దేవుని సృష్టికర్త మనిషే!

  దేవుడు మనిషిని పుట్టించాడా? లేక మనిషి దేవుణ్ణి సృష్టించాడా? అన్నవి రెండు ప్రశ్నలు! ఈ రెండూ ఉత్తర దక్షిణ ధృవాల్లాంటివి. దేవుడు మనిషిని పుట్టించాడని నమ్మే వారికి మనం చెప్పేదేం లేదు. అయితే దానికి ఆధారాలు మాత్రం ఏవీ లేవని ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. మనిషి దేవుడికి ఒక రూపం ఇచ్చాడని జీవ పరిణామంపై గౌరవమున్న వారు సులభంగా గుర్తించగలుగుతారు. ‘ఆంత్రపోమార్పిజం’ గురించి ఏ మాత్రం తెలుసుకున్నా, మన దేవుళ్లందరూ మానవాకారాల్లోనే ఎందుకున్నారో అర్థమవుతుంది. జీవ […] The post దేవుని సృష్టికర్త మనిషే! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

దేవుడు మనిషిని పుట్టించాడా? లేక మనిషి దేవుణ్ణి సృష్టించాడా? అన్నవి రెండు ప్రశ్నలు! ఈ రెండూ ఉత్తర దక్షిణ ధృవాల్లాంటివి. దేవుడు మనిషిని పుట్టించాడని నమ్మే వారికి మనం చెప్పేదేం లేదు. అయితే దానికి ఆధారాలు మాత్రం ఏవీ లేవని ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. మనిషి దేవుడికి ఒక రూపం ఇచ్చాడని జీవ పరిణామంపై గౌరవమున్న వారు సులభంగా గుర్తించగలుగుతారు. ‘ఆంత్రపోమార్పిజం’ గురించి ఏ మాత్రం తెలుసుకున్నా, మన దేవుళ్లందరూ మానవాకారాల్లోనే ఎందుకున్నారో అర్థమవుతుంది. జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం జీవి నీటి లో పుట్టింది. నీటిలో పెరిగింది. మెల్లగా భూమిపైకి వచ్చింది. ఉభయ చరంగా బతికింది. నేల మీద పాకింది. గాల్లో ఎగిరింది. చెట్ల మీద విహరించింది. గుహల్లో చేరి సమాజాలు ఏర్పరుచుకుంది. హిందూ పురాణ గ్రంథాల ప్రకారం దేవుడికి పది అవతారాలు ఉన్నాయి. మత్సవతారం, కూర్మావతారం, వరాహావతారం, కృష్ణావతారం, బుద్ధావతారం, కల్కావతారం, వీటిని పరిశీలిస్తే మన పూర్వీకులు జీవ పరిణామ సిద్ధాంతాన్ని కొంతలో కొంత గణనలోకి తీసుకున్నారనే అనుకోవాలి. ఇది ఒక కోణంలో చేసిన ఆలోచన మాత్రమే. వైజ్ఞానికంగా దేవుడి అస్తిత్వాన్ని నిలబెట్టాలన్న ప్రయత్నం ఎంత మాత్రమూ కాదు.

మనిషి దైవ భావనకు ఒక రూపాన్నిచ్చి, మళ్లీ ఆ రూపాన్ని రకరకాలుగా విభజించుకుని, వాటిని నిలబట్టుకోవాలనే ప్రయత్నంలో వివిధ రకాల ప్రార్థనా స్థలాలు కట్టుకున్నాడు. ఈ రోజు పుట్ట గొడుగుల్లా రాజకీయ పార్టీలు పుట్టుకొస్తున్నట్టుగానే, పూర్వ కాలంలో మతాలు పుట్టుకొచ్చాయి. దేవుడొక్కడే అని అన్ని మతాల వారు ఒప్పుకుంటారు. కాని ఎవరి దేవుడికి వారే భజన చేస్తుంటారు. సగటు మనిషి జీవన ప్రమాణాలు పెంచుతామనే అన్ని రాజకీయ పార్టీలు చెపుతుంటాయి. అయినా ఎవరి ప్రయోజనం వారు చూసుకుంటూ ఉంటారు కదా? సరే, జీవ పరిణామ విషయానికొస్తే, చేపలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు ఒక వరుసలో రూపొందుతూ వచ్చాయని వైజ్ఞానికులు భావిస్తున్నారు. అవతారాలు కూడా అదే వరుసలో ఉండడం గమనించదగ్గ విషయం.

మత్సం (చేప) కూర్మం (సరీసృపం) వరాహం (క్షీరదం) అలాగే ఉభయ చరాలు, అనుసంధాన జీవులు (కనెక్టింగ్ లింక్స్) ఉన్నాయి. నేల మీదా, నీటి మడుగులోనూ జీవించే వరాహం ఒక అవతారం గానూ జంతువూ మనిషి కలయికకు సంకేతంగా నరసింహావతారమూ ఉన్నాయి. జీవశాస్త్ర పరంగా ఇలాంటి అనుసంధాన జీవి మనకు ఎక్కడా కనబడదు. కాని సరీనృపాలకు, పక్షులకు మధ్య ‘ఆర్కియాప్టరిక్స్’ ఉంది. అలాగే సరీనృపాలకు క్షీరదాలకూ మధ్య ‘ప్లాటిపస్’ ఉంది. ఇలా రెండు జాతుల లక్షణాలతో మూడో జాతి జీవులు పుట్టడమన్నది జంతువుల్లోనూ, వృక్షాలలోనూ ఉన్నదే. బహుశా ఇలాంటి అంశాన్ని ప్రస్పుటం చేయడానికే నరసింహావతారానికి రూప కల్పన చేసి ఉంటారు. తరువాత ఉన్న అవతారాలన్నీ పూర్ణ మానవుడి రూపాలు! పరశురాముడు, రాముడు, కృష్ణుడు వగైరా రాజులను సంహరించడమే ధ్యేయంగా పరశురాముడు అరణ్య జీవనం సాగించాడు. రాముడు చాలా కాలం అరణ్యాల్లో గడిపినా, చివరకు రాజుగా ప్రజాపాలన సాగించాడు. కృష్ణుడు రాసలీలకు, విశ్వప్రేమకు, రాజనీతికి, యుద్ధ నైపుణ్యానికి సంకేతంగా నిలిచాడు. అంతేకాదు జీవం అనంతమైంది. దానికి చావు లేదు. అది పుడుతూ ఉంటుంది. గిడుతూ ఉంటుంది అని చెప్పిన గీతకారుడు కూడా ఆయనే!

బౌద్ధ మతం విశ్వవ్యాప్తంగా తన ప్రభావం చూపుతున్న దశలో హిందువులు చటుక్కున బుద్ధుణ్ణి తమ దేవతల అవతారాలలో కలిపేసుకున్నారు. బుద్ధుడు ఈ దేశంలో పుట్టి, ఈ నేల మీద తిరుగాడిన వాడు. పైగా, దేవుడనే వాడు ఎవరూ లేడని చెప్పిన వాడు. చారిత్రక పురుషుడు. మిగతా అవతారాలన్నీ కల్పిత పాత్రలు. ఇక చివరిది కల్కి అవతారం దానికి అతా పతా లేదు. ఇది కలియుగమని, దీన్ని ఉద్ధరించడానికి దేవుడు కల్కి అవతారంలో అశ్వారూఢుడై శరవేగంతో వస్తున్నాడని చెపుతారు. అంతే. ఎవరూ వచ్చింది లేదు. ఏమీ చేసింది లేదు. నేరాలు, ఘోరాలు ఇంతగా జరుగుతుంటే.. ఆ అవతార మెత్తిన దేవుడు ఏం చేస్తున్నాడూ? చిన్న పిల్లల మీద, పసి కూనల మీద అత్యాచారాలు, హత్యలు జరుగుతూ ఉంటే కల్కి దేవుడికి కనబడడం లేదా? అలాంటి వాడు ఒకడున్నాడనేదే అబద్ధమైనప్పుడు మిగతావన్నీ అబద్ధాలే అవుతాయి.

కదా? మనిషి తన మేధా శక్తితో గంటకు 850 కి.మీ. వేగంతో పోయే బుల్లెట్ ట్రెయిన్లు, వెయ్యికి పైగా పోయే జెట్ విమానాలు, అంతకు పది రెట్లు ఎక్కువ వేగంతో పోయే రాకెట్లు కనిపెట్టిన వాడి దగ్గరికి కల్కి తన గుర్రం మీద ఢక్కుం ఢక్కుం అంటూ గంటకు 10 కి.మీ. వేగంతో వస్తే.. అతను ఎంతటి నిర్బలుడిగా కనపడతాడూ? కొరియాలో ప్రయోగిస్తే అమెరికాలో మహానగరం ధ్వంసమయ్యే అణు బాంబులు మనిషి తయారు చేస్తే, కత్తీ డాలు పట్టుకుని వచ్చే కల్కి మనిషిని ఏ విధంగా శిక్షంచగలడూ? ప్రాథమిక దశలో మనిషి తన అవగాహన మేరకు ఊహించుకున్నవే అవతారాలు తప్ప , ఇవి మరేమీ కాదు!

అయతే ఈ అవతారాలలో ఒక క్రమం ఒక ఎదుగుదల కనిపిస్తుందన్నది మనం అర్థం చేసుకోవాలి. అరణ్య జీవనం లోంచి సాంఘిక జీవనంలోకి వచ్చి, అందులో రాజకీయ, ఆర్థిక, సామాజిక చైతన్యాన్ని సాధించిన వైనం కనిపిస్తుంది. ఇదంతా మానవుడు సాధించిన ప్రగతే. తాను సాధిస్తూ వచ్చిన ప్రగతిని, తాను పరిశీలిస్తూ వచ్చిన జీవ పరిణామాన్ని, జీవ చైతన్యాన్ని మనిషి, దేవుడి అవతారాలకు అన్వయించడాని చెప్పడానికి ఈ వివరణ ఉపయోగపడుతుంది. అవతారాలన్నీ మనిషి కల్పనలే గనుక, దేవుడి రూపాలన్నీ మానవాకారంలోనే ఉన్నాయి. ఒక ఆవు, ఒక సింహం, ఒక మేక దేవుణ్ణి ఎలా దర్శిస్తున్నాయో మనకు తెలియదు. బహుశా అవి వాటి వాటి ఆకారాల్లోనే దేవుణిణ తలుస్తూ ఉండొచ్చు. అసలైతే వాటికి ‘దైవ స్పృహ’ ఉందన్న విషయం తెలియ రాలేదు.

మనిషి అడవి జంతువులకు భయపడి, ఆదిమ సమాజంలో వాటిని అధ్యయనం చేయలేక సర్పాల వంటి జంతువుల్ని పూజిస్తూ ఉన్నా, మళ్లీ అత్యున్నతమైన గౌరవ స్థానం మానవ ప్రతిమకే ఇచ్చాడు. అంటే ఇక్కడ రెండు విషయాలు స్పష్టమవుతునాయి. తనకు అంతు పట్టని శక్తి ఏదో ఉంది అని మనిషి నమ్మాడు. అలాగే ఆ శక్తిని మానవాకారంలోనే దర్శించాడు. శివుడు, ఆదిశక్తి వంటి రూపాలు కూడా మానవాకారాలే కదా? ప్రపంచాన్ని అర్థం చేసుకునే శక్తి మనిషిలోనే ఉంది. దాన్ని తనకు అనువుగా మార్చుకునే శక్తి మనిషిలోనే ఉంది. భగవంతుని అంటే సృష్టికర్త ‘అంశ’ మరెక్కడో లేదు. మనిషిలోనే ఉందని అర్థం చేసుకోవాలి.

దేవుణ్ణి రూపొందించుకోవడమే కాదు, గుళ్లు, గోపురాలు, మసీదు, చర్చ, గురు ద్వారాల నిర్మాణాలు కూడా మానవ మేధస్సు రూపకల్పన చేసిందే! గుట్టల మీద, కొండల మీద, దట్టమైన అరణ్యాల మధ్య, స్వచ్ఛమైన గాలి, నీరు లభ్యమయ్యే చోట, అన్ని కాలుష్యాలకు దూరంగా మనిషి ప్రార్థనా స్థలాలు నిర్మించడం గమనించదగ్గ విషయం. తర్వాత కాలంలో అవే గొప్ప కాలుష్య కేంద్రాలయ్యాయన్నది వేరే విషయం! ఎంతటి గొప్ప గొప్ప పురాతన ఆలయాలయినా, అవన్నీ మానవ నిర్మితాలే కాని, దేవుళ్లు తమకు తాము నిర్మించుకున్నవి కావు. రాళ్లతో నిర్మించబడ్డ ఆనాటి ఎత్తయిన స్ంతభాలు, సభా మండపాలు, మన పూర్వుల శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని వెల్లడిస్తున్నాయి. అంతే కాదు, వారి కళా ప్రేమని, కళారాధనని, హృదయ సౌందర్యాన్ని తరతరాలకూ పరిచయం చేస్తూ వస్తున్నాయి. అద్భుతమైన శిల్ప సంపద, సుమధురమైన సంగీతం, విలువైన వలువలు, ఆబాల గోపాలానికి ఇష్టమయ్యే తీర్థ ప్రసాదాలు ఇలా ప్రతి అంశమూ ఎంతో ఆలోచించి, విచక్షణ చేసి ఏర్పరుచుకున్నవే గాని, అల్లాటప్పాగా చేసింది కాదు. మనిషి తనకు తెలిసిన విజ్ఞాన సర్వస్వాన్ని అంతా దేవాలయాల ఇతర మతాల ప్రార్థనా స్థలాల నిర్మాణంలో, నిర్వహణలో ఉపయోగించాడు.

శుభ్రతకు అత్యంత ప్రాధాన్యత నిచ్చాడు. నీతి, నియమాలకు ప్రాధాన్యత నిచ్చాడు. అందువల్ల దేవుళ్లను సృష్టించుకోవడమే కాదు, వారి కోసం ప్రత్యేక నిలయాల నిర్మాణం కూడా వైజ్ఞానిక స్పృహతోనే చేశాడు. కాని ఏమైంది? మనిషిలోని స్వార్థం వెర్రి తలలు వేస్తూ వచ్చింది. దేవుడి పేరుతో అవన్నీ వ్యాపార కేంద్రాలయ్యాయి. తాగుడు, జూదం, వేశ్యా వృత్తి లేని ‘పుణ్య’ క్షేత్రాలున్నాయా? ఆలోచించండి.. సంగీత, సాహిత్యాల్ని నృత్యాన్నీ సకల కళల్ని దేవుడి చుట్టూ, ఆధ్యాత్మికత చుట్టూ తిప్పి వాటికి ఎదుగుదల లేకుండా చేశారు. ఆ పరిధిలోంచి బయటపడి తమ సృజనాత్మకతను ప్రదర్శించిన వారే విశ్వ సృజనకారులయ్యారు. అవుతున్నారు. కళలు ప్రదర్శించాలన్నా, వాటిని విస్తరించుకోనివ్వాలన్నా విజ్ఞాన శాస్త్రం వాటికి వెన్నెముక లాగా పని చేయాల్సిందే! అందువల్ల, దైవ భావనకు కూడా వెన్నెముక సైన్సే! దేవుడి మీద నమ్మకం బలపడడానికి కొందరు సైన్సును విపరీతంగా ఉపయోగించుకుంటున్నారు. తప్పితే, సైన్సు అభివృద్ధి కావడానికి దైవ భావన ఎప్పుడూ ఎక్కడా ఉపయోగపడలేదు. ఇది యధార్థం!

Some People believe in God

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post దేవుని సృష్టికర్త మనిషే! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: