టిడిపి మాజీ ఎంఎల్ఎ చింతమనేని అరెస్టు

పశ్చిమగోదావరి : దెందులూరు మాజీ ఎంఎల్ఎ, టిడిపి అగ్ర నేత చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఆయన కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న విషయం తెలిసిందే. తన అనుచరులతో కలిసి ఇంటికి రాగానే పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. అనారోగ్యంతో బాధ పడుతున్న తన భార్యను కలిసేందుకు వచ్చిన తనను పోలీసులు అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. ఎటువంటి విచారణ లేకుండానే తనను అరెస్టు చేయడం అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ […] The post టిడిపి మాజీ ఎంఎల్ఎ చింతమనేని అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

పశ్చిమగోదావరి : దెందులూరు మాజీ ఎంఎల్ఎ, టిడిపి అగ్ర నేత చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఆయన కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న విషయం తెలిసిందే. తన అనుచరులతో కలిసి ఇంటికి రాగానే పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. అనారోగ్యంతో బాధ పడుతున్న తన భార్యను కలిసేందుకు వచ్చిన తనను పోలీసులు అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. ఎటువంటి విచారణ లేకుండానే తనను అరెస్టు చేయడం అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే పోలీసులు తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు. తనపై పెట్టిన కేసులపై న్యాయ పోరాటం చేస్తానని ఆయన పేర్కొన్నారు. న్యాయం తనవైపే ఉందని ఆయన పేర్కొన్నారు. చింతమనేనిని పోలీసులు అరెస్టు చేస్తున్న సమయంలో ఆయన అనుచరులు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. అనంతరం చింతమనేనిని పోలీసు స్టేషన్ కు తరలించారు.

Ex TDP MLA Chintamaneni Arrest

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post టిడిపి మాజీ ఎంఎల్ఎ చింతమనేని అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: