విద్యార్థి బ్యాగులో పిస్తోల్…టీచర్‌ని చంపుతానని బెదిరింపు

లక్నో: ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రం గౌతమ్ బుద్ధానగర్ జిల్లా జెవెర్ ప్రాంతంలోని ఓ కాలేజీలో పిస్తోల్ తీసుకున్నందకు టీచర్‌ను చంపేస్తానని విద్యార్థి బెదిరించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చౌవరీ గ్రామంలోలో జంత ఇంటర్ కాలేజీలో విమల్ కుమార్ శర్మ అనే వ్యక్తి పిఇటిగా ఉద్యోగం చేస్తున్నాడు. విద్యార్థులు కాలేజీకి ఫోన్లు తీసుకొస్తున్నారని సమాచారం రావడతో పత్రి విద్యార్థి బ్యాగ్‌ను  శర్మ చెక్ చేస్తున్నాడు. ఇంటర్ ఫస్టియర్ చదివే విద్యార్థి వద్ద పిస్తోల్ ఉండడంతో ఆ విద్యార్థిని […] The post విద్యార్థి బ్యాగులో పిస్తోల్… టీచర్‌ని చంపుతానని బెదిరింపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

లక్నో: ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రం గౌతమ్ బుద్ధానగర్ జిల్లా జెవెర్ ప్రాంతంలోని ఓ కాలేజీలో పిస్తోల్ తీసుకున్నందకు టీచర్‌ను చంపేస్తానని విద్యార్థి బెదిరించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చౌవరీ గ్రామంలోలో జంత ఇంటర్ కాలేజీలో విమల్ కుమార్ శర్మ అనే వ్యక్తి పిఇటిగా ఉద్యోగం చేస్తున్నాడు. విద్యార్థులు కాలేజీకి ఫోన్లు తీసుకొస్తున్నారని సమాచారం రావడతో పత్రి విద్యార్థి బ్యాగ్‌ను  శర్మ చెక్ చేస్తున్నాడు. ఇంటర్ ఫస్టియర్ చదివే విద్యార్థి వద్ద పిస్తోల్ ఉండడంతో ఆ విద్యార్థిని ప్రిన్సిపల్ దగ్గరకు తీసుకెళ్లాడు. దీంతో ప్రిన్సిపల్ ఆ విద్యార్థి తండ్రిని పిలిచి మందలించాడు. టీచర్‌కు సదరు విద్యార్థి క్షమాపణ చెప్పాడు. రెండు రోజుల క్రితం ఆ విద్యార్థి మరో విద్యార్థితో గొడవకు దిగాడు. ఇద్దరిని పిఇటి పిలిచి మందిలించాడు. సదరు విద్యార్థి టీచర్‌ను ఐదు రోజులలో చంపేస్తానని బెదిరించాడు. ఈ గొడవ ప్రధానోపాధ్యాయుడుకు చేరడంతో తనని పిిిఇటి సర్ టార్గెట్ చేసి వేధిస్తున్నాడని విద్యార్థి చెప్పడంతో పిఇటినే మందిలించాడు. శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కాలేజీకి చేరుకున్నారు. పోలీస్ అధికారి అజయ్ కుమార్ అగర్వాల్ సదరు విద్యార్థిపై ఐపిసి 323, 506 సెక్షన్ల కేసు నమోదు చేశారు.

 

Gun Found Student Bag, Threats to Teacher in UP

The post విద్యార్థి బ్యాగులో పిస్తోల్… టీచర్‌ని చంపుతానని బెదిరింపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: