దివి నుంచి దిగివచ్చిన దేవకన్య

భారతీయ సినీ పరిశ్రమలో తనదైన ప్రత్యేక ముద్ర వేసి ఆలిండియా నెంబర్ వన్ హీరోయిన్ అనిపించుకున్న ఏకైక దక్షిణ భారత నటి శ్రీదేవి మాత్రమే. తెలుగు, తమిళ్‌లో ఓ వెలుగు వెలిగాక హిందీలో అడుగుపెట్టిన ఆమె.. తన సమ్మోహనపరిచే అందంతో, అద్భుత నటనతో ఉత్తరాది ప్రేక్షకులను మెప్పించి వారి ఆదరణ చూరగొంది. ఆమె అకాలమరణం చెంది ఏడాదిన్నర కావొస్తున్నా సినీ ప్రేక్షకులు ఆమెను మరచిపోలేదు. ప్రస్తుతం ఆమెకు ఒక అరుదైన గౌరవం దక్కింది. అతిలోకసుందరి శ్రీదేవి మైనపు […] The post దివి నుంచి దిగివచ్చిన దేవకన్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

భారతీయ సినీ పరిశ్రమలో తనదైన ప్రత్యేక ముద్ర వేసి ఆలిండియా నెంబర్ వన్ హీరోయిన్ అనిపించుకున్న ఏకైక దక్షిణ భారత నటి శ్రీదేవి మాత్రమే. తెలుగు, తమిళ్‌లో ఓ వెలుగు వెలిగాక హిందీలో అడుగుపెట్టిన ఆమె.. తన సమ్మోహనపరిచే అందంతో, అద్భుత నటనతో ఉత్తరాది ప్రేక్షకులను మెప్పించి వారి ఆదరణ చూరగొంది. ఆమె అకాలమరణం చెంది ఏడాదిన్నర కావొస్తున్నా సినీ ప్రేక్షకులు ఆమెను మరచిపోలేదు. ప్రస్తుతం ఆమెకు ఒక అరుదైన గౌరవం దక్కింది. అతిలోకసుందరి శ్రీదేవి మైనపు విగ్రహావిష్కరణ సింగపూర్‌లో ఘనంగా జరిగింది.

అక్కడి మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ మైనపు బొమ్మలో.. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో దివి నుంచి దిగివచ్చిన దేవకన్య పాత్రలో నటించిన శ్రీదేవి.. మళ్లీ అదే దివి నుంచి దిగివచ్చి ఈ బొమ్మలో ఒదిగిపోయిందా అన్నట్టుంది. అతిలోకసుందరి అనే పేరుకు సార్ధక నామధేయురాలు శ్రీదేవి మాత్రమే అని మరోసారి అనిపించకమానదు. బంగారం రంగు దుస్తుల్లో తలపై కిరీటంతో శ్రీదేవి బొమ్మ చూపరులను ఆకట్టుకుంటోంది. శ్రీదేవి నటించిన సూపర్ హిట్ హిందీ చిత్రం ’మిస్టర్ ఇండియా’లోని హవా.. హవాయి పాట లుక్ ఆధారంగా ఈ విగ్రహాన్ని మలిచారు నిర్వాహకులు.

Sridevi wax statue

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post దివి నుంచి దిగివచ్చిన దేవకన్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.