సబితారెడ్డి అనే నేను…

  నాడు లాఠీ.. నేడు బెత్తం… తెలంగాణ మొదటి మహిళా మంత్రిగా చెవేళ్ల చెల్లెమ్మ భర్త అడుగుజాడల్లోనే నాడు హోంమంత్రిగా..నేడు విద్యామంత్రిగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా… నలుగురు సిఎంల వద్ద మంత్రిగా రంగారెడ్డి : ప్రజల కోసం పరితపించే తత్వం ఆమె స్వంతం… జనం కోసం ఎంతకైన తెగించడం ఆమె నైజం…నమ్మిన సిద్దాంతాల కోసం అలుపెరగని పోరాటం చేయడం అమెకు అలవాటు…భర్త అడుగు జాడల్లో నడుస్తున్న రాజకీయాలకే వన్నె తెచ్చిన సబితారెడ్డి తెలంగాణ తొలి మహిళ మంత్రిగా […] The post సబితారెడ్డి అనే నేను… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నాడు లాఠీ.. నేడు బెత్తం…

తెలంగాణ మొదటి మహిళా మంత్రిగా చెవేళ్ల చెల్లెమ్మ

భర్త అడుగుజాడల్లోనే నాడు హోంమంత్రిగా..నేడు విద్యామంత్రిగా
నాలుగు సార్లు ఎమ్మెల్యేగా… నలుగురు సిఎంల వద్ద మంత్రిగా

రంగారెడ్డి : ప్రజల కోసం పరితపించే తత్వం ఆమె స్వంతం… జనం కోసం ఎంతకైన తెగించడం ఆమె నైజం…నమ్మిన సిద్దాంతాల కోసం అలుపెరగని పోరాటం చేయడం అమెకు అలవాటు…భర్త అడుగు జాడల్లో నడుస్తున్న రాజకీయాలకే వన్నె తెచ్చిన సబితారెడ్డి తెలంగాణ తొలి మహిళ మంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు. దివంగత ఇంద్రారెడ్డి అకాల మరణం తో 2000 సంవత్సరంలో రాజకీయాల్లోకి వచ్చిన సబితారెడ్డి అంచలంచలుగా ఎదిగి రాష్ట్ర రాజకీయాల్లో కీలకనేతగా ఉన్నారు. 2000లో సంవత్సరంలో ఇంద్రారెడ్డి ఆకాల మరణంతో జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్ తరపున ఘన విజయం సాధించిన సబితారెడ్డి భర్త అడుగుజాడల్లో నియోజకవర్గ ప్రజల కోసం ప్రతి నిత్యం పరితపించి పనిచేశారు.

దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి చెవెళ్ల నుం చి 2004లో పాదయాత్ర ప్రారంబించి సబితారెడ్డి పై తన సోదరి ప్రేమను చూ పించారు. 2004 చెవెళ్ల నుంచి రెండో సారి శాసనసభకు ఎన్నికైన సబితారెడ్డికి వైయస్ తన క్యాబినేట్‌లో కీలకమైన గనులు భూగర్బవనరుల శాఖ మంత్రిగా ఎంపిక చేశారు. 2009 ఎన్నికలలో నియోజకవర్గాల పునర్ విభజన మూలంగా చెవెళ్ల ఎస్సీ రిజర్వ్ కావడంతో మహేశ్వరం నుంచి బరిలోకి దిగి ఘన విజయం సాధించడంతో ఎకంగా వైయస్ హోంమంత్రిగా అవకాశం కల్పించారు. దేశంలోనే మొట్ట మొదటి మహిళ హోంమంత్రిగా సబితారెడ్డి రికార్డు నెలకొల్పారు. 2014లో ఎన్నికలలో పోటిచేయని సబితారెడ్డి 2018లో జరిగిన ఎన్నికలలో మహేశ్వరం నుంచి శాసనసభకు ఎన్నికైనారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు అకర్షితులై కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు టిఆర్‌యస్‌లో చేరారు.

నాడు లాఠీ… నేడు బెత్తం…
రాజకీయాల్లో భర్త అడుగుజాడల్లో నడవడంతో పాటు ఆయన నిర్వహించిన పదవులు దక్కడం అరుదు కాగా అలాంటి అవకాశం సబితారెడ్డికి దక్కింది. దివంగత ఇంద్రారెడ్డి ఎన్టీఆర్ హయంగా హోమంత్రిగా పనిచేయగా సబితారెడ్డి వైయస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల హయంలో హోంమంత్రిగా భాద్యతలు నిర్వహించింది. ఇంద్రారెడ్డి హోంమంత్రిగా పనిచేయక ముందు విద్యాశాఖ మంత్రిగా పనిచేయగా సబితారెడ్డి ప్రస్తుతం ఇంద్రారెడ్డిగా పనిచేయడానికి అవకాశం దక్కింది. సబితారెడ్డి ప్రస్తుత క్యాబినేట్‌లో ఉన్న మంత్రులలో ఎక్కువ మంది ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేసిన రికార్డు సైతం దక్కే అవకాశం ఉంది. రాజకీయాల్లో వచ్చిన నుంచి నాలుగు సార్లు శాసనసభకు పోటిచేసి ఎనాడు కూడ పరాజయం పాలు కాని నేతగా సబితారెడ్డి రికార్డు సృషించారు. తెలంగాణ రాష్ట్రం ఎర్పాటు కోసం ఇంద్రారెడ్డి నాడు జై తెలంగాణ పార్టీ స్థాపించి పోరాటం చేసి అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. సబితారెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన పోరాటం కొనసాగించారు.

ఉమ్మడి రాష్ట్రంలో సీమాంద్ర ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన తెలంగాణ ప్రయోజనాల కోసం వారితో ఎనాడు కాంప్రమైజ్ కాలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులకు అండగా నిలబడి పోరాటంకు తన వంతు సహయ సహకారం అందచేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎర్పడిన అనంతరం సైతం తెలంగాణ అభివృద్దికి తన వంతు కృషిచేశారు. బంగారు తెలంగాణ కోసం తెలంగాణ సియం కెసిఆర్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు అకర్షితులై టిఆర్‌యస్‌లో చేరారు.

ఉమ్మడి జిల్లాలో తిరుగులేని నేత….
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో గత 19 సంవత్సరాల నుంచి తిరుగులేని నేతగా సబితారెడ్డి చలామణి అవుతున్నారు. 2000 నుంచి 2018 వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఉమ్మడి జిల్లాలో తన కంటు ప్రత్యేక నెట్‌వర్క్ ను ఏర్పాటు చేసుకున్నారు. జిల్లాలో ఎక్కడ ఎవరికి కష్టం వచ్చిన తక్షణం స్పందించడంతో పాటు ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యలను విని తన వంతు సహయం చేయడంలో సబితారెడ్డిని మించిన నేత రంగారెడ్డి జిల్లాలో కనిపించే అవకాశం లేదు. జిల్లాలో నాటి నుంచి నేటి వరకు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలలో సబితారెడ్డి అభిమానులు ఉన్నారు.

జిల్లా వ్యాప్తంగా సంబరాలు
సబితారెడ్డికి మంత్రి పదవి ఖాయమని చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్న ఆదివారం సాయంత్రం క్యాబినేట్ విస్తరణకు ముహూర్తం ఖరారయిందని శనివారం రాత్రి సమాచారం బయటకు వచ్చిన నుంచి సబితారెడ్డి ఇంటికి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆదివారం ఉదయం నుంచి రాజ్‌భవన్‌కు పయనమయ్యే వరకు అభిమానులు తరలివచ్చి సబితారెడ్డికి అభినందనలు తెలిపారు. పూలమాలలు, బోకెలతో పాటు శాలువాలు తీసుకుని వచ్చి తమ ప్రియతమ నేతను సత్కరించుకున్నారు. ఆదివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే ఉమ్మడి జిల్లాలో అనేక చోట్ల అభిమానులు, టిఆర్‌యస్ నేతలు పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చి సీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.

సబితారెడ్డి ప్రొఫైల్
పేరు : సబితా ఇంద్రారెడ్డి
జననం : 5 మే 1963
తల్లితండ్రులు : జి. మహిపాల్ రెడ్డి, వెంకటమ్మ
విద్యార్హతలు : బిఎస్సీ
భర్త : పట్లోళ్ల ఇంద్రారెడ్డి,
కుమారులు : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, కళ్యాణ్ రెడ్డి

రాజకీయ ప్రస్థానం : 2000 సంవత్సరంలో భర్త ఇంద్రారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మండల పరిధిలోని పాలమాకుల వద్ద రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవడంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2000 సంవత్సరంలో జరిగిన చెవేళ్ల ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి అఖండ విజయం సాధించారు. 2004లో రెండవ సారి చెవేళ్ల నుంచి బరిలోకి దిగిన సబితారెడ్డి ఘన విజయం సాధించడంతో పాటు దివంగత రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. 2009 ఎన్నికలలో డిలిమిటేషన్‌తో నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడ్ కావడంతో 2009 శాసనసభ ఎన్నికలలో మహేశ్వరం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

మూడవ సారి ఘన విజయం సాధించిన సబితారెడ్డిని అప్పటి సియం వైయస్ రాజశేఖర్ రెడ్డి ఏకంగా ఉమ్మడి రాష్ట్రానికి హోంమంత్రిగా అవకాశం ఇచ్చారు. దేశంలోనే మొట్ట మొదటి మహిళా హోంమంత్రిగా చరిత్రలో నిలిచారు. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్‌లో సైతం మంత్రిగా కొనసాగిన సబితారెడ్డి 2013లో జగన్ అక్రమాస్తుల కేసులలో సిబిఐ సబితారెడ్డి పేరు పెటడ్డంతో నైతిక విలువలు పాటించి తన పదవికి రాజీనామా చేశారు. 2014 శాసనసభ ఎన్నికలలో ఒక కుటుంబానికి ఒకే టికెట్ అంటూ కాంగ్రెస్ పార్టీ సబితారెడ్డికి టికెట్ ఇవ్వలేదు.

2014 ఎన్నికలలో సబితారెడ్డి తన కుమారుడు కార్తీక్ రెడ్డిని చెవేళ్ల పార్లమెంట్ నుంచి బరిలోకి దించారు. 2018 ఎన్నికలలో మహేశ్వరం నుంచి బరిలోకి దిగిన సబితారెడ్డి ఘన విజయం సాధించారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం తెలంగాణ సియం కెసిఆర్ చేపడుతున్న కార్యక్రమాలకు అకర్షితులై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో కలసి టిఆర్‌యస్‌లోకి చేరారు. నాడు విద్యాశాఖ మంత్రిగా భర్త ఇంద్రారెడ్డి పనిచేయగా నేడు సబితారెడ్డికి విద్యాశాఖ మంత్రి పదవి దక్కింది.

Sabitha Indra Reddy is first woman minister of Telangana

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సబితారెడ్డి అనే నేను… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: