ఇంటిని దిద్దిన కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : సీజనల్ వ్యాధుల నివారణ ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. జనసమర్థ ప్రదేశాలు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలు, జిహెచ్‌ఎంసి తరుపున దోమల నివారణతో పాటు పరిశుభ్రత కోసం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని కెటిఆర్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ సొంత ఇళ్లలో పారిశుద్ధ్య నిర్వహణపైన దృష్టి సారించి ప్రభుత్వ ప్రయత్నాలతో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం కెటిఆర్ తన నివాస గృహం ప్రగతి […] The post ఇంటిని దిద్దిన కెటిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/హైదరాబాద్ : సీజనల్ వ్యాధుల నివారణ ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. జనసమర్థ ప్రదేశాలు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలు, జిహెచ్‌ఎంసి తరుపున దోమల నివారణతో పాటు పరిశుభ్రత కోసం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని కెటిఆర్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ సొంత ఇళ్లలో పారిశుద్ధ్య నిర్వహణపైన దృష్టి సారించి ప్రభుత్వ ప్రయత్నాలతో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం కెటిఆర్ తన నివాస గృహం ప్రగతి భవన్‌లోని పారిశుద్ధ్యంపై దృష్టిసారించారు. దోమల వృద్ధికి అవకా శం ఉన్న నీటి తొట్లు, నీరు నిలువ ఉండే ప్రదేశాలను గుర్తించి ఆ నీటిని తొలగించే చర్యలు తీసుకున్నారు. దీంతోపాటు ఇంటి మూలల్లో ఉన్న ఉపయోగంలోలేని వస్తువులను తీసివేసి దోమల లార్వా వృద్ధికి అవకాశం లేకుండా చేసే చర్యలను చేపట్టారు. అలాగే ప్రగతి భవన్ లో ఉన్న నీటి తొట్లలో ఆయన నూనె వేశారు. ప్రతి ఒక్క రూ స్వంత ఇంటి పారిశుద్ధ్య నిర్వహణపైన దృష్టి సారిం చి సీజనల్ వ్యాధుల బారి నుంచి కాపాడుకునే ప్రయత్నం ప్రారంభించాలని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఇళ్ళ ముందు కానీ లేదా ఇంటి లోపల నీటి నిలువ ఉండే ప్రాంతాల్లో నీటిని తొలగించే ప్రయత్నం చేయడం లేదా వాటిపైన నూనెను చల్లడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.

దీంతోపాటు ఇళ్లలో ఉన్న పనికిరాని లేదా ఉపయోగం లేని వస్తువుల ను తొలగించుకోవాలని కోరారు. దోమల ద్వారా వ్యాపిం చే వ్యాధుల నివారణకు సొంత ఇళ్లలోని పారిశుద్యం అత్యంత కీలకమైన అంశమన్నారు. రెండు రోజుల క్రితం జిహెచ్‌ఎంసి కార్యాలయంలో సీజనల్ వ్యాధులపై వైద్య శాఖ మంత్రి, ఆ శాఖ అధికారులతో పాటు పురపాలక శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం సొంత ఇళ్ళలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ మేరకు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌ని ప్రారంభించినట్లు మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఈ డ్రైవ్‌లో ప్రజలను చైతన్యవంతం చేసి పారిశుద్ద్యం నిర్వహణలో వారిని భాగస్వాములను చేసేందుకు ప్రభుత్వ అధికారులు, పురపాలక ప్రతినిధులు తమ సొంత ఇళ్ళలోని పారిశుధ్య నిర్వహణ చేపట్టి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు శాసన సభ ప్రభుత్వ విప్ బాల్కసుమన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి ఇచ్చిన పిలుపు మేరకు తాము కూడా సొంత ఇంటి పారిశుద్ధ్య నిర్వహణ పైన అవసరమైన చర్యలు చేపడతామని వారిరువురు కెటిఆర్‌కు హామి ఇచ్చారు.

KTR initiates cleanliness drive in Pragathi Bhavan

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఇంటిని దిద్దిన కెటిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: