శాంతి, సహనంతో సాగాలి : దలైలామా

ఢిల్లీ : ప్రతి ఒక్కరూ శాంతి, సహనంతో సాగినప్పుడు సమాజాభివృద్ధి జరుగుతుందని ఆధ్యాత్మిక బౌద్ధ గురువు దలైలామా తెలిపారు. భయం, కోపం, ఆందోళన అనేవి హింసకు దారితీస్తాయని ఆయన పేర్కొన్నారు. భయాన్ని ధిక్కరించి తోటివారిపై నమ్మకంతో ముందుకు సాగాలని ఆయన చెప్పారు. జాలి, దయతో సాగితే కోపం దానంతటదే తగ్గుతుందని ఆయన వెల్లడించారు. కరుణతో సాగినప్పుడు తనపై తనకు నమ్మకం ఏర్పడడమే కాక సమాజంపై నమ్మకం ఏర్పడుతుందని ఆయన తెలిపారు. తోటివారి పట్ల దయతో ముందుకు సాగాలని, […] The post శాంతి, సహనంతో సాగాలి : దలైలామా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఢిల్లీ : ప్రతి ఒక్కరూ శాంతి, సహనంతో సాగినప్పుడు సమాజాభివృద్ధి జరుగుతుందని ఆధ్యాత్మిక బౌద్ధ గురువు దలైలామా తెలిపారు. భయం, కోపం, ఆందోళన అనేవి హింసకు దారితీస్తాయని ఆయన పేర్కొన్నారు. భయాన్ని ధిక్కరించి తోటివారిపై నమ్మకంతో ముందుకు సాగాలని ఆయన చెప్పారు. జాలి, దయతో సాగితే కోపం దానంతటదే తగ్గుతుందని ఆయన వెల్లడించారు. కరుణతో సాగినప్పుడు తనపై తనకు నమ్మకం ఏర్పడడమే కాక సమాజంపై నమ్మకం ఏర్పడుతుందని ఆయన తెలిపారు. తోటివారి పట్ల దయతో ముందుకు సాగాలని, ఈ క్రమంలో పదిమందితో స్నేహం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ దయతో , శాంతి, సహనాలతో ముందుకు సాగితే సమాజంలో హింసకు తావు లేకుండా పోతుందని ఆయన స్పష్టం చేశారు.

Dalai Lama Comments On Peace And Patience

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post శాంతి, సహనంతో సాగాలి : దలైలామా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: