స్మిత్ పరుగుల సునామీ…కోహ్లీ ర్యాంక్ గల్లంతు

దుబాయి: యాషెస్ సిరీస్‌లో పరుగుల సునామీ సృష్టిస్తున్న ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ టెస్టుల్లో నంబర్ వన్ ర్యాంక్‌ను మరింత పదిలం చేసుకున్నాడు. తాజాగా విడుదల చేసిన ఐసిసి బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో స్మిత్ 937 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కిందటి ర్యాంకింగ్స్‌లో కోహ్లి కంటే కేవలం ఒక పాయింట్ ఆధిక్యంలో మాత్రమే ఉన్న స్మిత్ ఈసారి పాయింట్ల అంతరాన్ని భారీగా పెంచుకున్నాడు. ప్రస్తుతం 34 పాయింట్ల ఆధిక్యంతో కోహ్లికి అందనంత దూరంలో స్మిత్ నిలిచాడు. ఇంగ్లండ్‌తో […] The post స్మిత్ పరుగుల సునామీ… కోహ్లీ ర్యాంక్ గల్లంతు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

దుబాయి: యాషెస్ సిరీస్‌లో పరుగుల సునామీ సృష్టిస్తున్న ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ టెస్టుల్లో నంబర్ వన్ ర్యాంక్‌ను మరింత పదిలం చేసుకున్నాడు. తాజాగా విడుదల చేసిన ఐసిసి బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో స్మిత్ 937 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కిందటి ర్యాంకింగ్స్‌లో కోహ్లి కంటే కేవలం ఒక పాయింట్ ఆధిక్యంలో మాత్రమే ఉన్న స్మిత్ ఈసారి పాయింట్ల అంతరాన్ని భారీగా పెంచుకున్నాడు. ప్రస్తుతం 34 పాయింట్ల ఆధిక్యంతో కోహ్లికి అందనంత దూరంలో స్మిత్ నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో స్మిత్ తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. దీంతో అతని రేటింగ్ పాయింట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. కోహ్లి మాత్రం రెండో ర్యాంక్‌లోనే కొనసాగుతున్నాడు. రానున్న దక్షిణాఫ్రికా సిరీస్ వరకు స్మిత్ టాప్ ర్యాంక్‌కు ఢోకా లేకుండా పోయింది. యాషెస్ సిరీస్‌లో స్మిత్ అసాధారణ బ్యాటింగ్‌ను కనబరుస్తూ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. నిషేధానికి గురైన తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన స్మిత్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడు.

తొలుత ఐపిఎల్‌లో, ఆ తర్వాత ప్రపంచకప్‌లో సత్తా చాటాడు. ఇక, యాషెస్‌లో అయితే పెను ప్రకంపనలే సృష్టిస్తున్నాడు. అతని జోరును చూస్తుంటే రానున్న రోజుల్లో అతనికి ఎదురు ఉండదనే విషయం స్పష్టమవుతోంది. మరోవైపు విరాట్ కోహ్లి రెండు, కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) మూడు, చటేశ్వర్ పుజారా (భారత్) నాలుగు, హెన్రీ నికోల్స్ (కివీస్) ఐదు, జోయ్ రూట్ (ఇంగ్లండ్) ఆరో ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. ఇక, బౌలింగ్ విభాగంలో పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. రబడా (సౌతాఫ్రికా) రెండు, బుమ్రా (భారత్) మూడో ర్యాంక్‌లో నిలిచారు. అండర్సన్ (ఇంగ్లండ్), హోల్డర్ (విండీస్)లు కూడా టాప్5లో నిలిచారు. టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానాన్ని కాపాడుకుంది.

Steve smith get top rank with 937 points in ICC Test

 

The post స్మిత్ పరుగుల సునామీ… కోహ్లీ ర్యాంక్ గల్లంతు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: