: వరదల్లో చిక్కుకున్న పిల్లలని కాపాడి తండ్రి చనిపోయిన సంఘటన మధ్యప్రదేశ్‌లోని కోలార్ డ్యామ్ ప్రాంతంలోని బాబా ఝిరి వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రిజ్వాన్ (35) అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి కోలార్ డ్యామ్‌కు చూడటానికి వెళ్లారు. డ్యామ్‌కు సంబంధించిన కాలువలో నీళ్లు తక్కువగా ఉండడంతో కుటుంబమంతా కలిసి నీళ్లలో ఆడుకుంటున్నారు. వరద నీరు ఒక్కసారిగా రావడంతో నీటి మట్టం పెరిగింది. వెంటనే ఇద్దరు పిల్లలను తీసుకొని ఒడ్డుకు చేర్చాడు. మూడో […] The post ముగ్గురు పిల్లల్ని రక్షించి… ప్రాణాలు కోల్పోయిన తండ్రి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

భోపాల్: వరదల్లో చిక్కుకున్న పిల్లలని కాపాడి తండ్రి చనిపోయిన సంఘటన మధ్యప్రదేశ్‌లోని కోలార్ డ్యామ్ ప్రాంతంలోని బాబా ఝిరి వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రిజ్వాన్ (35) అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి కోలార్ డ్యామ్‌కు చూడటానికి వెళ్లారు. డ్యామ్‌కు సంబంధించిన కాలువలో నీళ్లు తక్కువగా ఉండడంతో కుటుంబమంతా కలిసి నీళ్లలో ఆడుకుంటున్నారు. వరద నీరు ఒక్కసారిగా రావడంతో నీటి మట్టం పెరిగింది. వెంటనే ఇద్దరు పిల్లలను తీసుకొని ఒడ్డుకు చేర్చాడు. మూడో అబ్బాయిని తీసుకొచ్చేటప్పుడు రాళ్ల మధ్య కాలు ఇరుక్కున్నది. మూడో అబ్బాయి ఒడ్డుకు చేరుకున్నప్పటికి రిజ్వాన్ వరద నీరు ముంచెత్తడంతో అందులోనే మునిగిపోయాడు. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు గ్రామస్థులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. నాలుగు గంటల తరువాత రిజ్వాన్ మృతదేహాన్ని వెలికి తీశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Father Died Save his Three Children in Kolar Dam

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ముగ్గురు పిల్లల్ని రక్షించి… ప్రాణాలు కోల్పోయిన తండ్రి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: