భారత్‌లో దాడులకు వ్యూహం?

ఉగ్రవాద సంస్థలతో ఐఎస్‌ఐ మంతనాలు ఇస్లామాబాద్ /శ్రీనగర్: ఏదో విధంగా కశ్మీర్ రగులుకుంటేనే ఉండాలని పాకిస్థాన్ విశ్వ ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఏమి చేయాలనే విషయాలపై ఐఎస్‌ఐ ఇస్లామాబాద్‌లో ఉగ్రవాద సంస్థల వారితో ఉన్నత స్థాయి మంతనాలు జరిపింది. ఆర్టికల్ 370 రద్దు తరువాత కశ్మీర్ లోయలో ఎట్టి పరిస్థితుల్లోనూ సాధారణ పరిస్థితి నెలకొనరాదనేదే ఐఎస్‌ఐ సంకల్పంగా మారింది. ఇందుకు ఉగ్రవాద శక్తులను రంగంలోకి దింపాలని, తాను వెనక ఉండి పోరుకు సహకరించాలని భావిస్తోంది. ఈ […] The post భారత్‌లో దాడులకు వ్యూహం? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఉగ్రవాద సంస్థలతో ఐఎస్‌ఐ మంతనాలు

ఇస్లామాబాద్ /శ్రీనగర్: ఏదో విధంగా కశ్మీర్ రగులుకుంటేనే ఉండాలని పాకిస్థాన్ విశ్వ ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఏమి చేయాలనే విషయాలపై ఐఎస్‌ఐ ఇస్లామాబాద్‌లో ఉగ్రవాద సంస్థల వారితో ఉన్నత స్థాయి మంతనాలు జరిపింది. ఆర్టికల్ 370 రద్దు తరువాత కశ్మీర్ లోయలో ఎట్టి పరిస్థితుల్లోనూ సాధారణ పరిస్థితి నెలకొనరాదనేదే ఐఎస్‌ఐ సంకల్పంగా మారింది. ఇందుకు ఉగ్రవాద శక్తులను రంగంలోకి దింపాలని, తాను వెనక ఉండి పోరుకు సహకరించాలని భావిస్తోంది. ఈ దిశలోనే ఐఎస్‌ఐ అత్యున్నత అధికారులు ఇటీవలనే ఉగ్రవాద సంస్థల కీలక నేతలతో మాట్లాడినట్లు భారత ఇంటలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. అంతర్జాతీయంగా కూడా నిషేధాలకు గురైన జైష్ ఎ మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజహిద్దిన్, ఖలీస్థాన్ జిందాబాద్ ఫోర్స్‌ల వారితో అన్ని విషయాలు మాట్లాడారు. భారతదేశంలో దాడులకు దిగాలని ఇందుకు తమ వంతు సహకారం ఉంటుందని వారికి చెప్పినట్లు నిర్థారణ అయింది. నామమాత్రంగా మిగిలిన ఖలీస్థాన్ తీవ్రవాద బృందాలను బలోపేతం చేయడం ద్వారా వారిని భారతదేశపు అంతర్గత ప్రాంతాలలో దాడులకు ప్రేరేపించాలని, ఈ విధంగా కశ్మీర్‌ను అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశం చేయాలని పాకిస్థాన్ భావిస్తోంది. కశ్మీర్‌లో పరిస్థితి అదుపులో ఉందని బయటి దేశాలకు వెల్లడైతే తాము అంతర్జాతీయంగా నగుబాటుకు గురి కావల్సి వస్తుందని , దీనితో దౌత్యపరంగా దెబ్బతింటామని పాకిస్థాన్ భయపడుతోంది. అందుకే ఉగ్రవాద శక్తులతో దాడులకు ప్రేరేపించాలని నిర్ణయించారు.
ఉగ్రవాద స్థావరాలు నేలమట్టం
ఓ వైపు భారతదేశానికి అందుతోన్న కీలక సమాచారంతో పిఒకె వెంబడి ఉన్న ఉగ్రవాద స్థావరాలను భారతీయ సైన్యం నేల మట్టం చేస్తూ వస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదులు కశ్మీర్ లోయలోకి రాకుండా వారని సరిహద్దుల వద్దనే కట్టడి చేయాలని సైన్యం తగు సన్నద్ధతతో ఉంది. లీపా వ్యాలీ దరిదాపులలో ఉగ్రవాద దాడుల సన్నాహాక కేంద్రం ఉందని వెల్లడైంది. పాకిస్థానీ సైనిక స్థావరాలకు దరిదాపుల్లోనే ఈ ఉగ్రవాద శిబిరాలు ఉన్నట్లు సైన్యం గుర్తించింది. వెంటనే వీటిని నేలమట్టం చేశారు. పాకిస్థానీ సేనలు కొన్ని స్థావరాలను ఎంచుకుని వాటి నుంచే భారతీయ భూభాగంలోని పల్లెలపై బాంబుల వర్షం కురిపిస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదులను సరిహద్దులను దాటించే ఎత్తులు వేస్తున్నారు. మరో వైపు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పట్టు జారకుండా ఉండేందుకు మరిన్ని చర్యలకు దిగుతోంది. అక్కడ సరికొత్తగా సంచార ఉగ్ర శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయడం, వీటిని జమాత్ ఎ ఇస్లామీ వంటి సంస్థలు నిర్వహించేలా చేయడం వంటి వ్యూహాలకు దిగింది.
రావల్‌కోట్‌లోని తర్నూతి, పోతిబాలాలో శిబిరాలను వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసుకుని , అత్యధిక సంఖ్యలో జిహాదీలను తీసుకుంటున్నట్లు వెల్లడైంది. ఇండియాలోకి వారిని పంపించి దాడులకు రంగం సిద్ధం చేయాలనేదే మొత్తం మీద పాకిస్థాన్ వ్యూహం అని నిర్థారణ అయింది.
పిఒకెలో ఇప్పటికే 18 టెర్రర్ గ్రూప్‌లు?
ఏదో విధంగా ఇండియాలోకి చొరబడి అన్ని స్థాయిల్లో శాంతిభద్రతలను దెబ్బతీసేందుకు ఆక్రమిత కశ్మీర్‌లో 18 ఉగ్రవాద సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ఇంటలిజెన్స్ వర్గాలకు ఈ విషయం తెలియడంతో భారతీయ సైన్యం ఎల్లవేళలా సర్వంసన్నద్ధంగా ఉంటోంది. ప్రత్యేకించి చొరబాట్లను నివారిస్తూ, మరో వైపు పాకిస్థాన్ సైన్యం కవ్వింపు చర్యలను అరికడుతూ లోయలో సాధారణ పరిస్థితిని కాపాడేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకొంటోంది.

Pakistan’s ISI Meet with Terror groups attack on India!

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post భారత్‌లో దాడులకు వ్యూహం? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: