ఎండిహెచ్ సాంబార్ మసాలా అమ్మకాలపై అమెరికా ఆంక్షలు

న్యూఢిల్లీ: ఎండిహెచ్ బ్రాండ్ సాంబార్ మసాలా ప్యాకెట్లలో ప్రమాదకరమైన సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా కారక పదార్థాలు ఉన్నట్లు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ గుర్తించడంతో ఈ ప్యాకెట్లను అమెరికా రిటైల్ మార్కెట్ నుంచి ఉపసంహరించారు. ఈ సాంబార్ మసాలా ప్యాకెట్లను ప్రయోగశాలల్లో ఎఫ్‌డిఎ పరీక్షలు జరపగా అందులో సాల్మోనెల్లా పాజిటివ్‌గా ఫలితాలు వచ్చాయని ఎఫ్‌డిఎ ఒక అధికారి ప్రకటనలో తెలిపింది. ఉత్తర క్యాలిఫోర్నియా రిటైల్ స్టోర్ల నుంచి ఈ సాంబార్ మసాలా ప్యాకెట్లను తొలగించినట్లు తెలుస్తోంది. […] The post ఎండిహెచ్ సాంబార్ మసాలా అమ్మకాలపై అమెరికా ఆంక్షలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: ఎండిహెచ్ బ్రాండ్ సాంబార్ మసాలా ప్యాకెట్లలో ప్రమాదకరమైన సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా కారక పదార్థాలు ఉన్నట్లు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ గుర్తించడంతో ఈ ప్యాకెట్లను అమెరికా రిటైల్ మార్కెట్ నుంచి ఉపసంహరించారు. ఈ సాంబార్ మసాలా ప్యాకెట్లను ప్రయోగశాలల్లో ఎఫ్‌డిఎ పరీక్షలు జరపగా అందులో సాల్మోనెల్లా పాజిటివ్‌గా ఫలితాలు వచ్చాయని ఎఫ్‌డిఎ ఒక అధికారి ప్రకటనలో తెలిపింది. ఉత్తర క్యాలిఫోర్నియా రిటైల్ స్టోర్ల నుంచి ఈ సాంబార్ మసాలా ప్యాకెట్లను తొలగించినట్లు తెలుస్తోంది. సాల్మోనెల్లా వాడకం వల్ల బ్యాక్టీరియా వల్ల ఏర్పడే అతిసారం, కడుపులో నొప్పి, జ్వరం వంటి వ్యాధులు ఏర్పడతాయని ఎఫ్‌డిఎ అధికారిక వెబ్‌సైట్‌లో తెలిపారు. ఈ వ్యాధులకు గురైన రోగులకు తీవ్ర జ్వరం, వొంటి నొప్పులు, తల నొప్పులు, నీరసం, దద్దుర్లు, మూత్రం లేదా మలంలో రక్తం పడడం వంటి రోగ లక్షణాలు ఉంటాయని ఎఫ్‌డిఎ తెలిపింది. కొన్ని కేసులలో వృద్ధులు, శిశువులు, జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉన్న వారు మరణించే ప్రమాదం కూడా ఉందని ఎఫ్‌డిఎ వెల్లడించింది.
MDH Sambhar Masala Taken Off US, as Food Regulator Finds Salmonella in Them
The consumption of food contaminated with salmonella can cause salmonellosis, which one of the most common bacterial food-borne diseases like diarrhoea, abdominal cramps and fever.

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎండిహెచ్ సాంబార్ మసాలా అమ్మకాలపై అమెరికా ఆంక్షలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: