అవమానాలకు బ్యాట్‌తోనే సమాధానం

  లండన్: బాల్ టాంపరింగ్ ఓ ముగిసిన ఆధ్యాయం. అయినా ఇంగ్లండ్ అభిమానులు, ఆ దేశా మాజీ క్రికెటర్లు మాత్రం పదేపదే ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఆస్ట్రేలియా క్రికెటర్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌ను ఘోరంగా అవమానిస్తున్నారు. వీరిద్దరూ ఎక్కడికి వెళ్లినా చీటర్స్..చీటర్స్ అంటూ అవహేళన చేస్తున్నారు. దీని ప్రభావంతో వార్నర్ యాషెస్ సిరీస్‌లో సహాజ సిద్ధంగా ఆడలేక పోతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు టెస్టుల్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. ఐపిఎల్, ప్రపంచకప్‌లో ఆకాశమే హద్దుగా […] The post అవమానాలకు బ్యాట్‌తోనే సమాధానం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

లండన్: బాల్ టాంపరింగ్ ఓ ముగిసిన ఆధ్యాయం. అయినా ఇంగ్లండ్ అభిమానులు, ఆ దేశా మాజీ క్రికెటర్లు మాత్రం పదేపదే ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఆస్ట్రేలియా క్రికెటర్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌ను ఘోరంగా అవమానిస్తున్నారు. వీరిద్దరూ ఎక్కడికి వెళ్లినా చీటర్స్..చీటర్స్ అంటూ అవహేళన చేస్తున్నారు. దీని ప్రభావంతో వార్నర్ యాషెస్ సిరీస్‌లో సహాజ సిద్ధంగా ఆడలేక పోతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు టెస్టుల్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. ఐపిఎల్, ప్రపంచకప్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన వార్నర్ ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో మాత్రం ఆ జోరును కొనసాగించలేక పోతున్నాడు. ప్రతి మ్యాచ్‌లో ఆరంభంలోనే వికెట్‌ను పారేసుకుంటున్నాడు. దీంతో అతని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. మరోవైపు ఇలాంటి అవమానాలే ఎదురవుతున్నా మాజీ కెప్టెన్ స్మిత్ మాత్రం బ్యాట్‌తో గట్టి సమాధానమే చెబుతున్నాడు. ప్రతి మ్యాచ్‌లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడు. ప్రత్యర్థులు ఎంత రెచ్చగొట్టినా ఒత్తిడి తన దరి చేరకుండా చూస్తున్నాడు. ఇప్పటికే యాషెస్ సిరీస్‌లో తనదైన ముద్ర వేశాడు. ఆస్ట్రేలియాను ముందుండి విజయపథంలో నడిపిస్తున్నాడు.

ఆస్ట్రేలియా ఈ సిరీస్‌లో పైచేయి సాధించిందంటే దానికి స్మిత్ అసాధారణ బ్యాటింగే కారణమని చెప్పక తప్పదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేస్తున్నాడు. తనను హేళనకు గురిచేస్తున్న ఇంగ్లండ్ అభిమానులకు బ్యాట్‌తో గట్టి సమాధానమే ఇస్తున్నాడు. తనను అవమానిస్తున్న వారు పునరాలోచలో పడేలా చేస్తున్నాడు. ఇప్పటికే యాషెస్ సిరీస్‌లో రెండు శతకాలు, మరో రెండు అర్ధ శతకాలు, ఓ డబుల్ సెంచరీ సాధించి తానెంటో నిరూపించాడు. ఇక, స్మిత్ విజృంభినకు ఇంగ్లండ్ ఇప్పటికే సిరీస్‌లో వెనుకంజలో ఉంది. చివరి టెస్టులో కూడా స్మిత్‌ను ఆపడం ఇంగ్లండ్ బౌలర్లకు చాలా కష్టమని చెప్పక తప్పదు. ప్రతి మ్యాచ్‌లో స్మిత్ అసాధారణ రీతిలో చెలరేగి పోతున్నాడు. సహచరులు విఫలమవుతున్నా ఒంటరి పోరాటంతో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. స్మిత్ జోరుతో ఆస్ట్రేలియా ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకునే స్థితికి చేరుకుంది.

మరోవైపు అద్భుత బ్యాటింగ్‌తో స్మిత్ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని సయితం సొంత చేసుకున్నాడు. అంతేగాక భారత కెప్టెన్ విరాట్ కోహ్లిని వెనక్కి నెడుతూ తన టాప్ ర్యాంక్‌ను మరింత పదిలం చేసుకున్నాడు. స్మిత్ ఇలాగే ఆడితే రానున్న రోజుల్లో అతను ఎన్నో రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం. ఇదిలావుండగా స్మిత్ ఈ స్థాయిలో చెలరేగి పోతున్నాడంటే దానికి ఇంగ్లీష్ అభిమానులే కారణం అని చెప్పక తప్పదు. తనను ఘోరంగా అవమానిస్తున్న ఇంగ్లండ్ అభిమానులకు తన బ్యాట్‌తో దిమ్మతిరిగే షాక్ ఇస్తున్నాడు. స్మిత్ ప్రతీకారంతో రగిలి పోతుండడంతో ఇంగ్లండ్ బౌలర్లు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. స్మిత్‌ను ఎలా ఆపాలో ఇంగ్లీస్ బౌలర్లకు అంతుబట్టకుండా మారింది. ఇదే పరిస్థితి చివరి టెస్టులో కూడా ఎదురైతే ఇంగ్లండ్ యాషెస్ సిరీస్‌ను కోల్పోవడం ఖాయం.

Steve smith get top rank in ICC Test

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అవమానాలకు బ్యాట్‌తోనే సమాధానం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.