శాసనమండలి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన గుత్తా

హైదరాబాద్‌ : తెలంగాణ శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే తెలంగాణ శాసనమండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు.  గుత్తా సుఖేందర్‌ రెడ్డిని చైర్మన్‌ చైర్‌ వద్దకు మంత్రులు హరీష్‌ రావు, కెటిఆర్‌, ప్రశాంత్‌ రెడ్డి, జగదీశ్‌ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో పాటు విపక్ష సభ్యులు తీసుకెళ్లారు. మండలి చైర్మన్ గా ఎన్నికైన గుత్తా సుఖేందర్‌రెడ్డిని వారు అభినందించి , శుభాకాంక్షలు తెలిపారు. నల్లగొండ జిల్లాకు చెందిన […] The post శాసనమండలి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన గుత్తా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్‌ : తెలంగాణ శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే తెలంగాణ శాసనమండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు.  గుత్తా సుఖేందర్‌ రెడ్డిని చైర్మన్‌ చైర్‌ వద్దకు మంత్రులు హరీష్‌ రావు, కెటిఆర్‌, ప్రశాంత్‌ రెడ్డి, జగదీశ్‌ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో పాటు విపక్ష సభ్యులు తీసుకెళ్లారు. మండలి చైర్మన్ గా ఎన్నికైన గుత్తా సుఖేందర్‌రెడ్డిని వారు అభినందించి , శుభాకాంక్షలు తెలిపారు. నల్లగొండ జిల్లాకు చెందిన గుత్తా గతంలో ఎంపిగా పని చేశారు. ఇటీవల ఆయన శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఆయన్ను మండలి చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం మండలి చైర్మన్ గా స్వామిగౌడ్ నియమితులయ్యారు. స్వామిగౌడ్ పదవీ కాలం ఈ ఏడాది మార్చి 29న ముగిసింది. నాటి నుంచి మండలి తాత్కాలిక చైర్మన్ గా నేతి విద్యాసాగర్ పని చేశారు. ఈ క్రమంలో బుధవారం గుత్తా మండలి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు.

Gutta Took Over As Legislative Council Chairman

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post శాసనమండలి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన గుత్తా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: