శ్రీరాంసాగర్ పునరుజ్జీవనం

ముప్కాల్ శివారు రివర్స్ పంపింగ్ జీరో పాయింట్ వద్ద కాళేశ్వరం నీళ్లకు హారతిపట్టిన మంత్రి వేముల  ఏడాదిన్నర కాలంలో ప్యాకేజీ 21 పూర్తి చేస్తాం ఈ జన్మకు ఇది చాలు… కెసిఆర్‌కు రుణపడ్డా : మంత్రి మన తెలంగాణ/ముప్కాల్ : ఎట్టకేలకు కాళేశ్వరం నీళ్లు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గడపను ముద్దాడాయని శాసనసభ వ్యవహారాల మంత్రి వేములప్రశాంత్‌రెడ్డి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ముప్కాల్ శివారులో రివర్స్ పంపింగ్ జీరోపాయింట్ వద్ద మంగళవారం నిర్వహించిన కాళేశ్వరం నీళ్లకు హరతి […] The post శ్రీరాంసాగర్ పునరుజ్జీవనం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముప్కాల్ శివారు రివర్స్ పంపింగ్ జీరో పాయింట్
వద్ద కాళేశ్వరం నీళ్లకు హారతిపట్టిన మంత్రి వేముల
 ఏడాదిన్నర కాలంలో ప్యాకేజీ 21 పూర్తి చేస్తాం
ఈ జన్మకు ఇది చాలు… కెసిఆర్‌కు రుణపడ్డా : మంత్రి

మన తెలంగాణ/ముప్కాల్ : ఎట్టకేలకు కాళేశ్వరం నీళ్లు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గడపను ముద్దాడాయని శాసనసభ వ్యవహారాల మంత్రి వేములప్రశాంత్‌రెడ్డి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ముప్కాల్ శివారులో రివర్స్ పంపింగ్ జీరోపాయింట్ వద్ద మంగళవారం నిర్వహించిన కాళేశ్వరం నీళ్లకు హరతి కార్యక్రమంలో వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టును సృష్టించి, ఎస్‌ఆర్‌ఎస్‌పి పునరుజ్జీవనాన్ని ప్రారంభించి రెండు సంవత్సరాల్లో కాళేశ్వరం నీళ్లను ఎస్సారెస్పీకి తీసుకువచ్చిన అపరభగీరథుడు ముఖ్యమంత్రి కెసిఆర్ అని ప్రశంసించారు. కాళేశ్వరం నుండి 200 కిలో మీటర్ల వె నక్కి వచ్చి వరద కాలువలోపడి, అక్కడి నుండి 102 కిలో మీటర్లు మళ్లీ వెనక్కి వచ్చి శ్రీరాంసాగర్ గడపకు చేరాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా 80 వేల కోట్లు అనగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా సరే చేద్దామని ముందడుగు వేసిన గొప్ప నాయకుడు కెసిఆర్ అన్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, నిర్మల్, కరీంనగర్, జగిత్యాల, ఆర్మూర్ వంటి ప్రాంతాల సాగుకు, మంచినీటికిఎటువంటి ఢోకా లేదన్నారు.

గతంలో హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకం 30 రోజులు తెరుచుకొని మూసేవాళ్లం. కాళేశ్వరం నీళ్లు రానే వచ్చాయని, ఎగువ గోదావరిలో వరదనీటి రాక ఏ విధంగా ఉంటుందో, అధికారులతో ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ నీటిని వినియోగించుకోబోతున్నామన్నారు. అలీసాగర్ ద్వారా 90వేల ఎకరాలకు, బాల్కొండ నియోజకవర్గంలో లక్ష 30వేల ఎకరాలకు నీరందుతుందన్నా రు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఎస్సారెస్పీ వరకు 95 శాతం పూర్తయ్యాయని, తర్వాత మిషన్ ప్రాజె క్టు ప్యాకేజి 21అన్నారు. భీమ్‌గల్, మోతె, కమ్మర్‌పల్లి, సుంకేట్, మోర్తాడ్ మండలాలకు నీరందించే చెక్‌డ్యాంలు కట్టబోతున్నామన్నారు. ప్రజలందరి సహకారం ఉంటే ఏడాదిన్నర కాలంలో ప్యాకేజీ 21 పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్యాకే జీ 21 కింద ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్‌రూరల్ నియోజకవర్గాల కోసం మొత్తం 2750 కోట్లు మంజూరు చేసారన్నారు. అందులో ఒక్క బాల్కొండ నియోజకవర్గానికి 900 కోట్ల రూ.లు మంజూరు చేసారన్నారు.

ఆలస్యమైన సాగు, మంచినీటికి సంబంధించిన అన్ని ప్రాజెక్టు పనుల ను పూర్తి చేస్తామన్నారు. అంతకుముందు పార్టీ కార్యకర్తలు భారీ కాన్వాయ్‌తో వరదకాలువ చేరుకున్న మంత్రికి మత్యకారుల సంఘం, డ్వాక్రా మహిళల బతుకమ్మలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎస్సారెస్పీ వరద కాలువ వరకు చేరుకున్న కాళేశ్వరం నీళ్లకు తెలంగాణ సంప్రదాయబద్ధంగా పసుపు, కుంకుమ, పట్టువస్త్రాలను మంత్రి సమర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎం. రామ్మోహన్‌రావు, ఆర్డిఓ శ్రీనివాస్, తహసీల్దార్ ఇస్మాయిల్, ప్రాజెక్టు ఈఈ సుధాకిరణ్, డిఈ ప్రవీణ ఏఈ దివ్యజ్యోతి, టిఆర్‌ఎస్ ఉమ్మడి బాల్కొండ మండలాల జడ్పిటిసిలు దాసరి లావణ్య, బద్దం నర్సవ్వనర్సారెడ్డి, గంగాధర్, ఎంపిపిలు, సర్పంచ్‌లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Kaleshwaram Water Reaches Sri Ram Sagar

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post శ్రీరాంసాగర్ పునరుజ్జీవనం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: