అనంతగిరి కొండల్లో పద్మనాభుడు

అనంత పద్మనాభ స్వామి అంటే మనకు వెం టనే గుర్తుకు వచ్చేది కేరళనే. కొన్ని లక్షల కోట్ల సంపదలకు నిలయమైన ఆ ఆలయం ఈమధ్య వార్తల్లో నిలిచింది కూడా. తెలంగాణలోని వికారాబాద్‌లో కూడా అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది. ఈ దేవాలయాన్ని ముస్లిం రాజు నిర్మించడం విశేషం. ప్రాచీన దేవాలయాల్లో ఇది ఒకటి. హైదరాబాద్‌కి 75 కిలో మీటర్ల దూరంలో, వికారాబాద్ పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి కొండల్లో వెలసిందీ ఆలయం. అనంత […] The post అనంతగిరి కొండల్లో పద్మనాభుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అనంత పద్మనాభ స్వామి అంటే మనకు వెం టనే గుర్తుకు వచ్చేది కేరళనే. కొన్ని లక్షల కోట్ల సంపదలకు నిలయమైన ఆ ఆలయం ఈమధ్య వార్తల్లో నిలిచింది కూడా. తెలంగాణలోని వికారాబాద్‌లో కూడా అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది. ఈ దేవాలయాన్ని ముస్లిం రాజు నిర్మించడం విశేషం. ప్రాచీన దేవాలయాల్లో ఇది ఒకటి. హైదరాబాద్‌కి 75 కిలో మీటర్ల దూరంలో, వికారాబాద్ పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి కొండల్లో వెలసిందీ ఆలయం. అనంత పద్మనాభ స్వామి దేవాలయం సుమారు 1300 సంవత్సరంలో నిర్మించి ఉండవచ్చని స్థానికులు అంటున్నారు.

ఇక్కడి అనంత పద్మనాభస్వామి ఆలయానికి ఓ చరిత్ర ఉంది. స్కంధ పురాణం ప్రకారం ఈ దేవాలయం ద్వాపర యుగంలో ‘మార్కండేయ‘ రుషి నిర్మించాడని ప్రతీతి. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణానికి ఆకర్షితుడైన మార్కండేయ ముని అనంతగిరి కొండల్లో యోగ సాధన చేయాలనుకుంటాడు. ప్రతి రోజూ ముని తన యోగ సాధనతో అనంతగిరి నుండి కాశీ వెళ్లి గంగా నదిలో పవిత్ర స్నానమాచరించేవాడు. ఒక రోజు ఉదయం ప్రాతః కాలంలో ద్వాదశి ప్రవేశించుట వల్ల ఆయన కాశీకి వెళ్లలేకపోతాడు. శివుడు ముని స్వప్నంలో దర్శనమిచ్చి ఆయనకు గంగా జలాన్ని స్నానమాచరించుటకు ఏర్పాట్లు చేస్తాడు.

* మరో కథనం ప్రకారం… దట్టమైన అడవి, కొండలు, గుహలతో రుషులు తపస్సు చేసుకోవటానికి అనుకూలంగా ఉండే ఈ ప్రాం తంలో ముచుకుందుడనే అనే రాజర్షి ఇక్కడ తపస్సు చేశారు. శ్రీకృష్ణ బలరామ దేవుళ్లు ప్రత్యక్షం కాగా, ముచుకుందుడు సంతోషించి వారి పాదాలను కడిగి జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. ముచుకుందుని చేత శ్రీ కృష్ణుడి పాదాలు కడిగిన జలమే జీవనదిగా మారిందని కథనం. అనంతగిరి కొండల్లో పుట్టిన ముచుకుందా నది కాలక్రమేణా మూసీ నదిగా మారింది. అనంతగిరిలో పుట్టి జిల్లాలో పారు తూ హైదరాబాద్ మీదుగా నల్గొండ జిల్లాలో కృష్ణా నదిలో మూసీ కలుస్తోంది. అనంత పద్మ నాభస్వామి దేవాలయానికి మరో కథనం కూ డా ఉంది. కలియుగ ప్రారంభంలో మహావిష్ణు వు మార్కండేయ మహామునికి దర్శనమిచ్చి అతని తపఃఫలముగా సాలగ్రామ రూపంలో అనంతపద్మనాభుడిగా అవతరించాడని చరిత్ర చెబుతోంది.

* పాపనాశనం : దేవాలయం పక్కనే ఉన్న భగీరథ గుండంలో స్నానం చేస్తే పాపాలు హరిస్తాయని భక్తుల నమ్మకం. దేవాలయానికి వచ్చే భక్తులు ముందుగా భవనాశిని అని పేరు న్న భగీరథ గుండంలో స్నానం ఆచరించి స్వా మి వారిని దర్శించుకుంటారు. ఈ భగీరథ గుండంలో స్నానం ఆచరిస్తే కోర్కెలు తీరడమే కాకండా సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రజల నమ్మకం. ఈ స్థల మహత్యాన్ని తెలుసుకున్న నిజాం నవాబు దాదాపు 400 ఏళ్ల క్రితం ఇక్క డ అనంత పద్మనాభస్వామికి చూడ చక్కని దే వాలయాన్ని నిర్మించాడు. ప్రశాంత వాతావరణంలో పచ్చడి అడువుల మధ్య ఉన్న ఈ దేవాలయ సందర్శనం వల్ల కోరుకొన్న కోరికలన్నీ తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు.

* పద్మనాభ వ్రతం : భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు ఆచరించే ‘అనం త పద్మనా భ వ్రతం’ కూడా ఈ కోవకే చెందుతుంది. అరణ్యవాసంలో ఉన్న పాండవులు తమ కష్టాలు గట్టెక్కేందుకు ఏదైనా ఉపాయం చెప్పమని కోరగా అనంత పద్మనాభ వ్రతాన్ని చేయమని చెప్పాడట శ్రీకృష్ణుడు. ఆధ్యాత్మిక సాధనకు, లౌకిక విజయాలకు ఈ వ్రతం ఉత్తమ సాధనంగా చెబుతారు.

వ్రతం విధి విధానాలు భవిష్యోత్తర పురాణం లో వివరంగా ప్రస్తావించారు. వ్రతంలో భాగం గా పిండితో ఏడు పడగల నాగుపామును చి త్రిస్తారు. దర్భలతో పాము బొమ్మను చేసి పూ జిస్తారు. ఈ పామును కలశంపై ఉంచుతారు. కలశంలో పవిత్ర జలాలతో పాటు, పోకచెక్క, వెండినాణెం వేస్తారు. కలశంలోని నీటిలోకి య మునా నదిని ఆవాహన చేసి వ్రతం కొనసాగిస్తా రు. ఈ వ్రతాన్ని పాలీ చతుర్దశి వ్రతం అనీ, క దలీ వ్రతం అనీ పిలుస్తారు. ఒడిశాలో అఘోర చతుర్దశి అంటారు. వ్రతం ఆచ రించే చతుర్దశి తిధి పౌర్ణమితో ఉంటే శ్రేష్ఠమని చెబుతారు.

ఒక్క రోజులో వెళ్లి రావచ్చు :

అనంతగిరి విరాకారాబద్ రైల్వేస్టేషన్ దగ్గరగా ఉంది. సికింద్రాబాద్ నుంచి వికారాబాద్ కు 70 కిలోమీటర్లు. ఉదయం 8 గంటల తర్వాత రెండు రైళ్లు అటుగా వెళ్తాయి.ఒకటి పూర్ణా ప్యాసింజర్, రెండోది వికారాబాద్ ప్యాసింజర్.అనంత గిరిలో అంత మంచి హోటల్స్ ఉండవు.ఇంటి నుంచి తినడానికి తీసుకు వెళితే మంచిది.

Anantha Padmanabha Swamy Temple

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అనంతగిరి కొండల్లో పద్మనాభుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.